Jump to content

అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి

వికీసోర్స్ నుండి
(అదిగో భద్రాద్రి నుండి మళ్ళించబడింది)


            వరాళి రాగం            ఆది తాళం

ప: అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి || అదిగో ||


చ1: ముదముతో సీత ముదిత లక్ష్మణుడు

కదసి కొలువగా కలడదె రఘుపతి || అదిగో ||


చ2: చారు స్వర్ణ ప్రాకార గోపుర

ద్వారములతో సుందరమై యుండెడి || అదిగో ||


చ3: అనుపమానమై అతిసుందరమై

తనరు చక్రమది ధగ ధగ మెరిసెడి || అదిగో ||


చ4: కలియుగమందున నిల వైకుంఠము

నలరుచునున్నది నయముగ మ్రొక్కుడి || అదిగో ||


చ5: పొన్నల పొగడల పూపొద రిండ్లతొ

చెన్ను మీరగను చెలగుచునున్నది || అదిగో ||


చ6: శ్రీకరముగ శ్రీరామదాసుని

ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము || అదిగో ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.