అథర్వణవేదము - కాండము 17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
అధర్వణవేదము (అథర్వణవేదము - కాండము 17)విషాసహిం సహమానం సాసహానం సహీయాంసమ్ |

సహమానం సహోజితం స్వర్జితం గోజితం సంధనాజితమ్ |

ఈడ్యం నామ హ్వ ఇన్ద్రమాయుష్మాన్భూయాసమ్ ||1||


విషాసహిం సహమానం సాసహానం సహీయాంసమ్ |

సహమానం సహోజితం స్వర్జితం గోజితం సంధనాజితమ్ |

ఈడ్యం నామ హ్వ ఇన్ద్రమ్ప్రియో దేవానాం భూయాసమ్ ||2||


విషాసహిం సహమానం సాసహానం సహీయాంసమ్ |

సహమానం సహోజితం స్వర్జితం గోజితం సంధనాజితమ్ |

ఈడ్యం నామ హ్వ ఇన్ద్రమ్ప్రియః ప్రజానాం భూయాసమ్ ||3||


విషాసహిం సహమానం సాసహానం సహీయాంసమ్ |

సహమానం సహోజితం స్వర్జితం గోజితం సంధనాజితమ్ |

ఈడ్యం నామ హ్వ ఇన్ద్రమ్ప్రియహ్పశూనాం భూయాసమ్ ||4||


విషాసహిం సహమానం సాసహానం సహీయాంసమ్ |

సహమానం సహోజితం స్వర్జితం గోజితం సంధనాజితమ్ |

ఈడ్యం నామ హ్వ ఇన్ద్రమ్ప్రియః సమానానాం భూయాసమ్ ||5||


ఉదిహ్యుదిహి సూర్య వర్చసా మాభ్యుదిహి |

ద్విషంశ్చ మహ్యం రధ్యతు మా చాహం ద్విషతే రధం తవేద్విష్ణో బహూధా వీర్యాని |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||6||


ఉదిహ్యుదిహి సూర్య వర్చసా మాభ్యుదిహి |

ఆంశ్చ పశ్యామి యాంశ్చ న తేషు మా సుమతిం కృధి తవేద్విష్ణో బహూధా వీర్యాని |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||7||


మా త్వా దభన్త్సలిలే అప్స్వన్తర్యే పాశిన ఉపతిష్ఠన్త్యత్ర |

హిత్వాశస్తిం దివమారుక్ష ఏతాం స నో మృడ సుమతౌ తే స్యామ తవేద్విష్ణో బహూధా వీర్యాని |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||8||


త్వం న ఇన్ద్ర మహతే సౌభగాయాదబ్ధేభిః పరి పాహ్యక్తుభిస్తవేద్విష్ణో బహూధా వీర్యాని |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||9||


త్వం న ఇన్ద్రోతిభిః శివాభిః శంతమో భవ |

ఆరోహంస్త్రిదివం దివో గృణానః సోమపీతయే ప్రియధామా స్వస్తయే తవేద్విష్ణో బహూధా వీర్యాని |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||10||


త్వమిన్ద్రాసి విశ్వజిత్సర్వవిత్పురుహూతస్త్వమిన్ద్ర |

త్వమిన్ద్రేమం సుహవం స్తోమమేరయస్వ స నో మృడ సుమతౌ తే స్యామ తవేద్విష్ణో బహూధా వీర్యాణి |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||11||


అదబ్ధో దివి పృథివ్యాముతాసి న త ఆపుర్మహిమానమన్తరిక్షే |

అదబ్ధేన బ్రహ్మణా వావృధానః స త్వం న ఇన్ద్ర దివి సం ఛర్మ యఛ తవేద్విష్ణో బహూధా వీర్యాణి |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||12||


యా త ఇన్ద్ర తనూరప్సు యా పృథివ్యాం యాన్తరగ్నౌ యా తే ఇన్ద్ర పవమానే స్వర్విది |

యయేన్ద్ర తన్వా3 ऽన్తరిక్షం వ్యాపిథ తయా న ఇన్ద్ర తన్వా శర్మ యఛ తవేద్విష్ణో బహూధా వీర్యాణి |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||13||


త్వామిన్ద్ర బ్రహ్మణా వర్ధయన్తః సత్త్రం ని షేదురృషయో నాధమానాస్తవేద్విష్ణో బహూధా వీర్యాణి |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||14||


త్వం తృతం త్వం పర్యేష్యుత్సం సహస్రధారం విదథం స్వర్విదం తవేద్విష్ణో బహూధా వీర్యాణి |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||15||


త్వం రక్షసే ప్రదిశశ్చతస్రస్త్వం శోచిషా నభసీ వి భాసి |

త్వమిమా విశ్వా భువనాను తిష్ఠస ఋతస్య పన్థామన్వేషి విద్వాంస్తవేద్విష్ణో బహూధా వీర్యాణి |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||16||


పఞ్చభిః పరాఙ్తపస్యేకయార్వాఙశస్తిమేషి సుదినే బాధమానస్తవేద్విష్ణో బహూధా వీర్యాణి |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||17||


త్వమిన్ద్రస్త్వమ్మహేన్ద్రస్త్వం లోకస్త్వం ప్రజాపతిః |

తుభ్యం యజ్ఞో వి తాయతే తుభ్యం జుహ్వతి జుహ్వతస్తవేద్విష్ణో బహూధా వీర్యాణి |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||18||


అసతి సత్ప్రతిష్ఠితం సతి భూతం ప్రతిష్ఠితమ్ |

భూతమ్హ భవ్య ఆహితం భవ్యం భూతే ప్రతిష్ఠితం తవేద్విష్ణో బహూధా వీర్యాణి |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||19||


శుక్రో ऽసి భ్రాజో ऽసి |

స యథా త్వం భ్రాజతా భ్రాజో ऽస్యేవాహం భ్రాజతా భ్రాజ్యాసమ్ ||20||


రుచిరసి రోచో ऽసి |

స యథా త్వం రుచ్యా రోచో ऽస్యేవాహం పశుభిశ్చ బ్రాహ్మణవర్చసేన చ రుచిషీయ ||21||


ఉద్యతే నమ ఉదాయతే నమ ఉదితాయ నమః |

విరాజే నమః స్వరాజే నమః సమ్రాజే నమః ||22||


అస్తంయతే నమో ऽస్తమేష్యతే నమో ऽస్తమితాయ నమః |

విరాజే నమః స్వరాజే నమహ్సమ్రాజే నమః ||23||


ఉదగాదయమాదిత్యో విశ్వేన తపసా సహ |

సపత్నాన్మహ్యం రన్ధయన్మా చాహం ద్విషతే రధం తవేద్విష్ణో బహూధా వీర్యాణి |

త్వం నః పృణీహి పశుభిర్విశ్వరూపైః సుధాయాం మా ధేహి పరమే వ్యోమన్ ||24||


ఆదిత్య నావమారుక్షః శతారిత్రాం స్వస్తయే |

అహర్మాత్యపీపరో రాత్రిం సత్రాతి పారయ ||25||


సూర్య నావమారుక్షః శతారిత్రాం స్వస్తయే |

రాత్రిం మాత్యపీపరో ऽహః సత్రాతి పారయ ||26||


ప్రజాపతేరావృతో బ్రహ్మణా వర్మణాహం కశ్యపస్య జ్యోతిషా వర్చసా చ |

జరదష్టిః కృతవీర్యో విహాయాః సహస్రాయుః సుకృతశ్చరేయమ్ ||27||


పరివృతో బ్రహ్మణా వర్మణాహమ్కశ్యపస్య జ్యోతిషా వర్చసా చ |

మా మా ప్రాపన్నిషవో దైవ్యా యా మా మానుషీరవసృష్టాః వధాయ ||28||


ఋతేన గుప్త ఋతుభిశ్చ సర్వైర్భూతేన గుప్తో భవ్యేన చాహమ్ |

మా మా ప్రాపత్పాప్మా మోత మృత్యురన్తర్దధే ऽహం సలిలేన వాచః ||29||


అగ్నిర్మా గోప్తా పరి పాతు విశ్వతః ఉద్యన్త్సూర్యో నుదతాం మృత్యుపాశాన్ |

వ్యుఛన్తీరుషసః పర్వతా ధ్రువాః సహస్రం ప్రాణా మయ్యా యతన్తామ్ ||30||అధర్వణవేదము


మూస:అధర్వణవేదము