అడుగు దాటి కదల నియ్యను

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

[రామదాసు కీర్తనలు]] | రచయిత = రామదాసు

   వరాళి రాగం   త్రిపుట తాళం

ప: అడుగుదాటి కదల నియ్యను నా కభయ మియ్యక నిన్ను విడువను || అడుగు

అ.ప.: గడియ గడియకు తిరిగి తిరిగి యడిగితిని వేసార వచ్చెను గడువు తప్పిన నేను నిక బహు దుడుకుతనములు సేయుదును నిను||అడుగుll

చ1: కుదురుగా కూర్చుండనియ్యను కోపమొచ్చిన భయముచెందను మది నెరింగీ యుండుమిక మొగ మాట మేమియు లేదుగద నా హృదయకమలమునందు నీ మృదు పదములను బంధించివేతును|| అడుగు ||

చ2: రేపు మాపని జరిపితే నే

   నపుజేసెడివాడగానుు
   ప్రాపు నీవని నమ్మి కొలిచిన
   పాపములల నెడబాపి దయతో 
   తేప తేపకు నీదు మోమిటు
   జూపకుండిన నోర్వసుమ్మి|| అడుగు ||

చ3: పతితపావన బిరుదు లేదా

   పాలనము నను సేయరాదా
   ప్రతి దినంబును దేవ నిను భూ
   పతి వటంచును వేడినను నీ
   హిత జనంబులు వచ్చి నను బ్రతి
   మాలినను విడబోను నిన్ను||అడుగు   ||

చ4: రాక్షసాంతక భక్తవరదా

   సారసాక్ష సుజనరక్షక

ఈ క్షణంబున దీనజనుడని

 మోక్షమియ్యక యుంటివ నిను
 సాక్షిబెట్టియు నేడు నేనొక 
 దీక్షచే సాధింతు నిన్ను   ||   అడుగు   ||

చ5: భూరి భద్రాచల నివాసా

   భుజగశయనా భక్తపోష
   కూరిమిగ నిను విడిచిపెట్టిన 
   ధరణిలో భద్రాద్రిరాఘవ
   రామదాసుం డనెడి నామము
   మారుపేరున పిలువు నన్ను||అడుగll