అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం/జ్యోతి
జ్యోతి
| 67 |
| 69 |
| 70 |
| 71 |
| 73 |
| 74 |
| 75 |
| 77 |
| 78 |
| 79 |
| 80 |
| 81 |
| 83 |
| 85 |
| 87 |
| 88 |
| 89 |
| 90 |
| 92 |
| 93 |
| 94 |
| 95 |
| 96 |
| 97 |
| 99 |
| 100 |
| 102 |
| 103 |
| 105 |
| 106 |
చీకటి
రూపాలు రంగులూ
చూపులూ సోద్యాలు
అంచులూ హద్దులూ
ఆద్యాలనంతాలు
నీలోన లేవూ!
నీలోన కావూ!
స్వప్నఖని కాంక్షమయి
సర్వమయి ఏకాంగి చీకటీ! చీకటీ!
నీ మూర్తిలో కరుగు
నిఖిల గోప్యాలంట
నీ నవ్వులో విరుగు
నిఖిల స్పష్టతలంట
సకల సౌందర్యాలు
సర్వ వికృతములై
నీలోన లేవూ!
నీలోన కావూ!
శాంతిమయి తాపసీ
దాంతిమయి ఓజసీ చీకటీ! చీకటీ!
గోమాయు రావమూ
ఘూక వికృత స్వరము
చీరుకా కిరకిరము
సింహగర్జన ఘోష
నీ నిశ్చలత నణగు
నీ నిర్మలత కరుగు
పూర్ణ రూపాంగినీ
పుణ్య శోభాంగినీ చీకటీ! చీకటీ!
పూరి గుడిసెల ఏడ్పు
తూగుటుయ్యల ఊర్పు
భిక్షురాలీ పాట
గానప్రజ్ఞుని గీతి
నీ గొంతులో ఒదుగు
నీ పెదవిలో మెదుగు
సర్వరస వల్లరీ
సర్వస్వ రూపినీ చీకటీ! చీకటీ!
వికలాశయుని శోకి
వీతపథ భయమూరి
అవమానభగ్నఖలు
ఆత్మసంవేదనుని
ఒడిలోన తాల్చుతూ
వక్షాన కదుముతూ
జోకొట్టి నిద్ర లిడి
జోలపాడే తల్లి!
ప్రేమమయి! సాత్వతీ!
వ్యోమమయి సుందరీ! చీకటీ! చీకటీ
కవితా స్రవంతి
వేయి సంవత్సరాల్ వెనకాల కవినోయ్
వేయి సంవత్సరాల్ వెడుతూనే కవినోయ్,
వేయి సంవత్సరాల్...
వేదాల ఋక్కులో పాడాను నే నోయ్
వాల్మీకి గొంతులో ప్రవహించినా నోయ్
వేయి సంవత్సరాల్...
వ్యాసర్షి గీతిలో ప్రజ్వరిల్లానోయ్
కవిగుణాఢ్యుని రక్తకణమును నేనే నోయ్
వేయి సంవత్సరాల్...
కాళిదాసానంద కంపితస్వరమునోయ్
ఆంధ్రకవి భవభూతి అమృత శ్లోకాన్నోయ్
వేయి సంవత్సరాల్...
నన్నయ్య తిక్కన్న వెన్నెల కవిత్వాన్ని
ఈనాటి పాటలో ఇమిడిపోయానోయ్
వేయి సంవత్సరాల్...
దేశాల కవితలో దీపించినానోయ్
అశాంతముల వరకు ఆవరించే నోయ్
వేయి సంవత్సరాల్...
లేవరా!
లేవరా! భరతపుత్ర లేవరా!
దేవినూత్న శక్తిమూర్తి
దేవి మహాశాంతమూర్తి
భావి మూర్తి భరత మాత
లేవరా! చేతులొగ్గి మొక్కరా!
నూత్నసృష్టి చిరునవ్యై
నూత్నదీక్ష కళ్ల మెరసి
యత్నఫలోన్ముఖ చరితా!
లేవరా! సుకేతనా నడవరా!
పొలముదున్న యాజివై
వెలిగిపొమ్ము హవ్యమై
ఫలము కొమ్ము భోక్తవై
లేవరా! పథములెల్ల గడవరా!
సంగమేశ్వరుడు
పలికిస్తివయ్య నీ బంగారు వీణా
ఒలికిస్తివయ్య మాకమృతంపు వానా
మీటిస్తివా వెలుగు మేళవించిన తీగె!
పండుపరువపు పనస పరమ సుందరమూర్తి
లలితాచ్ఛరదన శిల్పప్రసాదిత మూర్తి
పలికిస్తివయ్య నీ బంగారు వీణా
ఓంకార కలశమ్ము ఝంకార కకుభమ్ము
సామగీతాపూర్ణ సామ్యతుంబీ ఫలము
రామేతి హాస గానామృత స్రవశిరము
ఉపనిషదాగ్రనృత్యోద్వేగ తతపంక్తి
పలికిస్తివయ్య నీ బంగారు వీణా
గరిసెప్పజలపాతగంభీర నిర్ఘోష
మానస సరోర్మికా మధురాస్ఫుట శ్రుతులు
కలయించి కలవించి కరిగించి రాగాలు
మీటిస్తు స్పందిస్తు మెట్లపై జారుతూ
పలికిస్తివయ్య నీ బంగారు వీణా
కారుమబ్బుల ఇరులు కమ్మినవి దెసలెల్ల
హోరుమనుగాలిలో జోరున వర్షమ్ము
దళా ధళా మిలమిలా వెలిగెరా మెరుములా
ఉరుములూరేనా విరుచుకొని పడినట్లు
పలికిస్తివయ్య నీ బంగారు వీణా
మలయపవనాలలో మందగతి పులకలూ
కోకిలల గొంతులో కుహుకుహూ గీతాలు
మల్లెల గులాబీ మధుర హృది తుమ్మెదా
వాసంతి కాసౌరభావృత సుందరత
పలికిస్తివయ్య నీ బంగారు వీణా
నాట్యమై పోయెరా లాస్య కైశికి వచ్చె
నృత్తమైవడులతో చిత్రాలు కరిగించె
ఆడెరా తాండవం భారభటి వృత్తిలో
అప్సరాపన్నగా గాంగానంద ముర
భారతీదేవిరా, పరమ నట మూర్తిరా
పలికిస్తివయ్య నీ బంగారు వీణా
లోకాలలో లయలు, లోకేశుడమరుకము
భానుమండలకీర్ణప్రజ్వలిత కీలా
శీతాంశు కదలికలు శ్రీ కృష్ణ కింకిణులు
తానాలలో వింటి, యీనాటి పాటా
పలికిస్తి వయ్య నీ బంగారు వీణా
వీణలో చేరావొ, వేదాలకలిశావో
ఆది శబ్దములోన అణగి మణగితివో
ఆకాశ నీలాల ఐక్యమైపోయావొ
సంగమేశా! వీణ శబ్దించు మాలోన!
(మహా వైణికులు శ్రీ తుమరాడ సంగమేశ్వర శాస్త్రి స్మృతిగీతం)
భేరీ
ఎవరోహో పిరికి పంద?
ఎవరోహో నిద్రపోతు?
ఏరువచ్చె పొంగిపొర్లి
తీరాలను ముంచి తేల్చె.
ఏళ్లు ఊళ్లు ఏకమయ్యే.
ఓళ్లు బండ్లు ఒక్కటయ్యె!
ఎవరోహో ఎవరోహో !
రొమ్ము తెరచి ఉరుకులోన,
చేయిచాచి యీతలోన
వీరులెవరు ఎదురీతకు?
శూరులెవరు నావ నడప?
ఎవరోహో, ఎవరోహో !
కర్ణధారి యోగి గాంధి
పర్ణశాల వెడలి వచ్చి
ఆర్ణవాన్ని గడప ప్రేమ
పూర్ణదీక్ష భాసిల్లెను
ఎవరోహో, ఎవరోహో!
కాగడా!
స్వాతంత్ర్య మహాజ్యోతి జగజ్జగాల వెలిగింది
కాగడా వెలిగింది కారు లోతులలోన
కాగడా వెలిగింది కాంతి ప్రసరించింది!
మేలి ముసుగులు జార నీలిమడతలు దిద్ది
తడబడుతు పరుగిడెను వడివడిగ చీకట్లు
కాగడా వెలిగింది, కాంతి ప్రసరించింది
కాగడా! కాగడా! కాగడా వెలిగింది!
గోప్యాలు మాసినవి గుసగుసలు అణిగినవి
గోచరించెను ఎదుట కోటి మోహనమూర్తి “కాగడా”
మా దోష కర్కశాల్ 'మాకు స్పష్టాలయ్యె
మా వికృతమూర్తులే మాకు కన్పించాయి “కాగడా”
ఆ ఒక్క కాగడే అంటించె కోటినే
అఖిల మనుజుల చేతులందాయి కాగడాల్ “కాగడా”
ఆరిపోయిన హృదయ హారతులు వెలిగినవి.
దారి తెలియని మాకు దూరాలె కనబడెను "కాగడా”
సత్యమ్ము వెదకునట శాంతి వెదజల్లునట
జగమంత వెలుగులో సొగసు తీరుచునట “కాగడా”
31.12.46
మహాత్మాగాంధి
హిమాలయోత్తుంగ శృంగం
నీ బ్రతుకు
ఉమాపతీ నృత్యరంగం
దేశాల వాంఛల్లు
ఆశాహృదయముల్లు
నేలొదిలి పోలేని
శీతల తలాలలో
జీమూత పంక్తిపై
వ్యోమవర్త్మము చొచ్చు ॥హిమాలయో॥
సర్వ జన పథ కోట్లు
సాగి యాత్రార్ధులై
జన్మలు పవిత్రమై
ఛవులొంద
స్నాతులగు
సంగమానికి చేరు
నీ కళ్ల థళథళలు
నీ మాట పాటల్లు
నీ బోసి నవ్వుల్లు
వేణీత్రయమ్మౌతు
ఏనుండి వెడలెరా
అది మహాసత్యమ్ము ॥హిమాలయో॥
శిల్ప సూత్రార్థాలు
తెల్పు సౌందర్యాలు
స్వల్పమైమూర్తిలో
దేశ దేశాల అశాంతాలు వెలిగిస్తు
నీ అహింసావ్రతములో
నీ సత్య యోగమ్ములో నీ దేశికత్వమ్ములో
రేకల్లు తిరుగుతూ
లోకమోహన మయ్యె మహాత్మా ॥హిమాలయో॥
మార్చి 1930
ముసలి తాత
పొరలు కమ్మి పుసులు కట్టి
శాంతి ఉడిగి కాంతి తగ్గి
లోతులలో దిగుడు పోయి
నూతులలో సుడులు పోయి
వితమెరుగని చూపులు
కతలే తెలియని పాపలు
ఏలోకాలకు పోయినవో
ఏదరిసెన మెరిగినవో?
నీ మాటలు మావికావు
నీ వినికిడి ఈడలేదు
తెలి పన్నులు లేని నోరు
తీపి మాటరాని గళము
రాగాలన్నీ కూరిచి రాగాతీతమ్మై పోయాయో
ముడతలు పడి నీ దేహము
ముడులు సడిలి వడిలిపోయి
తడియారిన నీ చర్మము
వంగికుంగి వణికిపోయి
శిల్పార్థపు పరమవాక్కొ
శివుని రూపమొ యేమొ యేమో?
హృదయంలో కోర్కెలేదు
రుధిరంలో వేడిలేదు
చలవలు కాకలు తీరిప
కలలన్నీ దెసలంటిన
తెలిపడిపోయిన బ్రతుకు నీది
కలలు దాటి కాంచిన తెలివో యేమో!
(సెప్టెంబర్ 1939)
జ్వాలలు
ఎగర నివ్వండోయ్ జ్వాలలు
ఎగర నివ్వండోయ్....
థళుకు థళుకని ఎరుపు పసుపుల
తీగలై పూవులై రేకలై
నింగిపైకీ దుముకుతున్నవి. ॥ఎగర॥
పాములూ పాముల్ల నాల్కలు
ఫణములూ పాదాలమచ్చలు
మెలికలా రే ఖల్లు పరుగులు
జరుగుతున్నవి ఆవలిస్తూ ఆవరిస్తూ ॥ఎగర॥
తుప్పుపట్టీ కిలం పట్టీ
రోతలొచ్చే పాత పలుకులు
పాత దారులు పాత పాటలు
పాత సరుకుల పాత భావాల్
పాతర్లు వేసిన పాతవన్నీ
మింగుతూ కమ్ముకుని వస్తాయ్ ॥ఎగర॥
రంగురంగుల తార చువ్వలు
మతాబాలూ చిచ్చుబుడ్లు
సేరు ధరణాల్ ఫిరంగీలు
పేలిపోతూ వెలిగిపోతూ
గ్రహాలన్నీ శూన్య దిక్కుల నీడలిస్తూ తిరుగు తుండగ
ఎగురుతూ వచ్చేను జ్వాలలు
మండ నివ్వండోయ్ జ్వాలలు మండ నివ్వండోయ్..
మెరిసిపోతూ దృఢం అవుతూ ఫీనిక్సు పక్షుల కొత్త దవుతూ
కొత్త భావాల్ కొత్త రుచులూ
కొత్త జీవం పోసుకుంటూ
పాత సత్యం బయటపడతది
కొత్త లోకం పుట్టివచ్చే
వెలగ నివ్వండోయ్ జ్వాలలు
ఎగర నివ్వండోయ్
(10.10.1934)
గురు :
భోగీరనీరముల్ వాగుదొలచిన లోయ
ఆజాంత గుహలలో అభ్యసించాను.
ధాన్యకటకక్షేత్ర దమ్మ పథ సంగాన
స్థూప శిల్పాలలో చూపు పొందాను.
గౌతమీ నీలాల లోతు కెరటాలలో
పాపికొండల నీడ పాట పాడాను
కూచిపూడీ నాట్య కోవిదత్వమ్ములో
తోలు బొమ్మల విద్దెతులలేని సొబగులో
ఆటపాటల అందమందుకొన్నాను
అయ్యవారాస్వాల్డు అప్పుడే నవ్వుతూ
భారతీయుడవైతి ప్రణుతులన్నావు.
కాహళము
తల్లిదేశము నరకయాతన
తల్లడిల్లెను కుంగిపోయెను
ఝల్లుమనె ఒక పాట పాడీ
ఉల్లమును రంజింపలేవోయీ
ఓ ఆంధ్ర పుత్రా!
కళ్ల బిందులు తుడుచుకోవోయీ!
గొడుగులెత్తుము సిడము పట్టుము
అడుగులొత్తుము మడుగు లొత్తుము
తడుముకోకుము హడిలిపోకుము
నడకవేగమునందు సాగుమురా
ఓ ఆంధ్ర పుత్రా!
పుడమి నిండగ జయము సల్పుమురా !
లవణ జలధిని తరచివేయర
నవధనాలను అందుకోరా
అవధరింపుము స్తవము చేయుము
భువన కాంతిగ హారతెత్తుమురా
ఓ ఆంధ్రపుత్రా!
కువలయాలను వెలుగు నింపుమురా!
రసవిరాగి (రుక్మిణీనాథ్)
చూసుకోవోయ్ నిన్ను
మూసుకోవోయ్ కళ్లు
మనసులో మాటలో
విరసమేనా నీకు
కంటకమె నీ అడుగు
గద్గదికమే పాట
ఎటు తిరిగినా చూపు
కెదురైనదా ఎడారి! ॥చూసుకోవోయ్॥
వేకువల వెలుగులో
విరిగిపోయిన కలలు
కలలోని గానాల
కందదా కలరవము? ॥చూసుకోవోయ్॥
కవిత కవితంటావు
కవిని నేనంటావు
కవితలో భావాలు
నవయుగమ్మంటావు
ఈ అపశ్రుతి యైన
ఈ పాటలేనటోయ్
రంగు రంగుల కూర్పు
భంగమే నా బొమ్మ
ఈ అపశ్రుతిలోన
ఇమిడె శ్రుతులంటావు
ఒక మహా రాగమే
ఒక మహా గీతమే?
ఆధి భౌతికమొ లేక
ఆధ్యాత్మికమొ గాని
భంగమొందిన రంగు
పొంగు తీపంటావు
(9.7.1937)
రామారావు (దామెర్ల)
అజంతా లోయలో
సృజించాడానాడు
గుహా విహార చైత్యాలలో
మహాతూలికా గతిద్యుతుల
శిల్ప సార్వభౌముండొకండూ
చిత్రకల్పనాద్భుతవైభవమ్మూ!
మొలేరాం చతురుండు
కళాస్రష్టల బ్రహ్మ
సిద్ధహస్తుడు కుశలి
విద్దెలో సూక్ష్మరేఖారీతి
దివ్యచిత్రము లల్లినాడోయ్
కాంగ్రాలో
భవ్యమూర్తే రసపుత్రుడోయ్!
ప్రజ్ఞా ప్రవాహాలు ఆ రెండు
విజ్ఞుండ నీలోన కలిసెరా
రామరాయా
ఆంధ్రశిల్ప గభీర భావముల్
నీ కుంచెలో
ఇంద్రచాపమ్మై వెలసెరా
నీ నుదుట నెలవంక
నీ కళ్ల నాకపథి
తెలుగువేళ్లతో, యశము
తీగలల్లేవురా రామరాయా!
తీయతనములు రంగులేశావురా!
గౌతమీ తీరానా గంగ చూశావురా!
కదలకే శిల్పమై కళ్లు మూశావురా!
నీ వర్ణ కిరణాలు నీటిలో కుంకినవి
కాంతిలో నీ మూర్తి కౌగిలించిందిరా!
(29.11.34)
రామకోటి
(కోలవెన్ను రామకోటీశ్వరరావు)
మంచి గంధం చెట్టువోయీ
ఓ నేస్తకాడా
ముంచితేల్చే పరిమళావృతుడా!
సర్వదెసలకు ఆక్రమించే
సౌరభాలను పసలబట్టీ
దివ్యసర్పము లెన్నో చేరును
భవ్యమౌనీ బ్రతుకు చాయకు ఓ నేస్తకాడా
కావ్యపతులట శిల్పపతులంటా!
మంచువానల స్వచ్ఛ జీవిక
మించు దారుల చూపు నడకలు
అంచు దొరకని ఏవొ భావాల్
ఎంచుకుంటూ తిరుగుతూంటావోయ్ ఓ నేస్తకాడా
వంచనపు ఈ జగతి కంతే దీ!
గంగ నొక్కటే ఆర్య భూమికి
పొంగుతూ ప్రవహింపదెచ్చెను
సాగరేయుడు తొల్లినేడో
వేగములు మూడు నదుల ప్రయాగనిచ్చావురా ఓ నేస్తకాడా
సాగరము మా హృదయవీచికలూ!
పరమ సౌందర్యశయాన్నే
ప్రణుతులిస్తూ పూజ చేస్తువు
ఆశయానకు బ్రతుకునంతా
ఆరతిస్తువు కప్పురము చేసీ ఓ నేస్తకాడా
అందమేనట నీకు ప్రియురాలూ!
ఎవరికోయీ ఆశయాలూ
ఎవరికోయీ తీపి తలపులు
ఎవరికోయీ పరిమళాలూ
ఎవరికీ అందాల బ్రతుకుల్లు ఓ నేస్తకాడా
భువన కర్తకు నీకు ఇరువురకూ!
(1945)
సోమశేఖరుడు
(మల్లంపల్లి సోమశేఖర శర్మగారు)
మాటనైనా కలుషమెరుగవురా అందాలకాడా!
మనసునైనా విరసమెరుగవురా!
చాటునైనా దోసమెంచని
మేటి తలపుల నీటుమనిసివిరా అందాలకాడా!
నాటి నేటికి దారితీస్తివిరా!
నాటి రోజులనావరించిన
తూటితెరలను తూల్చివేసి
నీటుగులికే చిత్రమిస్తివిరా అందాలకాడా!
కోటి కతలను పాటలాడ్తివిరా!
అందమే నీ రూపురేఖలు
అందమే నీ సోగ మీసము
చందనములో చంద్ర సంజ్ఞిత
కుందనము కలిపేటి మనిసివిరా, అందాలకాడా!
విందు లిస్తువు నీదు హృదయాన్నీ!
ముందు యుగం
హిమాలయాలే ఆట స్థలాలోయ్
ధృమరహిత ధ్రువములే విహరించు భూములోయ్
కుజ చంద్రలోకాలు వలస రాజ్యాలోయి
విజనవేత సహార పుష్పవనమౌనోయి
అమిత వేగము బ్రతుకు మార్గమ్మోయి
అఖిల భూగోళమే ఒక రాజ్యమేనోయి
ఇన్ని మతములు కలసి ఏకమతమై పోవు
ఇన్ని జాతులు కలిసి ఏకజాతేనోయి
ఈ మహాభావము మనకు
ఎప్పటికి కలదోయి
ఈ మహాస్వప్నమే
ఎప్పటికి నిజమోయి
(ఆగస్ట్ 1936)
విజయఢంకా
మోగింపమ్మా జయ జయ ఢంకా
ధణధణ ధణధణ
దిక్కులు మ్రోగగ
మోగింపమ్మా జయజయ ఢంకా! ॥మో॥
ఆంధ్రుల ప్రతిభా
ఆంధ్రుల కీర్తి
ఆఖరుకాదని ఆరిపోవవనీ
గజపతి దేశం
రాయల సీమా
కళింగ రాజ్యము
కాకతి భూమీ
ఆంధ్రులందరూ ఒకటౌతారని
ఏక కంఠమున పాట నిండునని ॥మో॥
ఆంధ్ర కవిత్వమూ ఆంధ్ర శిల్పమూ
ఆంధ్ర నృత్యమూ ఆంధ్రగానమూ
రూపం చెడవని రుచులు తగ్గవని
దివ్య రూపముతొ తేజరిల్లునని ॥మో॥
కృష్ణా పెన్నా గౌతమి భద్రా
శబరీ కిన్నెర గుండ్లకమ్మలూ
స్వర్ణముఖియూ చంద్రవంకయూ
వరదలు కట్టీ పారుతుంటవని ॥మో॥
కృష్ణవేణి
కృష్ణవేణి! కృష్ణవేణి!
నీలనదీ! వలపురాణి!
ఏనాటీ ప్రియ సఖివే, మీనాక్షీ కృష్ణవేణి
కృష్ణాధుని దివ్యసతీ
కృష్ణాకుంతల సౌరభ
తృష్ణార్తిని భక్తుణ్ణి! ॥కృష్ణ॥
ఇరుల పోలు నీ జడలో
విరుల మాలనై ఒదిగితి
చిరు అలకల ననుచుట్టీ
మిరుమిట్లై కౌగలించె ॥కృష్ణ॥
చేయిచాచి నీ ఝరిలో
రొమ్ము విప్పి నీ మనసున
తేలిపోతి మునిగి వస్తి
లోతులలో నీలి సుడుల ॥కృష్ణ॥
నీ ఝరిలో మూర్తించెనె
అసుర రాజ్య సౌభాగ్యము
నీ తరగల నృత్యించెనె
శాతవాహా దివ్యశక్తి
ఇక్ష్వాకుల కాంతాపద
లాక్షారుణ దీప్తయశము
రెడ్డి కులాంగన కుంకుమ
పరిమళించె నీ ఒడ్డుల
నీ ప్రజ్ఞే కాంతించెను ॥కృష్ణ॥
నాగార్జునదేవు జన్మ
నీ సౌందర్య విచిత్రము
నిలిచె స్థూపశిల్పాలలో ॥కృష్ణ॥
నీ లోలాకల కంఠము
లీలాశుక గీతమ్మున
నీ పాదాంచిత కింకిణి
నృత్యమయ్యె క్షేత్రయ్యగ
నీలికలవలైన కనులు
మేలమాడె ప్రియ సూక్తులు
హాలదేవు గాథలుగా ॥కృష్ణ॥
నీ జలములు గడ్డకట్టి
నింగి కెగసె దేవళములు
నీ నావలు తేలిపోయె
నేలలు, రోములు, సీమలు ॥కృష్ణ॥
మురళీధరు ప్రియ సఖిగా
మోహమందె యమునా సఖి
ఆంధ్రవిష్ణు ప్రియకాంతై
ఆరతిస్తివే బాలా! ॥కృష్ణ॥
చెట్టు నీడ
ఆకారమేలేని ఓ చిన్ని కందువే
ఆకాశమూర్తితో ఆడుకుంటావు.
చింతనీడలు వెలుగు క్షీరాబ్ది వెల్లువే
పాతపేలిక పక్క వటపత్రశయనమే.
ఎముకపోగుల రూపు, ఎండిపోయిన చూపు
వెనక జన్మలలోని వేడికాగిన తపసి.
కడుపుకై ఈ సృష్టి కణమైన వి సరదా
కప్పదా దెసమొలను కటి వస్త్ర దానాన
ఎండలో వానలో ఎండినా తడిసినా
తలదాచుకొన నీకు తరువు నీడలె గృహము
ముసలి ఖయిదీ
పోతావటోయ్ ముసలీ తాత
పోలీసోళ్ల ఖయిదూ వదలి
ఇరవై ఏళ్ల పై నొస్తి వీ
ఇంటికెడితె ఎవరున్నారు
కంటికి నేలా నొక్కధారై
కలిసే మట్టి నీ ముసలిదీ ॥పో॥
తాటాకుల కొంపాగూడు
దారైపోయె సూరన్నకూ
పామూలు తేళ్లు పందీకొక్కులు
పలకరించే చుట్టాలంటూ ॥పో॥
నువ్వూ నాటిన లేమొక్కలు
సువ్వున పెరిగే మానులు కట్టే
చిన్ని మొక్కలే అంటూ నువ్వూ
ఎన్నో కడవల నీళ్లూ పోస్తవు ॥పో॥
ఖయిదూ వోర్డర్లు సుట్టాలంటావ్
ఖయిదూ పెబువె తండ్రంటావు
ఖయిదూలోనే ఉంటానంటావు
కటకటాలట్టుకు ఎళ్లలేనంటావు ॥పో॥
మానవుడీ జల్మంతాను
మరిగీ పోసిన ఇనుమంటావు
ఖయిదూ నుంచీ పంపీయేసీ
కఠిన నరకం వెయ్యొద్దంటావు ॥పో॥
లేపాక్షి బసవయ్య
లేపాక్షి బసవయ్య లేచిరావయ్యా
కైలాస శిఖరిలా కదలి రావయ్యా!
హుంకరించిన దెసలు ఊగిపోయేను
ఖురముతో దువ్వితే కుల గిరులు వణికేను ॥లే॥
ఆకాశగంగకై అఱ్ఱెత్తి చూస్తేను
పొంగేటి పాల్కడలి గంగడోలాడేను ॥లే॥
నీలాల నీచూపు నింగిమోసే కొమ్ము
తెలుగునాటనుపొంగు వెలుగులే యశములే ॥లే॥
నంది పర్వత జాతనవ పినాకిని జలము
నీ మూర్ధమున బుట్టు నిత్య గంగానదే ॥లే॥
నువ్వు నడిచిన భూమి నూరు పంటల చేలు
ముట్టె ముట్టిన పొదలు మొలకెత్తు ఓషధులు ॥లే॥
పెంగొండ సీమలో వంగోలు భూమిలో
నీ వంశ మీనాడు నిలిచింది గర్వాన ॥లే॥
లక్ష్మణరాయ
నీ చూపులో కాలమ్ము
నీ నవ్వులో లోకమ్ము
భ్రూమధ్య నెలవంక కళలోన
పూర్వ యుగములు మూర్తికావా!
ఏ శిలాక్షర రేఖ నొదిగీ
ఏ లోహ ఫలకమ్ము కదిసీ ఆంధ్ర చారిత్రయ సంఘట్టనల
చంద్రకాంతుల స్పష్టమొనరించినావూ !!
విజ్ఞాన భిక్షాసనుండవై
ప్రజ్ఞాత్మికా కసూక్తనాదాలు
తెలుగు నాడెల్ల మార్మోతలలో
తొలివాడవైతివీ యుగములో !
(జులై 1936)
స్వరూపరాణి
నా జీవితాయి కాధారుభూతులూ
పలియు పుత్రకుడు జైలుకు నడలిరి
అంతఃపురముల కండ్లధారలతో
మేలి ముసుగులో పరదా వేనుకే
దీనురాండ్రమై మోములు వంచుకు
కూరుచుండుటా లేచి వచ్చుటా ?
........................
తల్లి బాధలను దీర్పబూనగా
ధర్మ మార్గములు తలపము యేనీ
జన్మ యెత్తుటే పురుగుల బ్రతుకది
........................
ముద్దుకొడలే ముందుకు దూకెను
యుద్ధరంగమే శాంతి రంమూ సిద్ధమైతి నా దేశము తలచి
సేవకు జీవము ధారపోయగా !
......................
సహజశక్తియగు పురషకారమును
సాహసగుణమూ ప్రేమ ధైర్యములు
యమునా గంగా సంగమ పూతము
ప్రపంచ రక్షణ శాంతి బావుటా
పణి బంధమున పైపైకిత్తీ
జైజై మాతా జైజేలంచూ సిగ్గూ విడిచీ రండూ సేవకు
భరతకుమురీ జనములు మీరూ !
(ఆగస్ట్ 1922)
కృష్ణశాస్త్రి
అతడు ప్రేమ కొరకు బ్రతుకు
విశ్వ మావరించి వెదకు
అతనికంట అవతరించి
ప్రవహించిన బాష్పనదులు
శూన్యాలను చొచ్చినాయి.
ఆతని నిట్టుర్పుగాలి
అలమి లోకమార్గాలను
ప్రళయకాల భంజనమై
చుక్కల్నీ
సూర్నుణ్ణీ
దూదిపింజలే చేసి
తోలిందే ఎటకెటకో
కలలు తిరుగు కన్నుల్లే
గాలించెను ప్రేమ కొరకు
ఈ నాటికి
ఏ దిక్కుల
కనబడదే ప్రణయ పుంజ
కాంతిరేఖ దూరాలను
కాలముఖ ప్రాంగణాన
కనులు మూసి గళము నెత్తి
ప్రణయ యోగ దీక్షా సం
బద్ధుండై విశ్వ మోహ
గీతికలను పాడుకుంటు
చేతుల ముకుళించి యుండు
ఈ నాటికి
ఏ నాటికి
ఢంకానాదం
ఢంకానాదం దేవుని గుడిలో
ఢంకానాదం యుద్ధభూమిలో
ఢంకానాదం ఉరేగింపుల
ఢంకానాదం జయజయధ్వానం !
కోకిల గొంతున కుసుమ వక్షమున
కోనల నడిచే కొండవాగులో
ఢంకాపైనా కాకలినాదం
ఢంకాలోనే వేకువగానం!
శివుని డమరుకము దివిని మ్రోగితే
భవమొందినవట వివిధ విద్యలూ
దెసలు దెసలుగా సహృదయులనూ
రసా స్వాదనకు పిలుచును డమురువు !
పల్నాటి యల్లమంద
ఓ పల్నాటీ యల్లామందా
కలవరిస్తావ జైలుకొట్లల్లో
తలఎత్తి తిరిగిన రాజువు
మలలన్నీ ఏలిన రాజువు
కలలోనిక వ్త ప్రాణం
కలత పెట్టిన మొనగాడివి ! ఓ పల్నాటి ......
కొండ నీదీ గుట్టా నీదీ
గుట్టపైన గుబురూ నీదీ
గుబురులోకి మాయమైతే
కబురు చెప్పేలోనే తోచేవు ఓ పల్నాటి ......
ఏలాంటి చక్రవర్తికి
నీలాంటి నాయకత్వం
కూతవేస్తే అర చిటికలొ
కూడిపోతా రెనభైగండలు ఓ పల్నాటి ......
నాగులేరూ, చంద్రవంకా
నాగార్జున పెద్దమెట్టా
పిడుగురాళ్ల, కారెంపూడీ
పిలుపుతోనే వణికిపోతాయా ! ఓ పల్నాటి ......
ఆడదంటే లొంగిపోతవు
ఆడదే నీ కొంపాతీసే
మీడపీలో బోగందీ, అన్నా
చూడ చక్కనైనా సిన్నాదంట్రా ఓ పల్నాటి ......
కరకు మీసం నీది తిప్పి
కమ్మనైనా ముద్దిచ్చింది
కంథాన చేతులు చుట్టీ
కౌగిలించింది మాయరక్కసి ఓ పల్నాటి ....
పిల్లి అడుగూలేస్తూ వెళ్లి
చల్లగా తీసింది తలుపు
మెల్లగా చేసింది సైగ
పోలీస్
ఒళ్లోనే పోసాడు వరహాల్ ఓ పల్నాటి ....
ఇద్దర్నీ తోసినావు
నలుగుర్నీ నరికినావు
కలియవచ్చిన వాళ్లనెల్లా
కాలికిందా రాసినావూ ఓ పల్నాటి ....
గుండు వేసిన దెబ్బకే పడితివి
గొలుసులేసీ మంచాన కట్టిరి
చిదుతరాజువొ బెబ్బులీవొ
చిందువు పులివో చెప్పేదెవరూ ఓ పల్నాటి ....
పల్నాడూ కలకంటావా
పారకిస్తువ పడమాటి దిక్కూ
బోనులోనే కుంగేవ కొడుకా
పుచ్చేవా నిట్టూర్పోటీ ఓ పల్నాటి ....
తలుపులు
తలుపులు తెరువుండా స్వామీ
తలుపులు తెరువుండా
తాళాలన్నీ తమంత తామే
విడిపోయినవీ పడిపోయినవీ ॥తలుపులు॥
పళ్లూ పూవులూ తళ్లో గంపల
అంజలిలోనే ఆరతిపట్టీ
నడిచివస్తిమీ నడుములు కట్టీ ॥తలుపులు॥
పల్లె బయట మా
పాడు గూమెములు
వెల్లి విరిసినవి దివ్య సుమములై
నాధుని సేవకు మాలగ కూర్చీ
నడిచి వస్తిమీ
గడిచి వస్తిమీ ॥తలుపులు॥
మబ్బులు
తెల్లనివి నల్లనివి
చల్లనివి చక్కనివి
దెస దెసలు కప్పునవి
విస విసా పోవునవి మబ్బులే ! మబ్బులే !
పల్చనై ఎచ్చటో
పరుగెత్తి పోవునవి
ఒత్తుగా గగనాన్ని
మెత్తి నిలుచుండేవి మబ్బులే ! మబ్బులే !
చి చిరుపొగలులా
నీలి ఆకాశాన
రూపు రూపులు మారి
చూపులో చెదిరేవి మబ్బులే ! మబ్బులే !
హృదయాన రిక్తమై
చెదిరిపోయే మబ్బు
వ్యధగా విఘోషణల
మదికలచు పెను మబ్బు మబ్బులే ! మబ్బులే !
పూలు విరిసిన పొదలు
చదల విదలించగా
ఘమఘమలాగా నేల
సుమముల్లు ఒలికించు మబ్బులే! మబ్బులే !
దివ్య సుందరి కనుల
తీక్షణ వీక్షణములై
దీప్త విద్యుల్లతలు
తేజరిల్లెడి నీలి మబ్బులే! మబ్బులే!
సర్వభూముల మంచు
సప్త నీరద మాల
శుక్తి గర్భంలోన
మౌక్తికము వరమిచ్చు మబ్బులే! మబ్బులే !
నేల దున్నిన దుక్కి
చాలులో చినుకైన
వేలితో విదిలించ
జాలనివి, కౄరమౌ మబ్బులే! మబ్బులే!
మనిసికైనా లేని
కనికరం పొంగుతూ
కాలానికా జడులు
వాలాయముగ కురియు మబ్బులే! మబ్బులే !
(21.10.41)
కటకటాలు
కటకటాల వెనక నేను
బొటన వేల్ని రాస్తు నిలిచి
అమ్మకళ్ల మొయిలు చూచి
అదుముకొంటి హృదయ భరము.
"దేశమాత పదము జేరి
దోసిలొగ్గి పూజకొరకు
కటకటాల వెనకవస్తి
కన్నకొడుకు వీరు" డంటి.
ఏడ్పుదాచు నవ్వు లోన
ఇరులు చూస్తి విరులు చూస్తి
కారభర్త దిక్కు చూచి
కన్నబాబు ముట్టకోరి
అనుమ తన్న అమ్మప్రేమ
ఆశలంటు అమృత శాంతి.
కటకటాల చేయిచాచి
కౌగిలించి బొజ్జతడుము
అమ్మచేయి అమృతరేఖ
అమ్మ ప్రేమ ఆర్ణవమే !
(16.3.1922)
చందమామ
చందమామ చందమామ
చందమామ చగల త్రోవ
సుందరతర అనుభూతై
చందమామ చదల త్రోవ
మందగతుల మబ్బులేవొ
మానవతికి తెరలుగాగ
తెరవెనకే భామాటలు
విరచించనదా గడియల ॥చంద॥
చిరుపాపల కాపాపకు
మరపురాని ఎరుగలేని
చెలిమి ! యుగయుగాల చెలిమి! ॥చంద॥
వలపు తీపి చెలిమి చెలిమి
కాముకులో కామినులో
భావుకులో భామినులో
నెలవెలుగని దూషణాలు
నెలవెలుగుల భూషణాలు ॥చంద॥
నెలెవెలుగుల భూషణాలు
అదయాత్ముల అపహాసము
హృదయాన్నే కుములు బధ
ఆకలన్న అన్నమన్న
శోకార్తు కడుపు చిచ్చు
చూస్తూ బాష్పా నొత్తు ॥చంద॥
తన్నే తానే తెలియగ
మిన్ను మన్ను ముడి రచియించే
పద్మాసన బద్ధనిమీలత
పక్ష్మాంగల కాంతై వెలిగే ॥చంద॥
(11.5.43)