Jump to content

అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం

వికీసోర్స్ నుండి

ప్రచురణ

కిన్నెర ఆర్ట్ థియేటర్స్

2-2-647/153 సెంట్రల్ ఎక్సయిజ్ కాలనీ (ఫోను 7614809), హైదరాబాదు - 500013

అధ్యక్షులు

కార్యదర్శి

శ్రీ ఎం.వి.నారాయణరావు ఐ.పి.ఎస్. (రిటైర్డు)

శ్రీ మద్దాళి రఘురామ్

ఆర్దిక సహాయం: కేంద్రప్రభుత్వం (మానవవనరుల అభివృద్ధిశాఖ) న్యూఢిల్లీ 110001

ADIVI BAPIRAJU SAMAGRA KAVITA SANKALANAM

Comprehensive Collection of Poetical Works by Late

Adivi Bapiraju (1875-1952) VOLUME-1

@ MS. Tadikonda Radha Vashantha

"SAI SOUBJHAGYA" 11-30-4/1 Chairman gari Veedhi,

Ramachandrapeta

TADEPALLI GUDEM 534102 (AP) INDIA

Cover Design : . GOPI

Published by : KINNERA ART THEATREES

2-2-647/153,Central Excise Colony

Hyderabad - 500 013.

(Ph.040-7614809)

WITH NO PROFIT NO LOSS MOTIVE

DTP at : MAN PUBLICATION

HYDERABAD.

Printed at : VIPLA PRINTERS

General Editor: BHARAGO

COPIES CAN BE HAD AT:

  • Kinnera Art Theatres
  • Visalandhra Book House(all Brochers)
  • Adivi Bapiraju Memorial Trust

(Who undertakes the Publication of Vol.2)

44-39-11, Nandagiri Nagar,

Visakhapatnam - 500 016.

Price RS: 60 (US $ 1000)

ప్రవేశిక

అడివి బాపిరాజుగారు, లలిత కళాత్మక మైన శైలి విధానంతో కవిత్వం రచించి, ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రలో, అపూర్వమైన స్థానాన్ని సాధించిన వ్యక్తి. వీరు కవిగా, రచయితగా, ప్రకృతి పరిశీలకునిగా, కళాస్రష్టగా, దేశాభిమానిగా, కవితల్లో ప్రతిబింబిస్తారు. భావి కవి పరంపరకు మార్గదర్శకమై, కాలాతీతమై నిలిచిన కవిత్వం వీరిది. వీరి కవిత్వం ఒక శిఖరం, ఒక ఝంఝూ మరుత్తు. ఒక విద్యుదాఘాత నీలాభ్ర శకలం. సంప్రదాయ ఆత్మాశ్రయ వస్త్యాశ్రయ భావవాద ప్రతీక వాదాది భిన్న భిన్న కవితల సంగమ కళామార్గం వీరిది. ఆంధ్ర సంస్కృతి తో విరాజిల్లుతున్న ఆంధ్ర వ్యక్తిత్వం వీరిది.

కవితా స్రవంతిలో, నిత్యనూతనమైన దేశాల కవితలో ప్రకాశించిన ఆత్మకవితే వీరిదని నిర్థారిస్తూంది “ జ్యోతి ” కావ్యం. “దీపమాల” 'కావ్యంలో, ప్రపంచంలో వ్యధచెందే మూక శోకార్తులే, వీరి హృదయ కరుణారస వాహినీ తరంగాలుగా గోచర మౌతారు. వీరు కవిత్వాన్ని నిర్వచిస్తూ "ఫీలింగ్ ఫీల్" ఆవు, అదే కవిత్వం; అను ముఖ్యసూత్రాన్ని “వచనాలు " కావ్యంలో నిబద్ధం చేశారు. రీతిమార్గం ఎక్కువైతే గీతిలో భావం లోతుగా వుండదని, ధ్వని మార్గం ఎక్కువైతే సమస్యాపూర్ణంగా పరిణమిస్తుందని, భావం ఎక్కువైతే దేహం కదులుతుందే తప్ప మానసిక చైతన్యం కలుగదని, వీరు నిర్థారించేరు. కవిలోని కవిత్వకళ, ఆశాభావ పూరితమైన ఆతని జీవన నేపథ్యంతో ప్రత్యక్ష సంబంధం గల, అనుభూతి కళ. 'కృష్ణాపత్రిక ' (జూన్ 26, 1948, పు.1) లో "మహాపురుషుడు" అనే వ్యాసంలో, మంద మలయానిలం ప్రసరించిన పూవునై వికసించే వాడినని, చరిత్ర కిరణ స్పర్శచే స్రవించిన కలువ పూవు నయ్యేవాడినని, కళాపీఠం మ్రోల తాను ఒక అల్పో పాసినని, తన కాల్పనికత్వాన్ని ప్రకటించేరు. వర్ణపతి కుంచెగానూ, శశిబింబం కలంగానూ, వీరి కవితా కళా లోకంలో ప్రతీకలుగా గోచరిస్తాయి.

ప్రతిభాపూరితమై, భావావేశం కలిగి, వీరి వ్యక్తిత్వాన్ని చాటుతోంది వీరి కాల్పనిక కవిత్వం. ప్రకృత్యారాధకులైన వీరు, మానవ హృదయ వికాసానికి ఆధారమైన ప్రకృతిని, కవిత్వంలో ఆవిష్కరించేరు. సూర్యోదయ కాలంలో వర్ణపతిని ఆరాధించిన స్వర్ణకిరణావృతప్లవిత చిత్రకళార్థినని, “అంజలి" కావ్యంలో వారిని చిత్రించు కున్నారు. అంధకారంలో సకల సౌందర్యాలు దర్శించి తరించినట్లు వీరు "జ్యోతి" కావ్యంలో వివరిస్తారు. పద్మాసన బద్ధ నిమీలిత పక్ష్మాంచల కాంతై వెలిగే చందమామని, ప్రకృతి మర్మకవిత్వంలో, వీరు నిబంధిస్తారు. కాల భ్రమణంలో వర్షఋతువును ముఖ్యమైనదిగా భావించి, తెల్లనివి నల్లనివి చక్కనివి అయిన మబ్బులనూ, మదికలచు పెనుమబ్బులనూ, వీరు దర్శిస్తారు. “గోధూళి" కావ్యంలో బీభత్సం సృష్టించేవరద గోదావరి ప్రళయాన్నేకాక మానవ ప్రకృతిలోని సృజన నాశన శక్తులను కూడా వీరు కనుగొంటారు. గ్రామంలో నివసించే ప్రజా జీవిత సౌందర్య మాధుర్యాల్ని అమితంగా ప్రేమించి, మనోహరంగా చిత్రిస్తారు. మాయా ప్రాపంచిక విషయస్పర్శలేని శిశుదశని అత్యున్నతంగా భావించి, బాల ప్రపంచాన్ని "చిగురు టాకులు" కావ్యంలో సృష్టించిన మరో బ్రహ్మ వీరు. నిష్కల్మషమైన బాల్యదశను దాటిన కవి హృదయం, యౌవన పూరితమౌ, ప్రణయ భావాలు వెలువరించింది. గ్రామాలలోని జానపదుల ప్రణయ భావాలను వీరు జీవితావసరాలు గుర్తించే మానవసేవగా “గోధూళి” కావ్యంలో భావించేరు. "వచనాలు" కావ్యంలో, ప్రేయసిని రూపకల్యాణిగా భావించి, 'నీవు పద్మాసనా సీనవు, నీకడ మోకరిల్లినాను నేను' అని అంకిత భావం వెలువరిస్తారు. వీరి అపూర్వ కళాసృష్టి "శశికళ". ఆమె ఆరాధనలో తనువునూ మనసునూ సర్వమునూ ఆత్మార్పణం చేస్తారు. శశికళ చంద్ర బింబాననయై, సూర్య తేజస్వినియై, అలౌకిక కళామూర్తియై, బ్రహ్మానంద స్వరూపిణియై, కవిజీవితాన్ని కళామయం చేసి, చివరకు ముక్తి కాంతగా వారిని ఆత్మైక్యం చేసుకుంటుంది. "శశికళ” కావ్యంలో, మానవ జీవిత పరమావధియైన ప్రేమను మార్మిక కవిత్వంగా వీరు మలుచు కున్నారు. నిర్మలమైన ప్రేమని పొందిన కవి హృదయం గతించిన ఆప్తుల ప్రేమని నిక్షిప్తం చేసుకుంది.

వీరు దేశనాయకుడైన మహాత్మాగాంధి, కళాకారులైన టాగూర్, దేవులపల్లి, దామెర్ల. తుమరాడ మొదలగు వారి పట్ల దుఃఖం, ఆవేదన, మమత వెలువరిస్తూ, వారి ఆధిక్యతని కూడా కీర్తిస్తూ ‘దీపమాల”, చిగురు టాకులు", కావ్యాల్లో స్మృతులను, రూపొందించేరు; మానవుల్నే కాకుండా గోవుల్ని కూడా ప్రేమించి 'దిక్కులేని వాళ్ళ కెల్ల అక్కు పేర్చు కన్నతల్లి' అని భావించే భూతదయ కూడా వ్యక్త మౌతూంది. ఆప్తుల ప్రేమని స్పృశించిన కవిహృదయం సమాజ పునర్నిర్మాణానికి పూనుకుంది.

భారతదేశంలో, రాజకీయ సంక్షోభం వల్ల బడుగు ప్రాణాల కష్టాలు చూసి, వీరు కరుణతో చలించి పోయిన వైనం గోచర మౌతుంది. వీరి దేశభక్తి, భారత జాతీయాభిమానంగానూ, ఆంధ్రాభిమానంగానూ, "జ్యోతి”, దీపమాల", "చిగురుటాకులు” కావ్యాల్లో వ్యక్తమౌతూంది. 'భరతపుత్ర లేవరా ! చేతులొగ్గి మొక్కరా !' అని వీరు భారత భూమిపట్ల భక్తి భావం వెలువరిస్తారు. మత పిశాచిని అరికడుతూ, మతములన్నీ కలిసి ఏకమతమై పోవునని, ఆశాకుసుమాలు వెదజల్లుతారు. ఆంధ్రులారా ! ఏకమ్ముకండోయ్! అను కవి భావన జాతీయతాభావ తీవ్రమైన ఆంతర్యమే. అపరిచితులనుకూడా మనసారా దగ్గరకు చేర్చుకునే ఆత్మీయతా స్పర్శ కల వ్యక్తి వీరు. ఈ ప్రవర్తన. జాతీయ కుసుమంలోని సమసిపోని సుగంధంలా, వీరి కవిత్వంలో అంతర్లీనంగా వ్యాపించి వుంటుంది. యుద్ధాలవల్ల కలిగిన దుష్పరిణామాలను నిరసించి, భారతము శాంతికై వేడుతోందని, వీరు శాంతి ప్రియత్వం కోరుకుంటారు. పుష్పాలు కోసి, గోదావరిలా ప్రవహించి, గ్రంథాలు చదివి, దేశాలావరించిన వీరి విశ్వ ప్రేమభావం "చిగురుటాకులు" కావ్యానికి పెట్టని గంధకుసుమం అయింది. కవి మనస్సు దేశాన్ని అధిగమించి, ప్రపంచాన్ని దైవలీలగా గుర్తించి, భక్తి భావాలను వర్ణించింది. వీరు, శ్రీ కృష్ణుని అన్వేషిస్తూ, మధుర భక్తి విధానంలోని ఆరాధనా తత్త్వం, ఆత్మార్పణతత్త్వం, “అంజలి" కావ్యంలో వ్యక్తం చేస్తారు. వీరు, "చిగురుటాకులు” కావ్యంలో, "గుడి" శీర్షికలో వెలువరించిన నిష్కల్మషమైన పారమార్థిక భక్తి విధానం అపూర్వమైనది. మనోహరమైన కాల్పనిక కవిత్వం వెలువరించడానికి, వీరికి మధురమైన శైలి విన్యాసం కూడా దోహదం చేసింది.

ఆంధ్రభాషను ప్రామాణికం చేసి, కవిత్వానికి రమణీయత చేకూర్చిన సిద్దహస్తులు వీరు. సంస్కృతాంధ్ర భాషల మీద వీరికి లభించిన ఎనలేని అధికారం, మృదు మధురమైనశైలిగా మారింది. సంస్కృతి, తత్త్వం, సముచిత అవగాహన, మానసిక విశ్లేషణ, కవి భాషాముఖాన బహిర్గతం కావాలి. వీరికి జన్మతః వచ్చిన భాషా సంస్కారం యీ కవితా సంపుటిలో ప్రస్ఫుట మౌతుంది. రాళ్ళ వంటి కఠిన శబ్దాలు కూడా వీరి చేతిలో సోయగాల రాణులై ఒయ్యారాలు ఒలక పోస్తాయి. వీరి కవితా శబ్దాలు, సౌందర్య లక్షణ లక్షితాలై, చిందులు త్రొక్కుతాయి. చిఱుగజ్జెల గల గల ధ్వని వంటి మధురాక్షర సమ్మేళనం “అంజలి" కావ్యంలో గోచరమౌతుంది.

"మాయా మానుష నీల శరీరా ! మంగళ మూర్తీ : వేణు వినోదీ ! లీలాశుక సంవందిత బాలా ! మంజుల కిణ కిణ పదయుగ ఖేలా!" వంటి శిష్ట ప్రయోగాలే కాక సెందురూడు తొలిరేత్రి ‘సుక్కల్లు' వంటి గ్రామ్య భాషా పదాలు వీరి దేశికవితలోని ప్రయోగాత్మకతకు నిదర్శనాలు. సామెతలు, జాతీయాలు, అలంకారాలు, మాత్రాఛందస్సులు, అంతర్లయ, ఎన్నోవున్న అత్యుత్తమ కవిత్వం వీరిది. వీరి రచన, కవిత్వంలో నిబద్ధమై, చిత్ర సుందరిగానూ, శిల్పబాలగానూ, నాట్య మయూరి గానూ, అనంత విశ్వంలో నాట్యం చేస్తూ వుంటుంది. వీరి కలం, స్వర్ణాక్షరాలను సృష్టించే పరుసవేదియై, స్వర్ణ కాంతుల్ని సాహిత్యలోకంలో ప్రతిబింబిస్తూ వుంటుంది.

నేను విన్న వఱకు, గ్రహించినంత వఱకు, బాపిరాజు గారి కవితా సంపుటికి పరిచయ వాక్యాలు పలికేను. విబుధలోకం, పరిశోధకలోకం, యింకా ఎన్నో విశేషాలనూ, వైచిత్రులనూ వీరి కవితా సంపుటిలోంచి వెలార్చ గలదని, విశ్వసిస్తున్నాను.

డి. లలితకుమారి.

విశాఖపట్నం,

18-12-1995.

̺

కిన్నెర మాట

కిన్నెర ఆర్ట్ థియేటర్స్ సాహితీ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ప్రతిభా ప్రోత్సాహం-ధ్యేయాలుగా : 1977 లో ప్రారంభమైంది.

ఈ పద్దెనిమిదేళ్ల చిన్ని కిన్నెర అష్టాదశ పర్వాల మాధుర్యంతో కళాజగతిలో అభిరుచులను చూరగొని విలువలను ప్రతిష్ఠను సంతరించుకున్నది.

“కిన్నెర ప్రచురణలు” 1980 లో ప్రారంభమై ఇంతవరకు నలభై గ్రంథాలకు పాఠక మహోదయ కాంతి నిచ్చిన శాఖ.

ప్రముఖ కవి, చిత్రకారుడు, నవలా - కథా రచయిత, స్వాతంత్య్ర సమర యోధుడు అడివి బాపిరాజు గారి శత జయంతి ఉత్సవాల నిర్వహణ సందర్భంగా సభలు చేసి, వారి చిత్రకళాఖండాల ప్రదర్శనలు ఏర్పాటు చేసి వారి కళామయ జీవితం ఆధారంగా ఒక టి.వి. ఎపిసోడ్ చేసి, వారి అముద్రిత రచనల ప్రచురణ కూడా చేపట్ట గలగడం ఒకానొక అనితర సాధ్యమైన అదృష్టం గా భావిస్తున్నాం. ఈ సంపుటంలో చేరిన ఆరు కావ్యాలు (శిల్పబాల, అంజలి, బాపిరాజువచనాలు, జ్యోతి, పచ్చగడ్డిపూల పళ్లెము, దీపమాల) ఇంతకు ముందు గ్రంథ రూపంలో రానివే. వీరి పాఠాలను మాకు అందజేసి గ్రంథరూపంలో ప్రచురించడానికి అనుమతించిన శ్రీమతి తాడికొండ రాధావసంత (బాపిరాజు గారి పెద్దమ్మాయి ) గారికి సగౌరవ కృతజ్ఞతలు.

అడివి బాపిరాజు శతజయంతి ఉత్సవాలు మనంగా నిర్వహించడానికి కేంద్రప్రభుత్వ ఆర్థిక సహాయం రావటానికి తోడ్పడినన పార్లమెంటు సభ్యులు శ్రీ ద్రోణంరాజు సత్యనారాయణగారికి, కమిటీ గౌరవాధ్యక్షులు, మాజీ సభాపతి శ్రీ.డి. శ్రీపాదరావు గార్కి కిన్నెర అధ్యక్షులు శ్రీ యం.వి.నారాయణరావు గారికి మరియు ఉపాధ్యక్షులు శ్రీ ఆర్. ప్రభాకర రావు గార్కి కృతజ్ఞతలు తెలియ జేసుకొంటున్నాను.

అడివి బాపిరాజు శతజయంతి ఉత్సవాల సందర్భంగా మేము తలపెట్టిన ప్రతి కార్యక్రమానికీ వెన్ను దన్నుగా నిలిచిన కామర్సు భాస్కరరావు (అడివి బాపిరాజు గారి మేనల్లుడు ) గారికి ; “ప్రవేశిక” రచించి యిచ్చిన డి.లలిత కుమారి గారికి ; ఈ గ్రంథం ఇలా హుందాగా శుభ్రంగా రావడం కోసం కృషి చేసిన భరాగో గారికి ; ప్రూపులు దిద్దిన దిట్ట కవి శ్యామలా దేవిగారికి, మద్దాళి సుబ్బారావు గారికి; డి.టి.పి. చేసిన మాన్ పబ్లికేషన్స్ వారికి ; ప్రింటింగ్ చేసిన విప్లా ప్రింటర్స్ వారికి; ముఖ చిత్ర రచన చేసిన “గోపి” గారికి ; ఇన్నిటికీ మూలం - ఆర్థిక సహాయాన్ని అందించిన మానవ వనరుల శాఖ (భారత ప్రభుత్వం) వారికి, తదితర సంస్థలకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.

మా కార్యక్రమాలన్నిటి వలెనే పుస్తక ప్రచురణకూడా కళాహృదయాలను ఇతోధికంగా అలరించగలదని ఆశిస్తూ సాహితీ ప్రియుల ఆశీస్సుల కోసం ఆదరణ కోసం సవినయంగా కోరుకుంటున్నాము.

మద్దాళి రఘురామ్

కార్యదర్శి

కిన్నెర ఆర్ట్ థియేటర్స్

అడివి బాపిరాజు సమగ్ర కవితా సంకలనం

కావ్యంపేరు

పేజీ నం.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .
1

29

49

65

107

123