Jump to content

అడివి బాపిరాజు రచనలు–1

వికీసోర్స్ నుండి

అడివి బాపిరాజు రచనలు


(1)





ఆంధ్ర విశ్వకళా పరిషత్తువారి బహుమతినొందిన నవల

నారాయణరావు






విశాలంధ్ర పబ్లిషింగ్ హౌస్‌

విజ్ఞాన్ భవన్, 4 - 1 - 435 బ్యాంక్ స్ట్రీట్

హైదరాబాద్ -500 001.

ADIVI BAPI RAJU RACHANALU - 1 ♦ NARAYANA RAO (NOVEL)

ప్రచురణ నెం. : 2350/198

ప్రతులు : 1000

ప్రథమ ముద్రణ : జనవరి, 2009

© కె. బాపిరాజు

వెల : రూ. 160


ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,

విజ్ఞాన భవన్, అబిడ్స్, హైదరాబాదు - 500 001.

ఫోన్ : 24744580/24735905

E-mail : visalaandhraph@yahoo.com,

www.visalaandhraph.com

విశాలాంధ్ర బుక్ హౌస్,

అబిడ్స్ & సుల్తాన్ బజార్ - హైదరాబాదు, విజయవాడ,

అనంతపురం, విశాఖపట్నం, హన్మకొండ, గుంటూరు,

తిరుపతి, కాకినాడ, కరీంనగర్, ఒంగోలు, శ్రీకాకుళం.



హెచ్చరిక: ఈ పుస్తకంలో ఏ భాగాన్ని కూడా పూర్తిగా గానీ, కొంతగానీ కాపీరైట్ హోల్డరు & ప్రచురణకర్తల నుండి ముందుగా రాతమూలకంగా అనుమతి పొందకుండా ఏ రూపంగా వాడుకున్నా, కాపీరైట్ చట్టరీత్యా నేరం. - ప్రచురణకర్తలు


ముద్రణ : శ్రీ కళాంజలి గ్రాఫిక్స్, హైదరాబాద్




అర్పణము

పితృపాదులు పూజ్యులు

నా కళాజీవితానికి

మోసులు వెలార్చిన

కీర్తి శేషులు

శ్రీ అడివి కృష్ణయ్యామాత్యులవారి

దివ్యస్మృతికి

కలం కుంచె అయినవేళ...

సాహితీ సంద్రంలో అడివి బాపిరాజు లాంటి ఆణిముత్యాలే లభిస్తాయి.

ఇరవయ్యవ శతాబ్దం తొలి అర్థభాగంలో లలిత కళావతంసులకూ, సాహితీవేత్తలకూ “బావ”- “బాపిబావ”. పదాలకు నాట్యం నేర్పాడు. నాట్యానికి సంగీతమద్దాడు, చిత్రాలకు ప్రాణం పోశాడు. చరిత్రను అక్షరీకరించాడు. సాంఘికానికి అభ్యుదయం ఊర్పు లందించాడు. అన్నింటా మానవత్వం ప్రజ్వలించాడు. ఒకే ఒక్కడు. అతడే అడివి బాపిరాజు. చెదరని క్రాఫూ, నలగని తెల్ల దిరుసూ, చెదరని చిరునవ్వూ, మానవత్వాన్ని పసిగట్టే వసివాడని చూపూ, సురభాండం చిలికే పలుకూ, ఆదుకోను సాగుతోన్న సొగసైన నడకా - ఇదీ బాపిరాజుగారి స్ఫురద్రూపం.

సాహిత్యంలో “నారాయణరావు"కు పర్యాయపదం అడివి బాపిరాజు. అంతటి ప్రసిద్ధిని సంపాదించిన సాంఘిక నవల సృజన 1934 లో. ఆంధ్ర విశ్వకళాపరిషత్తు - తెలుగులో నవలల పోటీ నిర్వహించింది. వచ్చిన నవలలలో రెండు నవలలను ప్రథమ బహుమతికి అర్హమైనవిగా న్యాయ నిర్ణేతలు భావించి బహుమతిని ఆ యిద్దరు రచయితలకూ సమానంగా ప్రదానం చేశారు. విశ్వనాథ సత్యనారాయణగారి "వేయి పడగలు", అడివి బాపిరాజుగారి “నారాయణరావు” నవలలే అవి! ఇదీ “నారాయణరావు” అవిర్భావ చరిత్ర. ఇందులో చిత్రితమైన నారాయణరావు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ముష్టి లక్ష్మీ నారాయణ రావు గారి స్థూల చరిత్రే నన్నది రచయిత సమకాలికుల అంచనా. బాపిరాజుగారి సన్నిహితుడూ భీమవరంలో నాటి న్యాయవాదుల్లో ప్రముఖుడూ, బాపిరాజు కుమార్తెలకు తోట పెద్దనాన్నా. చివరి దశలో పూల చెట్ల నర్సరీని హైదరాబాద్‌లో నిర్వహించిన సౌకుమార్య హృదయుడూనూ!

బాపిరాజు గారి మిగిలిన రచనలకన్నా వారి సాంఘిక, చారిత్రక నవలలకే ప్రాధాన్యమిచ్చారు పాఠకులు. విశాలాంధ్ర ప్రచురణాలయం ప్రస్తుతం బాపిరాజు గారి నవలలను ఏడు సంపుటాలుగా తేవాలన్నది సంకల్పం. ఇది ప్రథమ సంపుటం. వీలు వెంబడి వారి నాటికలు, గేయాలు, వ్యాసాలు తదితర రచనలనూ వెలువర్చాలని ఉద్దేశం. వారి రచనల జాబితాను ఈ సంపుటిలో చూడచ్చు. పాఠకుల ఆదరాభిమానాలపై ఆధారపడిందీ పథకం.

ఇందులో పాఠకుల ఉపయోగం కోసం సర్వశ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి కవిత, దేవులపల్లి రామానుజరావు గారి వ్యాసం, దాశరథి కృష్ణమాచార్య గారి అభిభాషణం చేర్చాం. ఓ చక్కని అంచనా వ్యాసం కూడా ప్రజాసాహితి నుండి సేకరించి వేశాం. బాపిరాజు గారి రచనలపై జాబితా తయారు చేసిన ఆచార్య వి. సిమ్మన్న గారికీ, వ్యాసకర్తలకూ, బాపిరాజుగారి వారసులకూ కృతజ్ఞతలు...

సాహిత్యంలో విశ్వనాథ సూర్యుడైతే బాపిరాజు చంద్రుడన్నది నాటి కొందరు సాహితీపరుల ఊహ. ఉత్కృష్ట ఆదర్శాలూ - స్వతంత్ర భావాలూ ఉన్న రేరాజు బాపిరాజు. సరసవర్తనుడూ రసరమ్య హృదయుడూనూ.


ఏటుకూరి ప్రసాద్‌

సంపాదకుడు.

26 జనవరి, 2009.

విశాలాంధ్ర ప్రచురణాలయం.

అంజలి


ఈ నవల ఉద్భవించటానికి ఆంధ్ర విశ్వవిద్యాలయము వారు కారకులు. వారికి నా కృతజ్ఞతాపూర్వక వందనాలు.

ఈ నవలారచనలో నాకు ఉత్సాహం కలిగించిన నా ప్రాణమిత్రులు డాక్టరు చెన్నాప్రగడ సుబ్బారావు, ముష్టి లక్ష్మీనారాయణ, ములుకుట్ల సుబ్బారాయుడు, మంచాళ జగన్నాథరావు, కాళీపట్నపు శేషశాయిగార్లకు నా ప్రేమాంజలులు.

ఈ కావ్యాన్ని సరిచూచిన ప్రజ్ఞామూర్తి, మిత్రుడు కాటూరి వేంకటేశ్వరునికి నమస్కారాలు.

ఈ నా కృతిని ప్రథమంలో తమ దినపత్రికలో ప్రచురించిన ఆంధ్ర పత్రికాధిపతులకు ఎంతయో కృతజ్ఞుణ్ణి.

ఇది అచ్చు వేయించుటలో నాకు వేవిధాల సహాయం చేసిన మిత్రులు యువకులు పెనుమర్తి కామేశ్వరరాయనికి, తెలికిచర్ల వెంకటరత్నంగారికి, మాధవపెద్ది కవికి, మారిన సుబ్బారావుగారికి, కలగర నాగభూషణం చౌదరి గారికి, శ్రీ శివలెంక శంభుప్రసాద్ గారికి నా నమస్సులు.

ఈ నవలను ఒకనాడు పాఠ్యగ్రంథముగా నిర్ణయించిన ఆంధ్ర, చెన్నపురి విశ్వవిద్యాలయాధికారులు ప్రోత్సాహోపకారముల కెంతయు కృతజ్ఞుడను.

అడివి బాపిరాజు

ఈ కథా, కథలోని పాత్రలూ కేవలం కల్పితములు.

అడివి బాపిరాజు మరోచూపు

అడివి బాపిరాజు పేరు వినగానే సాహితీవేత్తలకు గుర్తు వచ్చేవి ఆయన రాసిన నవలలు, కథలు. మరి కొందరికి ఆయన చిత్రించిన చిత్రాలు గుర్తుకొస్తాయి. సన్నిహితులకు ఆయన పాడిన పాటలు వినిపిస్తాయి. అయితే ఆయన “మీజాన్" తెలుగు దినపత్రిక సంపాదకునిగా, ప్రజాస్వామ్యయుతమైన పోరాటాలకు ఊతమిచ్చిన వానిగా, ప్రజాతంత్రవాదిగా, అభ్యుదయవాదిగా చేసిన కృషి చరిత్రలో మరుగున పడిపోయింది. ఆయన వ్యక్తిత్వంలో మరుగునపడిన ఈ కోణం గురించి తెలియ చేయడమే ఈ వ్యాస లక్ష్యం.

బాపిరాజు గారు రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థిగా వున్నప్పుడు దామెర్ల రామారావు గారు, కవికొండల వెంకటరావు గారు, జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు, ఆయనకు సమకాలికులు. కళాశాల ప్రిన్సిపాల్ అస్వాల్డ్ కూల్డ్రే చిత్రకారుడు. రచయిత. బాపిరాజు గారు అక్కడ బి.ఏ. పూర్తిచేసి, మద్రాసు లా కళాశాలలో బి.ఎల్. చదివి కొంతకాలం భీమవరం కోర్టులో ప్రాక్టీసు చేశారు. కూల్డ్రే స్వదేశానికి వెళ్తూ వెళ్తూ బాపిరాజును గొప్ప చిత్రకారునిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో లండన్ తీసుకొని వెళ్తాను. రమ్మని పిల్చాడు. అయితే బాపిరాజు గారు దేశం దాస్యంలో అలమటిస్తుంటే, తన అభివృద్ధి కోసం ఇంగ్లాండు వెళ్ళడానికి ఇష్టపడలేదు. కూల్డ్రే కూడా ఆయన తీసుకున్న నిర్ణయాన్ని హర్షించాడు.

“మీజాన్” పత్రిక సంపాదకవర్గంలో అడివి బాపిరాజు సహాయకులుగా విద్వాన్ విశ్వం, శ్రీనివాస చక్రవర్తి, తిరుమల రామచంద్ర, రాంభట్ల కృష్ణమూర్తి, బొమ్మకంటి సుబ్బారావు, బి.సి. కామరాజు మొదలగువారు పనిచేశారు. ఈనాడు వివిధ దినపత్రికల్లో వుండే శీర్షికలన్నీ ఆనాడే (1944) “మీజాన్” పత్రికలో వుండేవి. వివిధ ఫీచర్లు - “ధూపదీపాలు” (అడివి బాపిరాజు వ్యంగ్య రచనలు); “మిర్చీ మసాలా" (రాంభట్ల); “నర్తనశాల" (శ్రీనివాస చక్రవర్తి); “కలంపోటు" (బి.సి. కామరాజు); “టైం బాంబు” (బొమ్మకంటి సుబ్బారావు) ఇలా ఎన్నో నిర్వహించారు. సంపాదకునికి లేఖలు, రేడియో కార్యక్రమాలు, 'శృంగాటకం' శీర్షికతో పుస్తక సమీక్ష, సాహిత్య వ్యాసాలూ, సీరియల్ నవల, కథలు, తాతా ఎయిర్‌లైన్స్ వారి సమయాలు, స్టాక్ మార్కెట్ వివరాలు వుండేవి. మొత్తం 4 పేజీలలో మొదటి పేజీలో జాతీయ అంతర్జాతీయ వార్తలు, రెండో పేజీలో వార్తలు, నాల్గవ పేజీ అంతా తెలంగాణా వార్తలు వుండేవి. కోస్తా జిల్లాల వార్తలు కూడా అక్కడక్కడ వుంటుండేవి.

“మీజాన్” లోగో క్రింద “స్వాతంత్య్రము - సమత్వము - సౌభ్రాతృత్వము” అనే ఫ్రెంచి విప్లవం కాలంనాటి ఆశయాలు రాసి వుండేవి. "మీజాన్" మూడు ఎడిషన్లలో ఉర్దూ ఎడిషన్, హైదరాబాదు నవాబుని, ఇంగ్లీషు ఎడిషన్ బ్రిటీష్ వారిని పొగడేవిగా వుండేవి. ఒక్క తెలుగు ఎడిషన్ మాత్రం తెలంగాణా ప్రజల న్యాయమయిన పోరాటాలకి మద్దతు నిచ్చేది. దిన పత్రికలను వ్యావహారిక భాషకు అలవాటు చేసింది “మీజాన్” పత్రికే. ఆ తర్వాత ఇతర పత్రికల్నీ చెప్పుకోవాలి.

ఆంధ్ర మహాసభ వార్తలూ, తెలంగాణా గ్రామాల్లో ప్రజల కష్టనష్టాలు, పోరాటాలు, ప్రకటనలూ - అన్నీ నాల్గవ పేజీలో ప్రముఖంగా ప్రచురించేవారు. పత్రిక నిజాం నవాబు స్నేహితుని అల్లుడిదైనా (జి.యం. : ఏ. కలకత్తావాలా) తెలుగు “మీజాన్" పత్రికలో వచ్చే వార్తలపైనా, సంపాదకుని దృక్పథం పైనా పైనుంచి అదుపు వుండేది కాదు. ఈ వెసులుబాటును చక్కగా ఉపయోగించుకున్నారు అడివి బాపిరాజు గారు తన సంపాదక వర్గ బృందంతో సహా.

తెలంగాణా గ్రామాల్లో దేశముఖ్‌లు, పటేలు పట్వారీలు, భూస్వాములు సామాన్య ప్రజానీకంపై చేస్తున్న దాడులు, అణచివేత చర్యలు, వాటిని ప్రతిఘటిస్తూ ప్రజలు చేసే చిన్నా పెద్దా పోరాటాలు, ఖండన, నిరసన ప్రకటనలూ మొదలైనవన్నీ “మీజాన్” పత్రికను ఈనాడు చదువుతుంటే - అది పార్టీ పత్రికగా పని చేసిందా? అనిపిస్తుంది. అంతగా తెలంగాణా ప్రజల సమస్యలతో తాము ఏకమై ఆ వార్తలను "మీజాన్" అడివి బాపిరాజు గారి సంపాదకత్వంలో ప్రచురించింది.

ఆంధ్ర మహాసభవారు కొమరయ్య అమరుడైన తర్వాత (జూలై 4), 1946 జూలై 25వ తేదీన "కడివెండి దినంగా” పాటించి సభలూ, సమావేశాలూ నిర్వహించాలని పిలుపు ఇవ్వగా, “మీజాన్" పత్రిక కూడా ఆ పిలుపుకు సహజంగానే స్పందించి జూలై 25వ తేదీ సంచికను “కొమరయ్య ప్రత్యేక సంచిక"గా వెలువరించింది. కొమరయ్య మృత దేహం ఫోటో వేసి, దాని క్రింద అతనిపై రాసిన పాటను ప్రింటు చేశారు.

ఆంధ్ర మహాసభకు చెందిన పలువురు కార్యకర్తలు కథలు, రిపోర్టులు పంపించేవారు. వారిలో చాలామందిని రచయితలుగా "మీజాన్” తీర్చిదిద్దింది. రచనల్లోని స్వయం ప్రతిభ పోకుండా, వాటిని ఎడిట్ చేసి ప్రచురించేవారు. ముడి రచయితలను బాపిరాజుగారి ఆధ్వర్యంలో సానబెట్టడం జరిగింది. ఆ విధంగా తయారైన ఒక రచయితే ఆవుల పిచ్చయ్యగారు.

బాపిరాజు గారు జాతీయోద్యమంలో పాల్గొని ఒక్కోసారి ఆరు నెలలు చొప్పున రెండుసార్లు కారాగారవాసం చేశారు. ఒక జైలులో ఆయనతోపాటు రంప పితూరీ ఉద్యమానికి చెందిన పలనాటి యలమంద అనే విప్లవకారుడు కూడా వున్నాడు. అతని గురించి తెలుసుకొని, ఆశువుగా యలమందపై ఒక పాట రాసి, జైలులో గొంతెత్తి “ఓ పలనాటి యలమందా కలవరిస్తావా జైలు కొట్లల్లో..." అని పాడేవారు బాపిరాజు గారు. ఆ పాట పూర్తి పాఠం లభ్యంకాలేదు. “గోన గన్నారెడ్డి” పాత్రలో మనకి పలనాటి యలమంద కనబడ్తాడు.

పత్రికా స్వాతంత్ర్యాన్ని హరించే చట్టాలనూ, పత్రికల నిషేధాన్నీ నిర్ద్వంద్వంగా ఖండిస్తూ బాపిరాజు గారు రాసేవారు. అంతేకాదు తాను అధ్యక్షుడిగానూ, భాస్కరభట్ల కృష్ణారావూ, ఎల్లాప్రగడ సీతాకుమారి, వట్టికోట ఆళ్వారుస్వామి కార్యదర్శులుగానూ వుండిన హైదరాబాద్‌లో అభ్యుదయ రచయితల సంఘశాఖని తేది. 8 - 10 - 44న ప్రారంభించారు బాపిరాజుగారు. ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ తన ప్రసంగంలో అడివి బాపిరాజుగారు

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after 60 years counted from the beginning of the following calendar year after the death of the author (i.e. as of 2026, prior to January 1, 1966). Film, sound recordings, government works, anonymous works, and works first published over 60 years after the death of the author are protected for 60 years after publication.

Works by authors who died before 1941 entered the public domain after 50 years (before 1991) and copyright has not been restored.


This work is also in the public domain in the United States because it was first published outside the United States (and not published in the U.S. within 30 days), and it was first published before 1989 without complying with U.S. copyright formalities (renewal and/or copyright notice) and it was in the public domain in India on the URAA date (January 1, 1996). This is the combined effect of India having joined the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.

The critical date for copyright in the United States under the URAA is January 1, 1941.


This work may be in the public domain in countries and areas with longer native copyright terms that apply the rule of the shorter term to foreign works.

Public domainPublic domainfalsefalse