అడవి ముష్ణికాయ - అది నీకు ప్రియమాయె

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
అడవి ముష్ణికాయ - అది నీకు ప్రియమాయె - అయ్యో నే నేమందురా ॥అడవి ముష్ణికాయ॥

అనుపల్లవి:
పడుచుతనము చేత - భ్రమజెందుటేగాని - పదరా నీలి వార్త ॥అడవి ముష్ణికాయ॥

చరణం1:
వింత వింతల మారి - సంతమెరుగులాడి - తంతర గొట్టుదిరా
సంతోషమున దాని - సరస జేరుటేగాని
ఇంతి మంతనములు - యెండమావుల నీళ్లు ॥అడవి ముష్ణికాయ॥

చరణం2:
చేసితివౌ లేర - చెలియతో స్నేహము - చేతి సంచి వెచ్చము
ఆసచేత దాని - నంట బోవుటేకాని
కాసు చేయదు వట్టి - కట్టు గారడి సామి ॥అడవి ముష్ణికాయ॥

చరణం3:
కోప మెంచకు తోట్ల - వల్లూరి శ్రీవేణుగోపాలా బాగాయెరా
శ్రీపూర్ణుడగు దాసు - శ్రీరామకవి వాక్య
వ్యాపారములు వే - దాక్షరములు నమ్ము ॥అడవి ముష్ణికాయ॥