అంబ కన్న అధికులెవరు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు


పల్లవి: 
అంబకన్న అధికులెవరు లోకమందున
అరసి చూడ అంబ యొకతె ఉన్నదెందున!!

శిలల తెచ్చి ఉలుల మలచి అమ్మ యందునా?
వెన్నవంటి మనసు మాట తలపకుందునా!!
తలపకుందునా!! తలపకుందునా!!

వెలుగులీను దీప శిఖల అమ్మ యందునా
వెల్లివిరియు చల్లదనము వదలు కొందునా!
వదలు కొందునా! వదలు కొందునా!

అంతు లేని నింగి చూచి అమ్మ యందునా
లేనిదాని కున్న దనము నిచ్చు కొందునా
ఇచ్చు కొందునా! ఇచ్చుకొందునా!

మంత్ర తతుల నాదగతులనమ్మ యందునా
అమ్మలోని శాశ్వతత్వ మెన్నకుందునా
ఎన్నకుందునా! ఏన్నకుందునా!

మంచుకొండ ముద్దుపట్టి అమ్మ యందునా
ఆమె అఖిలమాత యనుట పలుకకుందునా
పలుకకుందునా! ఫలుకకుందునా!

శివుని మేన అర్ధ భాగమమ్మ యందునా
నిత్య పూర్ణశక్తినిట్లు చీల్చు కొందునా
చీల్చు కొందునా! చీల్చు కొందునా!

నేను--నీవు--వాడు -లన్ని అమ్మ యందునా
సచిద నంద దివ్యపదమ నూత గొందునా
ఊత గొందునా! ఊత గొందునా!

ఈ పాట mp3