అంత గీర్వాణము - నేనేరరా స్వామి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పల్లవి:
అంత గీర్వాణము - నేనేరరా స్వామి
అచ్చతెనుగు జెప్పరా ॥అంత గీర్వాణము॥

అనుపల్లవి:
వింతగా ననుజూచి - "విరిబోణియవి పూవు
బంతులా యేమని" - పకపక నగియెదవు ॥అంత గీర్వాణము॥

చరణం1:
చాలగా మదన ప్ర - చారములను నే
జాణగాను గదరా
"మేలు వేలుపుప్రోడ - మిద్దెటింటికి జేర
వీలు దెలుపు" మని - వేవేగ ననియెదవు ॥అంత గీర్వాణము॥

చరణం2:
వీరాసనము వైచి - పెదవి పంటను గరచి
తీరుగా కన్నుగీటుచు
"వారిజ ముఖి మంచి - పగడము ముత్యాల
చేరులోనికి దయ - సేయుమీ" అనియెదవు ॥అంత గీర్వాణము॥

చరణం3:
వాలాయముగ తోట్ల - వల్లూరి వేణుగో
పాల నిన్నే నమ్మితి
శీల మొప్పగ "దాసు - శ్రీరామ కవి కృతి
లీలాం శ్రుణు మహిళే" - అని పల్కెదవు ॥అంత గీర్వాణము॥