శ్రద్దాత్రయవిభాగ యోగము
Wikisource నుండి
| భగవద్గీత - తెలుగు అనువాదము (శ్రద్దాత్రయవిభాగ యోగము) | సంస్కృత శ్లోకములు→ |
[మార్చు] యే శాస్త్రవిధిముత్సృజ్య
అర్జునుదడన్నాడు:కృష్ణా! ఎవరైనా శాస్త్ర విధిని వదిలిపెట్టి శ్రద్ధతో ఆరాధిస్తే వాళ్ళ నిష్ట ఎలాంటిది?సాత్వికమా, రాజసికమా, తామసికమా?
[మార్చు] త్రివిధా భవతి శ్రద్ధా
శ్రీ భగవానుడన్నాడు:మనుష్యుల శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అని మూడు విధాలుగా ఉంటుంది. అది స్వభావం నుండి జనిస్తుంది. వాటిని గురించి విను.
[మార్చు] సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా
అర్జునా! ప్రతివారిలోని వ్యక్తి యొక్క స్వభావాన్ని అనుసరించి అతని శ్రద్ధ ఉంటుంది. ఈ మానవుడు శ్రద్ధా మయుడు. ఎవరి శ్రద్ధ ఎటువంటిదో వాళ్ళ వ్యక్తిత్వం అటువంటిది ఔతుంది.
[మార్చు] యజన్తే సాత్త్వికా
సాత్వికులు దేవతలను, రాజసికులు యక్షరాక్షసులను, తామసికులు భూత ప్రేత గణాలను ఆరాధిస్తారు.
[మార్చు] అశాస్త్రవిహితం ఘోరం
ఢంభాహంకారాలతో, ప్రబలమైన కామరాగాలతో కూడి శాస్త్ర విరుద్ధమైన, పీడా కరమైన తపస్సు చేసే వారూ,
[మార్చు] కర్షయన్తః శరీరస్థం
తెలివి తక్కువగా శరీరంలోని జీవకణాలనూ, శరీరంలో ఉండేనన్ను కూడా హింసించే వాళ్ళు అసురిక నిశ్చయం కలవారని తెలుసుకో.
[మార్చు] ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో
మానవులకు మూడు విధాలైన ఆహారం ప్రియమౌతుంది. యజ్ఞమూ, తపస్సూ, దానమూ కూడా అలాగే ఉంటుంది. వాటిలోని భేదాన్ని విను.
[మార్చు] ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః
ఆయువు సత్వగుణం, బలం, ఆరోగ్యం, సుఖం ప్రీతి వీటిని పెంచేవీ, రసంతో నిండినివీ, జిడ్డుతో నిగనిగలాడేవీ, కడుపులో చాలా కాలం ఉండేవీ, మనస్సునాకర్షించేవీ అయిన ఆహారాలు సాత్వికులకు ప్రియంగా ఉంటాయి.
[మార్చు] కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః
చేదూ, పులుపూ, ఉప్పూ, వేడీ, కారమూ, అన్నీ అతిగా కలిగి, పొడిపొడిగా ఉండి, దాహం పుట్టిస్తూ, దుఃఖాన్నీ, శోకాన్నీ, రోగాన్నీ కలిగించేవి రాజసికులకు ఇష్టం.
[మార్చు] యాతయామం గతరసం
వండిన తరువాత ఝాము దాటి పోయినదీ, రుచి పూర్తిగా పోయినదీ, పాసిపోయినదీ, వాసన గొట్టుతుందీ, ఎంగిలిదీ, అశుభ్రమైనదీ అయిన భోజనం తామసికులకు ఇష్టం.
[మార్చు] అఫలాకాఙ్క్షిభిర్యజ్ఞో
ఫలాపేక్ష లేకుండా, శాస్త్రాలలో విధింపబడిన ప్రకారంగానూ, తను ఆ కర్మ చేయడం కర్తవ్యమనే స్థిర చిత్తంతో చేయబడే యజ్ఞం సాత్విక యజ్ఞం.
[మార్చు] అభిసంధాయ తు ఫలం
అర్జునా! ఫలాన్ని ఆశిస్తూనో, డంభం కోసంమో చేయబడే యజ్ఞం రాజసిక యజ్ఞం అని తెలుసుకో
[మార్చు] విధిహీనమసృష్టాన్నం
శాస్త్ర విధి లేకుండా అన్నదానం చేయకుండా, మంత్రాలు లేకుండా, దక్షిణ ఇవ్వకుండా, శ్రద్ధ లేకుండా చేయబడే యజ్ఞం తామసిక యజ్ఞం అని చెప్పబడుతుంది.
[మార్చు] దేవద్విజగురుప్రాజ్ఞపూజనం
దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, విద్వాంసులను పూజించడం, శుచిత్వం, సూటియైన ప్రవర్తన, బ్రహ్మచర్యం అహింస ఇవి శారీరక తపస్సులు.
[మార్చు] అనుద్వేగకరం వాక్యం
ఇతరులను బాధింపనిదీ, సత్యనమూ, ప్రయమూ, హితమూ అయిన వాక్కు, స్వాధ్యాన్ని అభ్యసించడమూ ఇది వాచికమైన తపస్సు.
[మార్చు] మనః ప్రసాదః సౌమ్యత్వం
ప్రసన్నమైన మనస్సూ, మంచితనమూ, మౌనమూ, మనోనిగ్రహమూ, శుద్ధమైన భావాలూ-ఇవి మానసిక తపస్సు.
[మార్చు] శ్రద్ధయా పరయా తప్తం
పై మూడు రకాల తపస్సు పూర్తి శ్రద్ధతో, ఏ లాభమూ కోరకుండా, నిగ్రహంచేత చేయబడినప్పుడు, సాత్వికమైన తపస్సుగా చెప్పబడుతుంది.
[మార్చు] సత్కారమానపూజార్థం
సత్కారంకోసమూ, మాన మర్యాద కోసమూ డంభంతోనూ ఏ తపస్సు చేయబడుతుందో దానిని నిలకడా, స్తిరత్వమూ లేని రాజసిక తపస్సుఅంటారు.
[మార్చు] మూఢగ్రాహేణాత్మనో
సరిగ్గా అర్ధం చేసుకోకుండా, తన్ను తాను హింసించు కుంటూ లేదా ఇతరుకలకు పీడా కరంగా చేయబడే తామసికము అనబడుతుంది.
[మార్చు] దాతవ్యమితి యద్దానం
దానం చేయడం కర్తవ్యం అనేభావంతో, తిరిగి ఉపకారం చేయని వారికి దేశకాల పాత్రలని చూచి, చేసిన దానం సాత్వికమని చెప్పబడుతుంది.
[మార్చు] యత్తు ప్రత్యుపకారార్థం
ప్రత్యుపకారం ఊద్దేశించిగాని, ఫలాన్ని ఆశించిగాని, బలవంతంగానూ, భాధపడుతూ ఇచ్చే దానిని రాజిసిక దాన మంటారు.
[మార్చు] అదేశకాలే యద్దానమపాత్రేభ్యశ్చ
అపాత్రునికి, తగని తగని సమయంలో, ఇవ్వకూడని చోట, అగౌరవంతో, అవమానిస్తూ ఇచ్చేది తామసిక దానమని చెప్పబడుతుంది.
[మార్చు] ఓంతత్సదితి నిర్దేశో
ఓం తత్ సత్ అనే బ్రహ్మపదార్ధన్ని నిర్ధేశించే మూడు సంకేతాలని చెప్పబడుతుంది, వీటితోనే పూర్వం బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు ఏర్పరుపబడినాయి.
[మార్చు] తస్మాదోమిత్యుదాహృత్య
అందుచేత "ఓం"అంటూ బ్రహ్మవాదుల చేత శాస్త్ర విధాన ప్రకారం నిత్యమూ యజ్ఞ దాన తపః కర్మలు చేయబడు తున్నాయి.
[మార్చు] తదిత్యనభిసన్ధాయ ఫలం
"తత్"అంటూ మోక్షాన్ని కాక్షించే వారు ఫలం ఆశించకుండా, వివిధాలైన యజ్ఞాలూ, తపస్సులూ చేస్తుంటారు.
[మార్చు] సద్భావే సాధుభావే
పరమసత్యానికీ, మంచితనానికి సూచనగా "సత్"అనే పదాన్ని ప్రయోగిస్తారు. అర్జునా! మంచి కర్మలకు కూడా"సత్"అనే పదం ప్రయోగిప పడుతుంది.
[మార్చు] యజ్ఞే తపసి దానే
యజ్ఞ దాన తపస్సులలో నిలిచి ఉండడం"సత్"అని చెప్పబడుతుంది. దాని కోసం చేసే కర్మని కూడా "సత్"అనే అంటారు.
[మార్చు] అశ్రద్ధయా హుతం దత్తం
అలాంటిఅర్జునా! శ్రద్ధలేని హోమం, దానం, తపస్సు, మరి యే క్రియ అయినా సరే అది"అసత్"అని చెప్పబడుతుంది. అలాంటి కర్మ ఇహంలో కానీ, పరంలో కానీ ఫలం ఇవ్వదు.
[మార్చు] ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
| భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |