విభూతి యోగము
Wikisource నుండి
| భగవద్గీత - తెలుగు అనువాదము (విభూతి యోగము) | సంస్కృత శ్లోకములు→ |
[మార్చు] భూయ ఏవ మహాబాహో
శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు:- ఓమహానుభావా! అర్జునా! నా మాటలకు సంతోషిస్తున్న నీకు మేలు కలగాలని, నేను చెప్తున్న శ్రేష్టమైన ఈ మాటలు మళ్ళీ విను.
[మార్చు] న మే విదుః సురగణాః
నా పుట్టుకను గురించి దేవతలుకాని మహర్షులుకాని ఎరుగరు. దేవతలు మహర్షులు అందరికన్నా పూర్వపు వాణ్ణి నేను.
[మార్చు] యో మామజమనాదిం
పుట్టుకా మొదలులేని వాడుగానూ, లోకాల్కు ప్రభువుగాను నన్ను తెలుసుకున్న వాడు మనుష్యులలో జ్ఞాని అయి అన్ని పాపాలనుండి విమిక్తి చెందుతాడు.
[మార్చు] బుద్ధిర్జ్ఞానమసంమోహః
తెలివి, జ్ఞానం, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, మనో నిగ్రహము, సుఖ దుఃఖాలు, ఉండడమూ, లేకపోవడమూ, భయాభయాలు (నా వలననే కలుగుతాయి)
[మార్చు] అహింసా సమతా
అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, యశస్సు, అపయశస్సు మొదలైన వేరు వేరు భావాలు జీవుళ్ళలో నా వలననే కలుగుతాయి.
[మార్చు] మహర్షయః సప్త పూర్వే
శృష్టి ఆరంభంలో ఉన్న సప్తౠషులు, నలుగురు మనువులు నా సంకల్పము వలన పుట్టిన వారే. వారి నుండి ఈ ప్రజలు వచ్చారు.
[మార్చు] ఏతాం విభూతిం యోగం
ఈ నా విభూతి యోగాన్ని అసలు తత్వములో తెలుసుకున్నవాడు, చలించని యోగంలో నిలిచి పోతాడు. ఇందులో సందేహము లేదు.
[మార్చు] అహం సర్వస్య ప్రభవో
నేను అన్నిటి పుట్టుకకి హేతువుని నా వలననే సమస్తమూ నడుస్తుందని తెలుసుకున్న వివేకులు భక్తి పూరితులై నన్ను సేవిస్తారు.
[మార్చు] మచ్చిత్తా మద్గతప్రాణా
తమ మనసులను నాలో లీనము చేసి జీవితాలను నాకే అర్పించి, నన్ను గురించే పరస్పరమూ బోధించుకుంటూ, చెప్పుకుంటూ నిత్యమూ తృప్తి పడతారు, ఆనందిస్తారు.
[మార్చు] తేషాం సతతయుక్తానాం
అలాసతతమూ మనసు నాయందుంచి, ప్రీతితో సేవించే వారికి నన్ను చేరుకోవడానికి కావలసిన జ్ఞానయోగాన్ని నేను కలుగచేస్తాను.
[మార్చు] తేషామేవానుకమ్పార్థమహమజ్ఞానజం
వారిని కనికరించడం కోసమే నేను వారి మనస్సులలో నిలిచి, వారి అజ్ఞాన తమస్సుని ప్రకాశించే జ్ఞానదీపంతో నశింపజేస్తాను.
[మార్చు] పరం బ్రహ్మ పరం ధామ
అర్జునుడు ఇలా అన్నాడు:- నీవు పరబ్రహ్మవి, పరంధాముడివి, పరమ పవిత్రుడివి, శాశ్వతుడివి, దివ్యుడివి, పరమ పురుషుడివి ఆది దేవుడివి. , పుట్టుక లేనివాడివి.
[మార్చు] ఆహుస్త్వామృషయః సర్వే
అని అందరూ ౠషులు, దేవర్షి నారదుడూ, అలాగే అశితుడూ, దేవలుడూ, వ్యాసుడూ అంటారు. స్వయంగా నీవుకూడా అలాగే చెబుతున్నావు.
[మార్చు] సర్వమేతదృతం మన్యే
కేశవా! నీవు నాతో చెప్పినదంతా నిజమేనని విశ్వశిస్తున్నాను నీవ్యక్త శరీరాన్ని దేవతలుకాని దానవులు కాని ఎరుగరు.
[మార్చు] స్వయమేవాత్మనాత్మానం
భూత భావనుడా! భూతేశా! జగత్పతీ! పురుషోత్తమా! నిన్ను నీవే నీచేతనే స్వయంగా ఎరుగుదువు.
[మార్చు] వక్తుమర్హస్యశేషేణ దివ్యా
ఏయేవిభూతులలో నీవు ఈలోకమంతటా వ్యాపించి వున్నావో ఆదివ్యమైన విభూతులను అశేషంగా చెప్పడానికి నీవే తగినవాడివి.
[మార్చు] కథం విద్యామహం
ఓయోగీ! సదాధ్యానిస్తూ నేను నిన్ను ఎలా తెలుసుకోగలను?భగవంతుడా ఏయేరూపాలతో నిన్ను ధ్యానించవచ్చు?
[మార్చు] విస్తరేణాత్మనో యోగం
ఓజనార్ధనా! నీ యోగాన్ని విభూతిని విస్తారంగా చెప్పు. అమృతతుల్యమైన నీమాటలు ఎంత విన్నా నాకు తృప్తి తీరదు.
[మార్చు] హన్త తే కథయిష్యామి
శ్రీ భగవానుడన్నాడు:అర్జునా! నా దివ్య విభూతులలో ముక్యమైన వాటిని ఇప్పుడు నీకు చెబుతాను. నా విస్తారానికి అంతు అంటూ లేదు.
[మార్చు] అహమాత్మా గుడాకేశ
గుడాకేశా! నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను. ప్రాణుల అది మధ్యంతాలు(సృష్టి స్థితి లయాలు)నేనే.
[మార్చు] ఆదిత్యానామహం విష్ణుర్జ్యోతిషాం
నేను ఆదిత్యులలో విష్ణువుని, వెలిగించే వాళ్ళలో కిరనాలు కలిగిన సూర్యుడిని. మరుత్తులలో మరీచినీ, నక్షత్రాలలో చంద్రుడిని.
[మార్చు] వేదానాం సామవేదోఽస్మి
నేను వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియాలళో మనస్సుని, ప్రాణులలో చేతనత్వాన్ని.
[మార్చు] రుద్రాణాం శంకరశ్చాస్మి
నేను రుద్రులలో శంకరుణ్ణి, యక్ష రాక్షసులలో కుబేరుడిని, వసువులలో పావకుడిని, పర్వతాలలో మేరువుని.
[మార్చు] పురోధసాం చ ముఖ్యం
అర్జునా! నేను పురోహితులలో శ్రేష్టుడైన బ్రుహస్పతిని. సేనానాయకులలో కుమారస్వామిని, సరసులలో సాగరాన్ని అని తెలుసుకో.
[మార్చు] మహర్షీణాం భృగురహం
మహర్షులలో భ్రుగువుని, శబ్దాలలో ఏకాకషరమైన ఓంకారాన్ని. యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమాలయాన్ని.
[మార్చు] అశ్వత్థః సర్వవృక్షాణాం
నేను వృక్షాలలో రావి చెట్టుని. దేవర్షులలో నారదుణ్ణి. గంధర్వులలో చిత్రరధుణ్ణి, సిద్ధులలో కపిల మునిని.
[మార్చు] ఉచ్చైఃశ్రవసమశ్వానాం
నేను గుర్రాలలో అమౄతంతో పుట్టిన ఉచ్చైశ్వాన్ని, ఏనుగులలో ఇరావతాన్ని, మనుష్యులలో రాజుని.
[మార్చు] ఆయుధానామహం వజ్రం
నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మనమధుడిని, సర్పాలలో వాసుకిని.
[మార్చు] అనన్తశ్చాస్మి నాగానాం
నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వ్రుణూడిని, పీరులలో ఆర్యముడిని, సమ్యమవంతులలో నిగ్రహాన్ని.
[మార్చు] ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం
నేను దైత్యులలో ప్రహ్లాదుడీని, లెక్కలు కట్టేవాళ్ళల్లొ కాలాన్ని, మృగాలలో మృగేంద్రుడిని, పక్షులలో గరుత్మంతుడిని.
[మార్చు] పవనః పవతామస్మి
నేను పావనం చేసేవాళ్ళల్లో వాయువుని శస్త్రధారులలో రాముడిని, జలచరాలలో ముసలిని, నదులలో గంగని.
[మార్చు] సర్గాణామాదిరన్తశ్చ
అర్జునా! సృష్టులన్నిట్లో ఆదిమధ్యాంతాలు నేనే. విద్యలలో ఆధ్యాత్మ విద్యని, వాదించేవాళ్ళల్లో వాదాన్ని నేనే.
[మార్చు] అక్షరాణామకారోఽస్మి ద్వన్ద్వః
నేను అక్షరాలలో అకారాన్ని, సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని, నాశనంలేని కాలాన్ని. సర్వతోముఖంగా ఉండే ఈశ్వరుడిని.
[మార్చు] మృత్యుః సర్వహరశ్చాహముద్భవశ్చ
నేను సర్వాన్ని హరించే మృత్యువుని, భవిష్యత్తులో ఊదయించబోయే వారి పుట్టుకని, స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధా, ధృతి, క్షమా గుణాలు కూడానేనే.
[మార్చు] బృహత్సామ తథా సామ్నాం
అలాగే నేను సామాలలో బృహత్సామాన్ని, చందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంత ఋతువుని.
[మార్చు] ద్యూతం ఛలయతామస్మి
నేను మోసాలలో జూదాన్ని, తేజోవంతులలో తేజాన్ని, జయాన్ని ప్రయత్నాన్ని, సాత్వికులలో సత్వాన్ని.
[మార్చు] వృష్ణీనాం వాసుదేవోఽస్మి
నేను వృష్టి వంశస్తులలో వాసుదేవుడిని, పాండవులలో, అర్జునుడిని, మునులలో వ్యాసుడిని, కవులలో శుక్రాచార్యుడిని.
[మార్చు] దణ్డో దమయతామస్మి
శాసకులలో దండమూ, జయంకోరేవాళ్ళల్లోని నీతీ, రహస్యాలలో మౌనమూ, జ్ఞానులలో జ్ఞానమూ నేనే.
[మార్చు] యచ్చాపి సర్వభూతానాం
అర్జునా! అన్ని ప్రాణుల యొక్క మూలకారణం నేను. చరాచర ప్రపంచంలో నేను లేనిదంటూ ఏదీ లేదు.
[మార్చు] నాన్తోఽస్తి మమ దివ్యానాం
అర్జునా! నా దివ్యమైన విభూతులకు అంతులేదు. నా విభూతుల విస్తారాన్ని క్లుప్తంగానే చెప్పాను.
[మార్చు] యద్యద్విభూతిమత్సత్త్వం
విశిష్టమైన గుణమూ, శోభా, శక్తీ కలిగినది ఏది ఊణ్ణాదో ఆప్రతిదీ నా తేజము నుండి పుట్టినదని తెలుసుకో.
[మార్చు] అథవా బహునైతేన
అర్జునా ఇన్ని మాటలు దేనికి ఈ యావత్ప్రపంచాన్ని నేను ఒక్క అంశతో భరించి నిలిచి ఉన్నాను.
[మార్చు] తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
| భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |