మంచి ముత్యాల సరాలు

వికీసోర్స్ నుండి
శ్రీశ్రీ
ఖడ్గసృష్టి
1. ఖడ్గసృష్టి (కవిత)
2. శరచ్చంద్రిక
3. విషాదాంధ్ర
4. విశాలాంద్రలో ప్రజారాజ్యం
5. మున్నుడి
6. సదసత్సంశయం
7. మహాసంకల్పం
8. 'కో ఈ హస్ రహ్ హై' ' కో ఈ రో రహా హై'
9. గాంధీజీ!
10. మంచి ముత్యాల సరాలు
11. ఏవి తల్లీ!
12. సామాన్యుని కామన
13. రుబాయత్
14. భ్రమరగీత
15. బొమ్మలాంతరు
16. ఆఖరిమాట మొదటిమాట
17. విదూషకుని ఆత్మహత్య
18. టాంటాం
19. కొంటె కోణాలు
20. ఎ ఏ ఐ ఒ ఓ ఔ
21. అభిసారికి కడసారి
22. ఒకటీ - పదీ
23. నగరంలో వృషభం
24. అధివాస్తవికుల ప్రదేశం
25. మహాకవి ఆశ్చర్యం

ఎర్రశాలువ కప్పుకొనిమా ఇంటి కొచ్చిందొక రివాలర్‌ బాధలోబెంజైన్‌ సీసా ప్రేమలో డైమన్‌రాణి. మెడకి కాంచనమాలచక్కని జడకు చుట్టిన పుష్పవల్లి చావుబతుకుల జమిలిదుప్పటి కప్పు కొచ్చింది. ప్రేమగానం మోసుకుంటూ మహాశంఖం మాటలాడదు ఐంద్రకార్ముక మంత్రబర్హం మబ్బుచాటున మాయమైనది: పాతపీపా పీతపాపా పాడుకుంటూ తిరుగుతాయట కొత్త గొంతుక చెవిని పడితే గుడ్లునిప్పులుచెరుగుతాయట. నేను వెళ్ళిననాటినుంచీ నీడలోపలి మేడదిగదట కోడిగ్రుడ్డుప్రమాణకంగా కృష్ణశాస్త్రినిచదవలేదట. నన్ను తిట్టినతిట్లతోనే మల్లెపూవుల మాలకట్టెను నాకు వ్రాసిన ప్రేమలేఖలు పోస్టుచేయుట మానివేసెను. వెయ్యిరాచ్చిప్పలనిమేసిన వెర్రికుక్కకి గాలివాన రోలుచెప్పిన కథకి పాపం డోలు కంచికి పైనమైనది. ఓరి కూపస్థభల్లూకం గోడపై రుద్రాక్షపిల్లీ ఆటలోపలఅరిటిపండు పాట లెందుకురా. ఎగురుతున్నాయ్‌ ఇనపకోటలు పగులుతున్నాయ్‌ పాతపాటలు రగులుతున్నాయ్‌ రాచబాటలు రాజుకోవేరా. ప్రేమకి సంఘానికీ ఒక జారుముడితో చాలు పోరా నిన్ను తిట్టేవాళ్ళకోసం కళ్ళు విప్పుకు నిద్రపోరా. ఇదేనా కడసారి సలహా ఇలా తేనీ మనీపర్సుని ఆంధ్రపత్రిక కప్పుకొని కా రడవి కేగిందా రివాలర్‌. నేడు నా కంట్లోసివంగులె నిద్రలోనిలిచే ఫిరంగులు కాళ్ళ చుట్టూ కపాలాలే కావ్యగీతీకలాపాలు.