భక్తి యోగము
Wikisource నుండి
| భగవద్గీత - తెలుగు అనువాదము (భక్తి యోగము) | సంస్కృత శ్లోకములు→ |
[మార్చు] ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం
అర్జునుడు పలికెను - ఓ కృష్ణా! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరము నిన్నే భజించుచు, ధ్యానించుచు, పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘననిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంతభక్తిభావంతో సేవించువారును కలరు. ఈ రెండువిధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగవిదులెవరు?
[మార్చు] మయ్యావేశ్య మనో యే
శ్రీ భగవానుడు ఇట్లనెను - పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై, నిరంతరము నా భజనధ్యానాదులయందే నిమగ్నులై, అత్యంతశ్రద్దాభక్తులతో నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు - అని నా అభిప్రాయము.(వారు సగుణోపాసన లేదా నిర్గుణోపాసన లలొ ఏది ఐనను అనుసరించవచ్చు)
[మార్చు] యే త్వక్షరమనిర్దేశ్యమవ్యక్తం
కాని ఇంద్రియసముదాయమును చక్కగా వశపరచుకొనినవారును, సకల భూతములకును హితమునే కోరుచుండువారును, సర్వప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు.
[మార్చు] సంనియమ్యేన్ద్రియగ్రామం
అట్టివారు మనోబుద్దులకు అతీతుడును, సర్వవ్యాపియు, అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును, కూటస్థుడును, నిత్యుడును, నిశ్చలుడును, నిరాకారుడును, నాశరహితుడును ఐన సచ్చిదానంద ఘనపరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావస్థితులై, ధ్యానము చేయుచు, భక్తితో భజించుచు, ఆ పరబ్రహ్మమునే పొందుదురు.
[మార్చు] క్లేశోऽధికతరస్తేషామవ్యక్తాసక్తచేతసామ్
నిరాకార బ్రహ్మలో మనస్సు నిలిపిన వాళ్ళకు ప్రయాస ఎక్కువ. దేహధారులకు నిర్గుణ తత్వ లక్ష్యాన్ని అందుకోవడము చాలా కష్టం.
[మార్చు] యే తు సర్వాణి కర్మాణి
సర్వకర్మలన్నీనాలో వదిలి, నన్నే లక్ష్యముగా పెట్టుకుని మనస్సుని అన్య విషయాల వైపు మరలనీయకుండా ధ్యానిస్తూ ఎవరు ఉపాసిస్తారో,
[మార్చు] తేషామహం సముద్ధర్తా
అర్జునా|నాలో మనసు నిలిపిన వాళ్ళను త్వరలోనే మృత్యుసంసార సాగరం నుండి నేనే ఉద్ధరిస్తాను.
[మార్చు] మయ్యేవ మన ఆధత్స్వ
నాలోనే మనసు నిలుపు బుద్ధిని నాలోనే ఉంచు. ఆ తరవాత నాలోనే నివిసిస్తావు. ఇందులో సందేహం లేదు.
[మార్చు] అథ చిత్తం సమాధాతుం
ధనంజయా|స్థిరంగా నాలో చిత్తాన్ని నిలపలేక పోయినట్లైతే, అప్పుడు అభ్యాస యోగం చేత నన్ను పొందడానికి ప్రయత్నించు.
[మార్చు] అభ్యాసేऽప్యసమర్థోऽసి
అభ్యాసం కూడా నీవు చేయలేక పోతే, నా పరమైన కర్మలలో నిమగ్నం కా. నా కోసం కర్మలు చేసినప్పటికీ సిద్ధిని పొందుతావు.
[మార్చు] అథైతదప్యశక్తోऽసి కర్తుం
నా కొరకై కర్మలు ఆచరించడానికి కూడా నీవు అసమర్ధడివైతే నన్ను శరణు పొంది నీ కోసం ఛెసే కర్మలన్నింటినీ నాకు సమర్పించి, ఆ సమస్త కర్మల ఫలాన్ని త్యజించు.
[మార్చు] శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్జ్ఞానాద్ధ్యానం
అభ్యాసంకంటే జ్ఞానం మేలు. జ్ఞానానికన్నా కర్మఫల త్యాగం ఎక్కువైనది. ఈ త్యాగం వలన తరవాత శాంతి(మోక్షం) కలుగుతుంది.
[మార్చు] అద్వేష్టా సర్వభూతానాం
ఏ ప్రాణాన్ని ద్వేషించని వాడు, అహంకార మమకారాలు లేని వాడు, సుఖదుహ్కాలలో సమంగా వ్యవహరించేవాడు, క్షమా గుణం కలవాడు,
[మార్చు] సంతుష్టః సతతం యోగీ
నిత్యము సంతుష్టుడై , యోగియై, మనో నిగ్రహం కలవాడై, దృఢమైన నిశ్చయముతో, మనో బుద్ధులను నాకు అర్పించిన నా భక్తుడు నాకు ప్రియుడు.
[మార్చు] యస్మాన్నోద్విజతే లోకో
ఎవరివల్ల లోకం వ్యధ చెందదో, లోకం వలన ఎవడు వ్యధ చెందడో, సంతోషం, కోపం, భయం, ఉద్వేగాల నుండి ఎవడు ముక్తుడో అతడు నాకు ప్రియుడు.
[మార్చు] అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో
అపేక్ష లేని వాడు, శుచియైన వాడు, దక్షత కలవాడు, ఉదాసీనుడు, వ్యధలు నశించిన వాడు, అన్ని విధాలైన, కార్యాలలలో నేను చేస్తున్నాననే భావం లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు.
[మార్చు] యో న హృష్యతి న ద్వేష్టి
ఎవడు సంతోషించడో, ద్వేషించడో, శోకించడో, కాంక్షించడో సుభాశుభాలను వదిలేస్తాడో అలాంటి భక్తుడు నాకు ప్రియుడు.
[మార్చు] సమః శత్రౌ చ మిత్రే చ
శత్రువులు, మిత్రులు, మానావమానాలు, శీతోష్ణాలు, సుఖదుఃఖాలు వీటియందు సమంగా ఉండే వాడు సంగాన్ని విడిచే వాడు(నాకు ఇష్టుడు)
[మార్చు] తుల్యనిన్దాస్తుతిర్మౌనీ
నిందాస్తుతులను తుల్యంగా ఎంచేవాడు, మౌనంగా ఉండే వాడు, ఉన్నదానితో సంతృప్తి పడేవాడు, నికేతనం అక్కర లేని వాడు, స్థిరమైన బుద్ధి కల భక్తుడు నాకు ప్రియుడు.
[మార్చు] యే తు ధర్మ్యామృతమిదం
ధర్మయుక్తమూ, శాశ్వతమూ అయిన దీనిని చెప్పిన ప్రకారంగా శ్రద్ధతో, నన్ను లక్ష్యంగా పెట్టుకొని ఎవరు ఉపాసిస్తారో ఆభక్తులే నాకు పరమ ప్రియులు.
[మార్చు] ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
| భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |