పురుషోత్తమప్రాప్తి యోగము

వికీసోర్స్ నుండి


భగవద్గీత - తెలుగు అనువాదము (పురుషోత్తమప్రాప్తి యోగము)




ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం[మార్చు]

శ్రీ భగవానుడన్నాడు:మొదలు పైకి శాఖలు క్రిందకు ఉన్న అశ్వత్థానిని అవ్యయమైనదని పెద్దలు చెప్తారు. దాని ఆకులు ఛందస్సులు. దీనిని ఎరిగినవాడు వేదాలను ఎరిగినట్లే.

అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా[మార్చు]

దానికొమ్మలు క్రిందికి పైకి విస్తరించుకొని ఉన్నాయి. గుణాలచే పెరుగుతాయి. విషయ వస్తువులనే చిగుళ్ళు కలవి. కర్మలలో బంధిస్తాయి. దాని వేళ్ళు క్రింద బాగా పాతుకొని మనుష్య లోకం అంతా వ్యాపించి కర్మలతో బంధిస్తాయి.

న రూపమస్యేహ తథోపలభ్యతే[మార్చు]

దాని రూపము ఆ ప్రకారము(తల క్రింద ఉండే చెట్టులా)ఇక్కడ కనిపించదు. దాని మొదలూ, తుదీ, ఆధారము ఏవీ కనిపించదు. గట్టిగా పాతుకు పోయిన ఈ అశ్వత్థానిని దృఢమైన అసంగ భావమనే ఆయుధంతో ఛేధించి,

తతః పదం తత్పరిమార్గితవ్యం[మార్చు]

ఆ తరవాత ఎక్కడికి పోతే మరలా తిరిగి రారో ఆ స్థానాన్ని వెదకాలి. ఎవరినుండి ఈ పురాతన సృష్టి కార్యము ప్రారంభము ఐనదో , ఆ ఆది పురుషుణ్ణే నేను శరణు వేడుతాను.

నిర్మానమోహా జితసఙ్గదోషా[మార్చు]

మానవ మోహాన్ని త్యజించిన వాళ్ళూ, సంగదోషాన్ని జయించిన వాళ్ళూ, సదా ఆత్మ జ్ఞానంలో నిమగ్నమైన వారు, విషయ వాంఛలన్నీ వెనుకకు మరలించిన వాళ్ళూ, సుఖ దుఃఖాలనే ద్వందాలనుండి విముక్తులైన వారు, మూఢత్వము పోయి అవ్యయ పదాన్ని చేరు కుంటారు.

న తద్భాసయతే సూర్యో[మార్చు]

ఆ పదాన్ని సూరుడు, చంద్రుడు, అగ్ని వెలిగించరు. ఎక్కడకు వెళితే తిరిగి రారో అది నా పరమ ధామము.

మమైవాంశో జీవలోకే[మార్చు]

సనాతనమైన నా అంశే జీవలోకములో జీవుడిగా మారి, ప్రకృతినుండి మనస్సుతో కూడిన ఆరు ఇంద్రియాలను ఆకర్షిస్తుంది.

శరీరం యదవాప్నోతి[మార్చు]

ఈశ్వరుడు శరీరాన్ని పొందినప్పుడూ, విడిచినప్పుడూ వాయువు పూలలోంచి వాసనను తీసుకుపోయే విధముగా ఈ ఆరింటిని తీసుకొని ప్రయాణిస్తాడు.

శ్రోత్రం చక్షుః స్పర్శనం[మార్చు]

చెవీ, ముక్కూ, కన్నూ, నాలుకాచర్మమూ, మనస్సు వీటిని అధిష్టించి జీవుడు విషయాలను అనుభవిస్తాడు.

ఉత్క్రామన్తం స్థితం వాపి[మార్చు]

శరీరము నుండి నిష్క్రమించేటప్పుడు కానీ, శరీరంలో ఉన్నప్పుడు కానీ విమూఢులు ఈయనను చూడరు. జ్ఞానులు మాత్రమే చూస్తారు.

యతన్తో యోగినశ్చైనం[మార్చు]

సాధన చేసే యోగులు తమ ఆత్మలో ఉన్న భగవదంశను చూడకలరు. మస్సు పరిపక్వము కాని వారు వివేకహీనులు సరైన జ్ఞానము లేనందువలన సాధన చేసినా చూడలేరు.

యదాదిత్యగతం తేజో[మార్చు]

జగత్తు నంతటినీ వెలిగించే సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో ఉన్న తేజస్సు ఏదో అది నాదని తెలుసుకో.

గామావిశ్య చ భూతాని[మార్చు]

భూమిలోనికి ప్రవేశించి ప్రాణులందరిని నేను నా శక్తితో భరిస్తాను. ఇంకా రసాత్మకుడైన చంద్రుడిని అయి ఓషధులన్నింటికీ పుష్టి ని ఇస్తాను.

అహం వైశ్వానరో భూత్వా[మార్చు]

నేను వైశ్వానరుణ్ణి అయి ప్రాణుల శరీరాన్ని ఆశ్రయించి, ప్రాణ ఆపానములతో కలిసి నాలుగు రకముల అన్నాన్ని ఆరగిస్తాను.

సర్వస్య చాహం హృది సంనివిష్టో[మార్చు]

ఇక నేను అందరి హృదయాలలో ప్రవేశించి ఉన్నాను. నానుండే జ్ఞానము, జ్ఞాపకము, మరుపూ కలుగుతాయి. అన్ని వేదాల ద్వారా తెలియబడవలసిన వాడిని నేనే, వేదాంతాన్నిచేసిన వాడిని, వేదాన్ని తెలుసుకునే వాడిని కూడా నేనే.

ద్వావిమౌ పురుషౌ లోకే[మార్చు]

శరీరం అనబడు లోకములో క్షరుడూ, అక్షరుడు అనే ఇద్దరు పురుషులు ఉన్నారు. అందులో క్షర పురుషున్ని జీవాత్మ గానూ , అక్షర పురుషున్ని ఆత్మగానూ చెప్పారు. ప్రతి శరీరంలోనూ జీవాత్మ(క్షరుని) తోపాటు అక్షరుడైన ఆత్మ కూటస్థంగా వున్నాడు.

దీనికి ఉదాహరణ , "అఖిల జీవసంగ ఆత్మలింగ" అనే బ్రహ్మంగారి ఆత్మజ్ఞాన పద్యాల మకుటం.

ఉత్తమః పురుషస్త్వన్యః[మార్చు]

ఉత్తమ పురుషుడు వేరే ఉన్నాడు. అతడిని పరమాత్మ అంటారు. నాశనము లేని ఆ ఈశ్వరుడు మూడు లోకాలలో ప్రవేశించి వాటిని భరిస్తాడు.

యస్మాత్క్షరమతీతోऽహమక్షరాదపి[మార్చు]

నేను క్షరానికి అతీతుడిని మరియు, అక్షరుడికన్నా కూడా ఉత్తముడినికనుక ఈ లోకములోనూ వేదములోనూ పురుషోత్తముడిగా కీర్తింపబడ్డాను.

యో మామేవమసంమూఢో[మార్చు]

అర్జునా! పురుషోత్తముడిని అయిన నన్ను ఈ విధముగా ఏ జ్ఞాని తెలుసుకుంటాడో, అతడు సర్వమూ తెలిసిన వాడై అన్ని విధములుగా నన్ను సేవిస్తాడు(పొందుతాడు).

ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం[మార్చు]

భారతా అలా గోప్యమైన ఈ శాస్తం నాచే చెప్పబడినది. దీనిని అర్ధము చేసుకుంటే బుద్ధిమంతుడూ కృతకృత్యుడూ ఔతాడు.



భగవద్గీత - తెలుగు అనువాదము




భగవద్గీత సంస్కృతము (శ్లోకములు)
అథ ప్రథమోऽధ్యాయః | అథ ద్వితీయోऽధ్యాయః | అథ తృతీయోऽధ్యాయః | అథ చతుర్థోऽధ్యాయః | అథ పఞ్చమోऽధ్యాయః | అథ షష్ఠోऽధ్యాయః | అథ సప్తమోऽధ్యాయః | అథాష్టమోऽధ్యాయః | అథ నవమోऽధ్యాయః | అథ దశమోऽధ్యాయః | అథైకాదశోऽధ్యాయః | అథ ద్వాదశోऽధ్యాయః | అథ త్రయోదశోऽధ్యాయః | అథ చతుర్దశోऽధ్యాయః | అథ పఞ్చదశోऽధ్యాయః | అథ షోడశోऽధ్యాయః | అథ సప్తదశోऽధ్యాయః | అథాష్టాదశోऽధ్యాయః | గీతా మహాత్మ్యము
భగవద్గీత - తెలుగు అనువాదము
అర్జునవిషాద యోగము | సాంఖ్య యోగము | కర్మ యోగము | జ్ఞాన యోగము | కర్మసన్యాస యోగము | ఆత్మసంయమ యోగము | జ్ఞానవిజ్ఞాన యోగము | అక్షరపరబ్రహ్మ యోగము | రాజవిద్యారాజగుహ్య యోగము | విభూతి యోగము | విశ్వరూపసందర్శన యోగము | భక్తి యోగము | క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము | గుణత్రయవిభాగ యోగము | పురుషోత్తమప్రాప్తి యోగము | దైవాసురసంపద్విభాగ యోగము | శ్రద్దాత్రయవిభాగ యోగము | మోక్షసన్యాస యోగము | గీతా మహాత్మ్యము