పుట:Contributing to Wikipedia brochure draft version 7.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వికీపీడియా వ్యాసం నాణ్యత అంచనావేయటం

వికీపీడియా వ్యాసాల నాణ్యతలో చాలా తేడాలుంటాయి. కొన్ని వ్యాసాలు చాలా బాగా ఉంటాయి, కానీ కొన్ని కొద్దిపాటివివరంతో, స్పష్టత లేకుండా వుంటాయి, లేదా పక్షపాతంతో కూడిన దృక్కోణాలను కలిగి వుంటాయి, లేదా పాతబడిన సమాచారంతో వుంటాయి. సాధారణంగా, అధిక నాణ్యతగల రచనలు ఈ లక్షణాలు కలిగి వుంటాయి:

  • ప్రవేశికలో సులభంగా అర్ధమయ్యే వ్యాస సారాంశం,
  • ఒక స్పష్టమైన నిర్మాణం,
  • విషయం గురించి సమతుల్యత
  • తటస్థ దృక్కోణం
  • విశ్వసనీయమైన మూలాలు

వ్యాసం నాణ్యత గురించి అదనపు సమాచారం కొరకు " వికీపీడియా నాణ్యత అంచనా" (Evaluating Wikipedia) కరపత్రం చూడండి ( తరువాతి విభాగం చూడండి)

అదనపు వనరులు

Evaluating Wikipedia: వికీపీడియా నాణ్యత అంచనా: వ్యాస మార్పుల క్రమం, వ్యాసాల నాణ్యతను అంచనా చేయడం వ్యాసాలు ఎలా పరిణామం చెందుతాయి, మంచి నాణ్యత గల వ్యాసాల అంశాలు, నాణ్యత లేని వ్యాసాల సంకేతాలు అన్ని ఈ మార్గదర్శి లో ఇవ్వబడ్డాయి. http://education.wikimedia.org/evaluating

వికీపీడియాకు బొమ్మలు చేర్చడం: వికీమీడియా కామన్స్ తోడ్పాటుకు అవసరమయ్యే చేపుస్తకం. వికీమీడియా కామన్స్, వికీపీడియా లో వాడే దస్త్రాలనిల్వ గురించిన ఈ పుస్తకానికి తోడుగా వున్న పుస్తకం. ఈ కరపత్రం కామన్స్ ఏమిటి, ఫైళ్ళను ఏవిధంగా ఎక్కించాలి, ఫైళ్ళను ఏవిధంగా ఉపయోగించాలి, ఉచిత లైసెన్స్ ల ప్రాథమిక అంశాలను తెలుపుతుంది. http://education.wikimedia.org/illustrating

Instructor basics: బోధకుడి కొరకు ప్రాథమికాంశాలు : వికీపీడియాను బోధనోపకరణముగా ఎలా మార్చాలి. ఈ పుస్తకం విద్యాబోధకులు వికీపీడియా కృషిలో విద్యార్ధులను భాగస్వామ్యం చేయటానికి మంచి పద్ధతులను తెలుపుతుంది. తమ పాఠ్యప్రణాళికలో భాగంగా వికీపీడియా వాడడానికి వివరాలు తెలుపుతుంది. http://education.wikimedia.org/instructorbasics