దైవాసురసంపద్విభాగ యోగము
Wikisource నుండి
| భగవద్గీత - తెలుగు అనువాదము (దైవాసురసంపద్విభాగ యోగము) | సంస్కృత శ్లోకములు→ |
[మార్చు] అభయం సత్త్వసంశుద్ధిర్జ్ఞానయోగవ్యవస్థితిః
అభయం సత్వసుద్ధి జ్ఞానయోగంలో నిలవడం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, నిజాయితీ(దైవీ పురుషుడికి కలుగుతాయి)
[మార్చు] అహింసా సత్యమక్రోధస్త్యాగః
అహింస, సత్యం, కోపము లేకపోవడం, మృదుస్వభావం, సిగ్గు, చాపల్యం లేకపోవడం
[మార్చు] తేజః క్షమా ధృతిః
తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, అభిమాన రాహిత్యం. . . అర్జునా! ఇవి దైవీ సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి.
[మార్చు] దమ్భో దర్పోऽభిమానశ్చ క్రోధః
అర్జునా! దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పరుషత్వం, అజ్ఞానం. . . ఈ లక్షణాలు అసుర సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి.
[మార్చు] దైవీ సంపద్విమోక్షాయ
దైవీ సంపద మోక్షానికి, అసుర సంపద సంసార బంధానికి కారణం. అర్జునా! విచారించకు, నీవు దైవీ సంపదతోనే పుట్టావు.
[మార్చు] ద్వౌ భూతసర్గౌ లోకేऽస్మిన్దైవ
ఈ లోకంలో దైవం, అసురం అని ప్రాణుల సృష్టి రెండు రకాలు. దైవసృష్టిని గురించి విస్తారంగా చెప్పబడినది. అర్జునా! అసుర సృష్టి గురించివిను.
[మార్చు] ప్రవృత్తిం చ నివృత్తిం చ
అసుర స్వభావం కలవారు ప్రవృత్తిని కాని నివృత్తిని గాని ఎరుగరు. వాళ్ళలో శౌచమూ, ఆచారమూ, సత్యమూ ఉండవు.
[మార్చు] అసత్యమప్రతిష్ఠం తే
జగత్తు మిధ్య అనీ, దానికి ధర్మా ధర్మాలు ఆధారము ఉండవని, ఈశ్వరుడే లేడనీ ఈ ప్రపంచములోని ప్రాణులు స్త్రీ పురుషుల కలయిక వలననే పుట్టినదనీ వారు అంటారు. అందుచేత ఈ జగత్తుకి కారణం కామమే అంటారు అసుర జనులు.
[మార్చు] ఏతాం దృష్టిమవష్టభ్య
ఈ దృష్టినే పట్టుకుని వేలాడుతూ వీళ్ళు ధర్మ భ్రష్టులై సంకుచిత బుద్ధులై, ప్రపంచానికి శత్రువులై, కౄరకర్ములై లోక నాశనం కోసం పుడతారు.
[మార్చు] కామమాశ్రిత్య దుష్పూరం
వాళ్ళుతృప్తి పరచడానికి వీలులేనంత కోరికలను పెట్టుకొని దంభ, మాన, మదాలతో నిండి, భ్రాంతి వలన అసత్యమైన వాటి వెంట అనాచారంగా ప్రవర్తిస్తారు.
[మార్చు] చిన్తామపరిమేయాం
వాళ్ళు మరణించే వరకు అపరిమితములైన యోచనలలో మునిగి తేలుతూ, కామ భోగాలు తప్ప జీవితానికి వేరే లక్ష్యం లేదని నిశ్ఛయించుకున్న వాళ్ళు.
[మార్చు] ఆశాపాశశతైర్బద్ధాః
వాళ్ళు వందలాది ఆశా పాశాలతో కట్టుబడి, కామక్రోధాలకు వశులై తమ కామభోగానికిగాను, అన్యాయంగానైనా సరే సంపదలను సమకూర్చుకోవాలని అనుకుంటారు.
[మార్చు] ఇదమద్య మయా
ఈ రోజు ఇంత సంపద నాకు లభించింది. ఈ కోరికలని తీర్చుకుంటాను. ఇంత ధనం నాకుంది. ఇక ముందు ఇంకా ఇంత ధనం వస్తుంది.
[మార్చు] అసౌ మయా హతః
ఈ శత్రువు నాచే చంపబడినాడు, ఇతరులను కూడా చంపేస్తాను. నేను ఈశ్వరుణ్ణి, భోగిని, సిద్ధుణ్ణి, బలవంతుణ్ణి, సుఖిని.
[మార్చు] ఆఢ్యోऽభిజనవానస్మి
నేను ధనవంతుణ్ణి, కులమున్న వాడిని, నాకు సమానులు ఎవరున్నారు?యజ్ఞం చేస్తాను. దానాలిస్తాను, సంతోషిస్తాను ఇలా అజ్ఞానంతో భ్రాంతి చెందుతారు.
[మార్చు] అనేకచిత్తవిభ్రాన్తా
అనేక రకాల ఆలోచనలతో భ్రాంత చిత్తులై అజ్ఞానపు వలలో చిక్కుకొని, కామభోగాలలో మరులుగొని అపవిత్రమైన నరకంలో పడతారు.
[మార్చు] ఆత్మసంభావితాః స్తబ్ధా
తమని తాము మెచ్చుకునే వాళ్ళు, మొండి వారు ధన మాన మదాలతో కూడుకుని, గుడ్డి వాళ్ళై దంభం కోసం శాస్త్ర పద్ధతిని వర్ణించి నామమాత్రంగా యజ్ఞాలు చేస్తారు.
[మార్చు] అహంకారం బలం దర్పం
అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామ క్రోధాలను ఆశ్రయించుకొని, తమలోను, ఇతరులలోను ఉన్న నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు నరాధములను నేను నిత్యము అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.
[మార్చు] తానహం ద్విషతః
ఇలా నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు, నరాధములను నిత్యమూ నేను అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.
[మార్చు] ఆసురీం యోనిమాపన్నా
అర్జునా! అసురీ జన్మను పొందిన మూర్ఖులు ప్రతి జన్మలోను నన్ను చేరకుండానే ఇంకా అధోగతికి పోతారు.
[మార్చు] త్రివిధం నరకస్యేదం ద్వారం
ఆత్మ నాశనానికి దారి తీసే నరక ద్వారాలు మూడు-కామం, క్రోధం, లోభం. అందుచేత ఈ మూడింటిని త్యజించాలి.
[మార్చు] ఏతైర్విముక్తః కౌన్తేయ
కౌంతేయా! నరక ద్వారాలైన ఈ కామ క్రోధ లోభాలు మూడింటి నుండి విడుదల పొందిన నరుడు, తనకు శ్రేయస్సును కలిగించే కర్మలు చేస్తాడు. దాని వలన పరమగతిని పొందుతాడు.
[మార్చు] యః శాస్త్రవిధిముత్సృజ్య
తన కోరికల కారణంగా శాస్త్రాన్ని ఉల్లంఘించి ప్రవర్తించిన వాడు కార్యసిద్ధిని పొందడు. సుఖాన్ని పరమగతిని కూడా పొందడు.
[మార్చు] తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే
అందుచేత కర్తవ్యాన్ని, అకర్తవ్యాన్నినిర్ధారించుకోవడానికి శాస్త్రం ప్రమాణం. శాస్త్రం చెప్పిన విధిని తెలుసుకుని ఇక్కడ నీవు కర్మ చెయ్యడం మంచిది.
[మార్చు] ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
| భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |