జ్ఞాన యోగము
Wikisource నుండి
| భగవద్గీత - తెలుగు అనువాదము (జ్ఞాన యోగము) | సంస్కృత శ్లోకములు→ |
[మార్చు] ఇమం వివస్వతే యోగం
శ్రీ కృష్ణభగవానుడు పలికినది:- అవ్యయమైన ఈ కర్మయోగాన్ని నేను సూర్యుడికి భోదించాను.సూర్యుడు మనువుకి చెప్పాడు.మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు.
[మార్చు] ఏవం పరమ్పరాప్రాప్తమిమం
ఇలా పరంపరగా ప్రాప్తమైన కర్మయోగాన్ని రాజర్షులుఎరుగుదురు.ఓ పరంతపా కాలగతిలో ఈ గొప్పయోగం ఈ లోకంలో నశించి పోయింది.
[మార్చు] స ఏవాయం మయా
ఆ సనాతనమైన యోగాన్నే నా భక్తుడవు,స్నేహితుడవు ఐన నీకు భోధించాను.ఇది ఉత్తమమైనదీ రహస్యమైనదీ కూడా.
[మార్చు] అపరం భవతో జన్మ
అర్జునుడు ఇలా అడిగాడు:- నీ జన్మ ఇటీవలది.సూర్యుని జన్మ ఎంతో ముందున్నది.నీవు సూర్యునికి ఉపదేశించావని అన్నావు.దీనిని ఎలా అర్ధం చేసుకోవాలి?
[మార్చు] బహూని మే వ్యతీతాని
శ్రీ కృష్ణభగవానుడు ఇలా పలికాడు:- అర్జునా! నాకూ నీకూ కూడా ఎన్నో జన్మలు గడిచిపోయాయి.నేను వాటన్నిటిని ఎరుగుదును.నీవు ఎరుగవు.
[మార్చు] అజోऽపి సన్నవ్యయాత్మా
జన్మ లేనివాడినీ,అవ్యయుడినీ,జీవులందరికి అధిపతినైనా,నాప్రకృతిని అధిరోహించి నామాయవలన జన్మిస్తుంటాను.
[మార్చు] యదా యదా హి ధర్మస్య
అర్జునా! ఎప్పుడు ధర్మము క్షీణించి అధర్మం వృద్ధి చెందుతుందో అప్పుడు నన్ను నేను సృజించుకుంటాను.
[మార్చు] పరిత్రాణాయ సాధూనాం
సాధువులను రక్షించడానికి,దుష్టులను నాశనం చేయడానికీ,ధర్మాన్ని నెలకొల్పడానికి యుగ యుగంలోను నేను జన్మిస్తాను.
[మార్చు] జన్మ కర్మ చ మే దివ్యమేవం
అర్జునా! దివ్యమైన నా జన్మ కర్మల తత్వాన్ని ఎవరు యధార్ధంగా తెలుసుకుంటారో,అతడు ఈ శరీరాన్ని వదలిన తరవాత తిరిగి పుట్టడు.
[మార్చు] వీతరాగభయక్రోధా
రాగ భయ క్రోధాలను విడిచి నన్ను గురించిన ఆలోచనలతో నిండి నన్ను ఆశ్రయించిన వారు ఎందరో జ్ఞానతపస్సు వలన నన్ను అందుకున్నారు.
[మార్చు] యే యథా మాం ప్రపద్యన్తే
అర్జునా నన్ను ఎవరు ఎలా కొలిస్తే నేను వారిని అలాగే అనుగ్రహిస్తాను.మనుష్యులెప్పుడూ నాజాడలోనే సంచరిస్తారు.
[మార్చు] కాఙ్క్షన్తః కర్మణాం సిద్ధిం
కర్మల ఫలితాన్ని కోరుకునే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు,మానవ లోకంలో కర్మల వలన కలిగే ఫలం త్వరగా లభిస్తుంది కదా!
[మార్చు] చాతుర్వర్ణ్యం మయా సృష్టం
నాలుగు విదాలైన వర్ణాలు గుణ కర్మల విభజనలను అనుసరించి నా వలన సృష్టించ బడ్డాయి.వాటిని సృష్టించిన వాడినైనా,నేను కర్తను కాననీ,మార్పులేని వాడిననీ తెలుసుకో.
[మార్చు] న మాం కర్మాణి లిమ్పన్తి
నన్ను కర్మలంటవనీ నాకు కర్మ ఫలంలో కోరిక లేదనీ ఎరిగినవాడు కర్మలచేత కట్టుబడడు.
[మార్చు] ఏవం జ్ఞాత్వా కృతం కర్మ
ఇది తెలుసుకొనియే పూర్వం ముముక్షువుల చేత కర్మ చేయబడినది.అందువలన పూర్వీకుల చేత పూర్వం చేయబడినట్లే నీవు కూడా నిష్కామ కర్మనే చేయి.
[మార్చు] కిం కర్మ కిమకర్మేతి
కర్మ ఏది అకర్మ ఏది అనే విషయంలో ఋషులు సైతం భ్రాంతిలో పడతారు.దేనిని తెలుసుకుంటే నీవు అశుభం నుండి విముక్తి పొందుతావో ఆ కర్మ విషయం నీకు చెబుతాను.
[మార్చు] కర్మణో హ్యపి బోద్ధవ్యం
కర్మల గురించి తెలుసుకోవాలి.వికర్మల అకర్మల గురించి కూడా తెలుసుకోవాలి.కర్మల యొక్క స్వభావం చాలా నిగూఢమైనది.
[మార్చు] కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి
కర్మలో అకర్మనీ అకర్మలో కర్మనీ ఎవరు దర్శిస్తారో అతడు మనుష్యులలో అందరికంటే బుద్ధిమంతుడు.అతడే యోగి యావత్తు కర్మని పూర్తిగా చేసిన వాడవుతాడు.
[మార్చు] యస్య సర్వే సమారమ్భాః
ఎవరు కామసంకల్పం లేకుండా అన్ని కర్మలను చక్కగా ప్రారంభిస్తారో,జ్ఞానాగ్నిలో కర్మలన్నిటినీ కాల్చివేసిన అతణ్ణి వివేకి అని విద్వాంసులంటారు.
[మార్చు] త్యక్త్వా కర్మఫలాసఙ్గం
కర్మ ఫలంతో సంగాన్ని వదిలి నిత్యతృప్తుడై దేనిమీద ఆధారపడని వాడై,కర్మలలో నిమగ్నుడై ఉండేవాడు ఏకర్మనీ చేయని వాడే అవుతాడు.
[మార్చు] నిరాశీర్యతచిత్తాత్మా
ఆశలేక,మనశరీరాలను నిగ్రహించి,అన్నిటియందు పరిగ్రహ భావాన్ని వదిలి,కేవలం శరీరంతో కర్మ చేసేవాడు ఏ పాపాన్నీ పొందడు.
[మార్చు] యదృచ్ఛాలాభసంతుష్టో
యాదృచ్చికంగా లభించిన దానితో సంతృప్తుడై,ద్వందాలకు అతీతుడై,మాత్సర్యం లేకుండా,ఫలం లభించినపుడు కూడా సమంగా ఉండేవాడు కర్మ చేసినా బద్ధుడు కాడు.
[మార్చు] గతసఙ్గస్య ముక్తస్య
సంగభావం పోయి ముక్తుడై,జ్ఞానంలో నిలిచిన మనస్సుతో యజ్ఞం కోసం ఆచరించే వాని కర్మ పూర్తిగా నశిస్తుంది.
[మార్చు] బ్రహ్మార్పణం బ్రహ్మ
కర్మనే బ్రహ్మమని స్థిరంగా భావించే వారకి బ్రహ్మమే హవిస్సు,బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మం చేత అర్పించ బడుతుంది.అతనిచే అందుకో బడిన గమ్యం కూడా బ్రహ్మమే
[మార్చు] దైవమేవాపరే యజ్ఞం
కొందరు యోగులు దైవ యజ్ఞాన్నే చక్కగా చేస్తారు.కొందరు బ్రహ్మమనే అగ్నిలో యజ్ఞం ద్వారా యజ్ఞాన్ని (తనలోని జీవభావాన్ని)అర్పిస్తారు.
[మార్చు] శ్రోత్రాదీనీన్ద్రియాణ్యన్యే
శ్రవణం మొదలైన ఇంద్రియాలను కొందరూ నిగ్రహమనే అగ్నిలో వేల్చుతారు.మరి కొందరు ఇంద్రియము అనే అగ్నిలో శబ్ధాది విషయాలను వేల్చుతారు.
[మార్చు] సర్వాణీన్ద్రియకర్మాణి
మరికొందరు జ్ఞానేంద్రియ,కర్మేంద్రియ కర్మలన్నింటిని జ్ఞానంతో వెలిగింపబడిన మనస్సంయమనమనే అగ్నిలో వేల్చుతారు.
[మార్చు] ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా
మరికొందరు కఠినమైన నియమాలతో ప్రయత్నం చేస్తూ ద్రవ్య,తపో,యోగ,స్వాధాయ,జ్ఞాన యజ్ఞాలుగా కలిగి ఉన్నారు.
[మార్చు] అపానే జుహ్వతి ప్రాణం
అలాగే ప్రాణాయామ పరాయణులైన మరి కొందరు ఉచ్వాస నిచ్వాసములను నిరోధించి ఆపానానికి ప్రాణాన్ని ప్రాణాన్ని ఆపానానికి ఆహుతులుగా అర్పిస్తారు.
[మార్చు] అపరే నియతాహారాః
మరికొందరు నియమితమైన ఆహారాన్ని స్వీకరిస్తూ,ప్రాణాన్ని ప్రాణానికి ఆహుతులుగా అర్పిస్తారు.వీరందరూ యజ్ఞానాలను ఎరిగినవారే.యజ్ఞం వలన కల్మషాలను హరింప చేసుకుంటారు.
[మార్చు] యజ్ఞశిష్టామృతభుజో
అర్జునా! యజ్ఞములో సమర్పించగా మిగిలిన ఆహారం అమృతము.యజ్ఞము చేయని వారికి ఈ లోకమేలేదు,పరలోకమెక్కడ?
[మార్చు] ఏవం బహువిధా
ఈ విధంగా అనేక విధాల యజ్ఞాలు వేదాలలో విస్తరించబడి ఉన్నాయి.అవి అన్నీ కర్మల వలన జనిస్తాయని తెలుసుకో.ఇలా తెలుసుకుంటే విముక్తుడవు అవుతావు.
[మార్చు] శ్రేయాన్ద్రవ్యమయాద్యజ్ఞాజ్జ్ఞానయజ్ఞః
అర్జునా! పరంతపా! ద్రవ్యంతో చేసేయజ్ఞంకంటే జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైనది.అన్ని రకాల కర్మలూ జ్ఞానంలో లీనమౌతాయి.
[మార్చు] తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన
జ్ఞానాన్ని ఆత్మార్పణభావం,సేవ,ప్రశ్నించడం ద్వారా తెలుసుకో,జ్ఞానులు,తత్వవేత్తలూ ఐనవారు నీకు ఉపదేశిస్తారు.
[మార్చు] యజ్జ్ఞాత్వా న పునర్మోహమేవం
అర్జునా! దేనిని పొందాక తిరిగి ఇలా మోహంలో పడవో దేనిచేత అశేషమైన జీవరాశుల్ని నీలోను,నాలోను చూడగలుగుతావో ఆ జ్ఞానాన్ని పొందు.
[మార్చు] అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః
పాపులందరిలోకి ఎక్కువ పాపం చేసిన వాడివైనా పాపాన్నంతటినీ జ్ఞానమనే పడవతో దాటగలవు.
[మార్చు] యథైధాంసి సమిద్ధోऽగ్నిర్భస్మసాత్కురుతేऽర్జున
అర్జునా జ్వలించే అగ్ని కట్టెలను కాల్చినట్లుగా,జ్ఞానమనే అగ్ని కర్మలను కాచివేస్తుంది.
[మార్చు] న హి జ్ఞానేన సదృశం
జ్ఞానంలాగ పవిత్రమైనది ఇంకొకటి లేదు.యోగ సంసిద్దిని పొందినవాడు దానిని కాలక్రమేణా తనలోనే పొందుతాడు.
[మార్చు] శ్రద్ధావాఁల్లభతే జ్ఞానం
శ్రద్ధతో కూడిన ఇంద్రియ నిగ్రహాన్ని కలిగివుండి,జ్ఞానానుభవాన్ని లక్ష్యంగా పెట్టుకున్న సాధకుడు ఈ అనుభవాన్ని పొందుతాడు.జ్ఞానానుభవాన్ని పొంది త్వరలోనే పరమైన శాంతిని పొందుతాడు.
[మార్చు] అజ్ఞశ్చాశ్రద్దధానశ్చ
జ్ఞానం,శ్రద్ధలేని సంశయాత్ముడు నశించిపోతాడు.సంశయంలో పడ్డవాడికి ఈ లోకంలేదు పరలోకమూ లేదు.సుఖం కూడా లేదు.
[మార్చు] యోగసంన్యస్తకర్మాణం
అర్జునా యోగం వలన కర్మలను వదిలించుకొని,జ్ఞానం వలన సంశయాలను నివృత్తి చేసుకున్న ఆత్మ నిస్టుడిని కర్మలు బంధించలేవు.
[మార్చు] తస్మాదజ్ఞానసమ్భూతం
అందుచేత అజ్ఞానం వలన జనించి నీహృదయంలో ఉన్న సంశయాన్ని ఆత్మజ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి,యోగాన్ని అవలంబించు.అర్జునా! లేచి నిలబడు.
[మార్చు] తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు
| భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |

