కురాన్ భావామృతం/అల్-హష్ర్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

59. హష్ర్‌(దండయాత్ర)
(అవతరణ: మదీనా; సూక్తులు: 24)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
భూమ్యాకాశాల్లో ఉన్న అణువణువూ దేవుని ఔన్నత్యాన్ని చాటుతూ, ఆయన పవిత్రతను ప్రశంసిస్తోంది. ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు. (1)
ఆయనే గ్రంథప్రజలలో (నమ్మకద్రోహానికి పాల్పడి) అవిశ్వాసులైపోయిన వారిని మొదటి దాడిలోనే వారిఇండ్ల నుండి బయటికి గెంటివేశాడు. వారు వెళ్ళిపోతారని మీరు కలలో కూడా ఊహించలేదు. వారూ తమను తమ కోటలు దేవుని నుండి కాపాడుతా యని భావించారు. అయితే వారిఊహ కూడా పోని దిశ నుండి దేవుడు వారిని చుట్టు ముట్టాడు. ఆయన వారి హృదయాలలో భయోత్పాతం సృష్టించాడు. తత్ఫలితంగా వారు తమ ఇండ్లను చేజేతులా నాశనం చేసుకున్నారు. మరోవైపు విశ్వాసుల చేతులతో కూడా నాశనం కొనితెచ్చుకున్నారు. కనుక కళ్ళున్న ప్రజలారా! గుణపాఠం నేర్చుకోండి. (2)
దేవుడు వారి అదృష్టంలో దేశబహిష్కరణ వ్రాసి ఉండకపోతే, ఆయన వారిని ఇహ లోకంలోనే శిక్షించేవాడు; ఇక పరలోకంలో వారికోసం నరకశిక్ష ఉండనేఉంది. వారసలు దేవుని పట్ల, ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించారు. అందుకే వారికీ గతి పట్టింది. దేవుడు తనను విరోధించేవారిని శిక్షించడంలో చాలా కఠినుడు. మీరు కొన్ని ఖర్జూరపు చెట్లు నరికి, మరికొన్నిటిని నరక్కుండా వదిలేశారంటే అది దైవాజ్ఞ వల్లనే జరిగింది. దుర్మార్గుల్ని అవమానం పాల్జేయడానికే (ఆయన ఈఆజ్ఞ జారీచేశాడు). (3-5)
దేవుడు వారి అధీనం నుండి తీసి తన ప్రవక్తకు హస్తగతం చేసిన సిరిసంపదలు, నిజానికి (యుద్ధరంగంలో) మీరు గుర్రాలు, ఒంటెల్ని పరుగెత్తించి సాధించిన సిరిసంప దలు కావు. దేవుడు తన ప్రవక్తలకు తానుకోరిన వారిపై ఆధిక్యతనిస్తాడు. ఆయన ప్రతి పనీ చేయగల సమర్థుడు, సర్వ శక్తిమంతుడు. (6)
దేవుడు ఈ వాడవాసుల నుండి తన ప్రవక్తకు అధీనంచేసిన ధన (కనక) వస్తు సంపదల్లో దేవునికి, దైవప్రవక్తకు, బంధువులకు, అనాథలకు, పేదలకు, బాటసారులకు హక్కుంది. ధనం (ఎల్లప్పుడూ) మీలోని ధనిక వర్గంలోనే కేంద్రీకృతమయి ఉండరాదన్న లక్ష్యంతో ఈ విధానం నిర్ణయించబడింది.
దైవప్రవక్త మీకు దేన్నిస్తాడో దాన్ని తీసుకొని, దేన్నుండి మిమ్మల్ని నిరోధిస్తాడో దాని జోలికి పోకండి. దేవునికి భయపడండి. దేవుని శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. (7)
(మక్కాలోని) తమ ఇండ్ల నుండి, తమ ఆస్తిపాస్తుల నుండి వెడలగొట్టబడిన పేద కాందిశీకులకు కూడా (ఆ సంపదలో) హక్కుంది. వారు దేవుని అనుగ్రహాన్ని, ఆయన ప్రసన్నతను ఆశిస్తూ దేవునికి, ఆయన ప్రవక్తకు అన్నివిధాల మద్దతు నివ్వడానికి నడుం బిగించారు. వారే సత్యసంథులు, సన్మార్గగాములు. (8)
ఈ కాందిశీకులు రాకపూర్వమే విశ్వసించి (మదీనా) పట్టణంలో నివసిస్తూఉన్న వారికికూడా (ఆ సంపదలో) హక్కుంది. (మక్కా నుండి) తమ దగ్గరకు (మదీనా) వలస వచ్చినవారిని వీరు అభిమానిస్తున్నారు. వీరికి ఏదిచ్చినా అది తమకు అవసరమని వీరు తమ హృదయాల్లో సైతం ఆకాంక్షించరు. వారు నిరుపేదలైనా ఇతరుల అవసరాలకే ప్రాధాన్యం ఇస్తారు. పేరాశ, పిసినారితనాల నుండి రక్షించబడినవారే ధన్యులు. (9)
పోతే వీరందరి తర్వాత (ఇస్లాంలోకి) వచ్చినవారిక్కూడా (ఆసంపదలో హక్కుంది). వారిలా ప్రార్థిస్తారు: “ప్రభూ! మమ్మల్ని, మాకు పూర్వం విశ్వసించిన మా సోదరులందర్నీ క్షమించు. (యావత్తు)విశ్వాసుల పట్ల మాహృదయాల్లో ఎలాంటి అసూయాద్వేషాలు ఉంచకు. ప్రభూ! నీవు గొప్ప క్షమాశీలివి, అపార దయామయుడవు.” (10)
కపటవైఖరి అవలంబించిన వారిని నీవు గమనించలేదా? వారు గ్రంథప్రజలకు చెందిన తమ సత్యతిరస్కార సోదరులతో (మంతనాలు జరుపుతూ) “మిమ్మల్ని వెళ్ళగొడ్తే మీతోపాటు మేము కూడా బయలుదేరుతాం. మీ విషయంలో మేము ఎవరి మాటా వినము. ఒకవేళ యుద్ధం జరిగితే మేము తప్పకుండా మీకు సహాయం చేస్తాం” అని అంటారు. కాని వీరసలు పచ్చి అబద్ధాలకోరులు. అందుకు దేవుడే సాక్షి. (11)
ఒకవేళ గ్రంథప్రజలు బహిష్కరించబడితే వీరు మాత్రం వారివెంట బయలుదేరరు. అలాగే వారితో యుద్ధం జరిగితే వారికి ఈ కపటులు ఏమాత్రం సహాయం చేయరు. ఒకవేళ సహాయం చేయడానికి యుద్ధరంగంలో దిగినా, (మరుక్షణమే) వీరు వెన్నుజూపి పారిపోతారు. ఇక వారికి ఎటునుంచి కూడా ఎలాంటి సహాయం లభించదు. (12)
అసలు వారి హృదయాల్లో దైవభయం కన్నా మీభయమే ఎక్కువగా తిష్ఠవేసి ఉంది. దానిక్కారణం వారిలో విజ్ఞతావివేచనలు నశించిపోవడమే. వారు సంఘటితమై మిమ్మల్ని ఎన్నడూ (బహిరంగంగా) ఎదుర్కోలేరు. ఒకవేళ ఎప్పుడైనా ఎదుర్కోడానికి సిద్ధ పడినా వారు కోటద్వారాలు మూసిన జనపదాలలో కూర్చొని లేదా గోడవెనుక దాక్కొని పోరాడుతారు. వారు పరస్పరం తీవ్రంగా కలహించుకుంటారు. వారు సంఘటితంగా ఉన్నట్లు మీకు కన్పించవచ్చు. కాని వారి హృదయాలు పరస్పరం ద్వేషంతో నిండి ఉన్నాయి. ఈ పరిస్థితికి కారణం వారిలో బుద్ధీవివేచనలు లోపించడమే. (13-14)
వీరికి కొన్నాళ్ళక్రితం ఒక వర్గంవారు తమ దుశ్చర్యల పర్యవసానం చవిచూశారు. వీరు కూడా అలాంటి కోవకు చెందినవారే. వీరి కోసం కఠిన యాతన సిద్ధంగా ఉంది. వీరిని షైతాన్‌తో కూడా పోల్చవచ్చు. షైతాన్‌ మానవునితో సత్యాన్ని తిరస్కరించమని అంటాడు. మానవుడు సత్యాన్ని తిరస్కరించిన తర్వాత షైతాన్‌ వచ్చి “ఇక నీతో నాకేం పనిలేదు; నేను సర్వలోక ప్రభువయిన దేవుడంటే భయపడుతున్నాను” అంటాడు. తత్ఫలితంగా చివరికి వారిద్దరూ నరకానికి పోతారు. అక్కడే వారు శాశ్వతంగా ఉంటారు. దుర్మార్గులకు దక్కే ప్రతిఫలం ఇదే. (15-17)
విశ్వాసులారా! దేవునికి భయపడండి. ప్రతి మనిషీ రేపటి కోసం తాను ఏం సంపాదించి సిద్ధపరచుకున్నాడో యోచించాలి. (కనుక) దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. మీరు చేస్తున్న పనులన్నీ దేవునికి తెలుసు. మీరు దేవుడ్ని మరచినవారిలా మారకండి. వారు దేవుడ్ని మరచిపోయినప్పుడు, దేవుడు వారిని తమనుతామే మరచి పోయినట్లు చేశాడు. అలాంటివారే దుర్జనులు. నరకానికి పోయేవారు, స్వర్గానికి పోయే వారు ఎన్నటికీ ఒకటి కాజాలరు. స్వర్గానికి పోయేవారే సార్థక జీవులు. (18-20)
మేమీ ఖుర్‌ఆన్‌ని ఏదైనా కొండపై దించితే, దాని పరిస్థితి ఏమవుతుందో నీవు చూస్తావు. ఆది దైవభీతితో కంపించి క్రుంగిపోతూ పగిలిపోతుంది. మానవులు (తమని గురించి) ఆలోచిస్తారని వారి ముందు మేమీ దృష్టాంతాలు పేర్కొంటున్నాం. (21)
తాను తప్ప మరోఆరాధ్యుడు లేనివాడే అల్లాహ్‌. ఆయన గోచర అగోచర విషయా లన్నీ ఎరిగినవాడు, కరుణామయుడు, కృపాసాగరుడు. తాను తప్ప మరో ఆరాధ్యుడు లేనివాడే అల్లాహ్‌. ఆయన రాజాధిరాజు. పరమపవిత్రుడు, శాంతిమయుడు, శరణు నిచ్చేవాడు, సంరక్షకుడు, పర్యవేక్షకుడు, సర్వాధికుడు, సర్వోన్నతుడు, చండశాసనుడు. ప్రజలు చేస్తున్న బహుదైవారాధనకు అల్లాహ్‌ ఎంతో అతీతుడు, పరిశుద్ధుడు. (22-23)
సృష్టిప్రణాళికను రూపొందించి దాన్ని అమలుపరిచేవాడు ఆ దేవుడే. ఆయనకు అత్యంత శ్రేష్ఠమైన పేర్లున్నాయి. భూమ్యాకాశాల్లోని అణువణువూ ఆయన ఔన్నత్యాన్నే కీర్తిస్తోంది. ఆయన మహా శక్తిసంపన్నుడు, అత్యంత వివేకవంతుడు. (24)