కురాన్ భావామృతం/అల్-మోమినీన్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

23. మోమినూన్‌ (విశ్వాసులు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 118)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
విశ్వాసులు తప్పకుండా కృతార్థులవుతారు. (వారి గుణగణాలు ఇలా ఉంటాయి:)

  • వారు తమ నమాజులో ఎంతో అణుకువ, నమ్రతలు పాటిస్తారు. (1-2)
  • పనికిమాలిన విషయాలకు చాలా దూరంగా ఉంటారు. (3)
  • తమ సంపద నుండి (పేదల ఆర్థిక హక్కు) జకాత్‌ చెల్లిస్తారు. (4)
  • వారు తమ భార్యలు, బానిసస్త్రీల విషయంలో తప్ప (ఇతరస్త్రీల విషయంలో) తమ మర్మావయవాలు కాపాడుకుంటారు. (అంటే వ్యభిచారం తదితర అశ్లీల చేష్టలకు పాల్పడరు.) బానిసస్త్రీల విషయంలో వారిపై ఎలాంటి నింద లేదు. అది తప్ప మరేదయినా కోరేవారే హద్దుమీరిన[2] వారవుతారు. (5-7)
  • వారు తమ అప్పగింతలు, ప్రమాణాలు, ఒప్పందాల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తారు. (8)
  • తమ నమాజులను క్రమం తప్పకుండా, నియమబద్ధంగా పాటిస్తారు. (9)
  • అలాంటివారే మహోన్నత స్వర్గానికి వారసులవుతారు. అక్కడే వారు కలకాలం (హాయిగా) ఉంటారు. (10-11)

మేము మానవుడ్ని నాణ్యమైన మట్టితో సృజించాము. తరువాత అతడ్ని ఒక సురక్షిత ప్రదేశంలో కార్చిన బిందువుగా మార్చాము. తరువాత ఆ బిందువును నెత్తుటి ముద్దగా రూపొందించాము. తిరిగి ఆ నెత్తుటి ముద్దను మెత్తటి పిండంగా చేశాము. ఆ తరువాత దాన్ని ఎముకలుగా మార్చాము. ఆ ఎముకలపై మాంసం కప్పాము. ఆపై (అందులో ప్రాణం పోసి) ఓ నూతన సృష్టినే ఉనికిలోకి తెచ్చాము. కాబట్టి దేవుడు ఎంతో శుభకరుడు. ఆయన నిర్మాతలందరిలో కెల్లా గొప్ప ప్రతిభాశాలి. చివరికి మీరు చనిపోవలసి ఉంటుంది. ఆ తర్వాత ప్రళయదినాన మిమ్మల్ని తప్పకుండా తిరిగి బ్రతికించి లేపడం జరుగుతుంది. (12-16)
మేము మీపై (ఆకాశంలో) ఏడు మార్గాలు నిర్మించాము. సృష్టినిర్మాణం మాకు తెలియని పని కాదు. ఆకాశం నుంచి మేము లెక్క ప్రకారం ఒక నిర్ణీత పరిమాణంలో నీటిని దించి భూమిపై నిలువ చేస్తున్నాము. దాన్ని మేము తలచిన విధంగా అదృశ్యం కూడా చేయగలం. ఆ నీటితో మీకోసం ఖర్జూరం, ద్రాక్ష తోటలను ఉత్పత్తి చేస్తున్నాం. ఆ తోటలలో మీకోసం ఎన్నో మధురమైన పండ్లున్నాయి. వాటిని మీరు తింటున్నారు. సీనాయి కొండపై పెరిగే (ఆలివ్‌) వృక్షాన్ని కూడా మేమే ఉనికిలోకి తెచ్చాము. అందులో చమురూ ఉంది; తినేవారికి రుచికరమైన పదార్థం కూడా ఉంది. (17-20)
పశువుల్లో కూడా మీకోసం మంచి గుణపాఠం ఉంది. మేము, వాటి కడుపులలో నుంచి ఒక పదార్థాన్ని (అంటే పాలను) మీకు త్రాగడానికి ప్రసాదిస్తున్నాం. వాటి వల్ల మీకు ఇతర ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. మీరు వాటి (మాంసం)ని తింటారు. పశువులను, పడవలను వాహనాలుగా కూడా ఉపయోగిస్తారు. (21-22)
మేము నూహ్‌ని అతని జాతిప్రజల దగ్గరకు పంపాము. అతను వారితో “నాజాతి ప్రజలారా! ఏకైక దేవుడ్ని ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీరు (దేవునికి) భయపడరా?” అని అన్నాడు. (23)
అతని జాతిలో సత్యాన్ని విశ్వసించడానికి నిరాకరించిన నాయకులు (ప్రజల్ని పెడదారి పట్టిస్తూ) ఇలా అన్నారు: “ఈ మనిషి మీలాంటి మానవమాత్రుడే. అంతకు మించి మరేమీ కాదు. అతను మీమీద ఆధిక్యత పొందాలని చూస్తున్నాడు. దేవుడు (మన హితబోధ కోసం) ఎవరినైనా పంపదలచుకుంటే దైవదూతలను పంపేవాడు. (మానవులు ప్రవక్తలుగా వచ్చినట్లు) మేము మా తాతముత్తాల కాలం నుంచి ఎన్నడూ వినలేదు. ఇతనికేదో పిచ్చిపట్టింది. కాస్త వేచిచూడండి (పిచ్చి వదలుతుందేమో)”(24-25)
చివరికి నూహ్‌ (విసిగిపోయి) “ప్రభూ! వీరు నన్ను తిరస్కరించారు. ఇక నీవే నాకు సహాయం చేయాలి” అని ప్రార్థించాడు. (26)
అప్పుడు మేమిలా సూచించాము: “మా పర్యవేక్షణలో మా సూచన ప్రకారం ఒక ఓడ నిర్మించుకో. మా ఆజ్ఞతో కుంపటి పొంగిపొర్లగానే ప్రాణులలో ప్రతి జాతికి చెందిన ఒక్కొక్క జంటను తీసుకొని ఓడలోకి ఎక్కు. నీ భార్యాపిల్లల్ని కూడా వెంటబెట్టుకో. అయితే (శిక్షకు గురైపోతారని) ముందే మేము నిర్ణయించిన వారిని ఓడలో ఎక్కించుకో వద్దు. దుర్మార్గుల్ని గురించి నా దగ్గర ఏమీ మాట్లాడకూడదు. వారిప్పుడు మునిగిపో నున్నారు. నీవు నీ సహచరులతో పాటు ఓడలోకి ఎక్కిన తర్వాత ‘మమ్మల్ని దుర్మార్గుల బారినుండి కాపాడిన దేవునికి కృతజ్ఞతలు’ అని చెప్పు. ‘ప్రభూ! నన్ను శుభప్రదేశంలో దించు. నీవెంతో మంచిచోటు ప్రసాదించేవాడవు’ అని కూడా వేడుకో.” (27-29)
ఈ గాధలో గొప్ప సూచనలు (నిదర్శనాలు) ఉన్నాయి. మేము (మానవుల్ని కష్ట సుఖాలు, లాభనష్టాల ద్వారా) పరీక్షకు గురిచేస్తూనే ఉంటాము. (30)
వారి తర్వాత మేము మరోజాతిని రంగంలోకి తెచ్చాం. వారి దగ్గరకు వారినుండే ఒకడ్ని ప్రవక్తగా చేసిపంపాము. అతను “దేవుడ్ని ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీరు (దేవునికి) భయపడరా?” అన్నాడు. (31-32)
అతని జాతిపెద్దలు అవిశ్వాసులై పరలోక సంభవాన్ని తిరస్కరించారు. ప్రపంచ జీవితంలో వారిని మేము (ఏలోటూ లేకుండా) సుఖంగా ఉంచాం. (దానికి) వారు (మా పట్ల కృతజ్ఞులై ఉండటానికి బదులు మా ప్రవక్తను ధిక్కరిస్తూ) ఇలా అన్నారు:
“ఈ వ్యక్తి మీలాంటి మానవుడే తప్ప మరేమీ కాదు. మీరు తినేది, త్రాగేదే ఇతనూ తింటున్నాడు, త్రాగుతున్నాడు. అలాంటి ఒక మానవమాత్రుడికి విధేయులై పోతే మీరు చాలా నష్టపోతారు. మనం చనిపోయి, మట్టిలో కలిసి ఎముకల గూడుగా మారిన తరువాత మళ్ళీ బ్రతికించి లేపబడతామట! అసంభవం. మనకు చేస్తున్న ఈ వాగ్దానం నెరవేరేది కాదు. జీవితం అంటే మరేమీ కాదు. ఈ ప్రపంచ జీవితమే జీవితం. ఇక్కడే మనం చావాలి, ఇక్కడే బ్రతకాలి మనం (మళ్ళీ బ్రతికించి) లేపబడే ప్రసక్తే లేదు. ఇతను దేవుని పేరుతో అభూతకల్పనలు ప్రచారం చేస్తున్నాడు. కనుక మనం ఇతడ్ని ఎన్నటికీ నమ్మకూడదు.” (33-38)
చివరికి ఆ ప్రవక్త (విసిగిపోయి) “ప్రభూ! వీరు నన్ను తిరస్కరించారు. ఇక నీవే నాకు సహాయం చేయాలి” అన్నాడు. దానికి జవాబుగా “వారు తమ అకృత్యాల పట్ల పశ్చాత్తాపం చెందే దినం ఎంతో దూరంలేదు” అని చెప్పబడింది. చివరికి సత్యప్రాది పదికపై ఓ భయంకరమైన విస్ఫోటం వారిపై వచ్చిపడింది. మేము వారిని చెత్తాచెదారం గా మార్చి విసరివేశాం...కనుక దుర్మార్గులారా! దూరంగా ఉండండి!! (39-41)
వారి తర్వాత మేము మరికొన్ని జాతుల్ని ఉద్ధరించాం. (వాటిలో) ఏ జాతీ దాని నిర్ణీత కాలానికి ముందుగా పోవడంగాని, ఆ తర్వాత నిలిచి ఉండటంగాని జరగలేదు. మేము ప్రవక్తలను ఒకరి తర్వాత ఒకరిని వరుసగా పంపుతూ వచ్చాం. ఏదైనా జాతి దగ్గరకు దాని ప్రవక్త వచ్చినప్పుడు ఆ జాతిప్రజలు అతడ్ని తిరస్కరించేవారు. మేము కూడా అలాంటి జాతులను ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అంతమొందిస్తూ చివరికి వాటిని గాధలుగా మార్చివేశాం... విశ్వసించనివారి నాశనం గాను! (42-44)
ఆతర్వాత మేము మూసాకు, అతని సోదరుడు హారూన్‌కు కొన్ని సూచనలు, స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చి ఫిరౌన్‌, అతని అధికారుల దగ్గరకు పంపాము. అయితే ఫిరౌన్‌, అతని అధికారులు గర్వపోతులయిపోయారు. వారసలు మహా తలబిరుసు మనుషులు. “మనలాంటి మానవమాత్రులిద్దరిని మనం నమ్మాలా? అదీగాక వారి జాతి ప్రజలు మనకు కట్టుబానిసలు” అన్నారు వారు. ఇలా వారా ఇద్దర్నీ తిరస్కరించి, నాశనమయ్యే వారిలో చేరిపోయారు. ప్రజలు సన్మార్గం తెలుసుకోవడానికి మేము మూసాకు దివ్యగ్రంథం ప్రసాదించాము. మర్యం కుమారుడ్ని, అతని తల్లిని మేము (దేవుని శక్తి) సూచనగా చేశాం. వారిద్దర్నీ నీటిబుగ్గలతో పాటు సకల సౌకర్యాలున్న ఒక ఎత్తయిన, చదునైన ప్రదేశంలో ఆశ్రయం కల్‌పించాం. (45-50)
“ప్రవక్తలారా! పరిశుద్ధ పదార్థాలు తింటూ సత్కార్యాలు చేస్తూ ఉండండి. మీరు చేసేదంతా నాకు తెలుసు. మీ సమాజమంతా ఒకే (ధర్మానికి చెందిన) సమాజం. నేను మీ ప్రభువును. కనుక మీరు నాకు మాత్రమే భయపడాలి” (అని చెప్పాం). (51-52)
అయితే ఆ తరువాత ప్రజలు తమ ధర్మాన్ని చీల్చుకొని విభిన్న వర్గాలుగా విడి పోయారు. ప్రతివర్గం తన దగ్గరున్నదానిలో తలమునకలైఉంది. సరే వదిలెయ్యి వారిని వారి మానాన. ఓ నిర్ణీత సమయం వరకు ఏమరుపాటులోనే పడివుండనీ. (53-54)
మేము వారికి సంతానం, సిరిసంపదలిచ్చి సహాయం చేస్తుంటే, అదేపనిగా మేము తమకు మేళ్ళు చేకూర్చుతున్నామని భావిస్తున్నారా వారు? కాదు. అసలు విషయం వారు గ్రహించడం లేదు. తమ ప్రభువు పట్ల భయభక్తులు కలవారే మేళ్ళ వైపు (అంటే స్వర్గసౌఖ్యాలకు కారణమయ్యే సత్కార్యాలవైపు) పరుగిడుతూ వాటిని పొందుతారు. వారు తమ ప్రభువు పంపిన సూక్తుల్ని, ఆయన సూచనల్ని విశ్వసిస్తారు. తమ ప్రభువుకు ఎవరినీ సాటి కల్పించరు. వారు ఏది చేసినా తాము (ఓరోజు) తమ ప్రభువు దగ్గరకు పోవలసిఉందన్న భావనతో భయపడుతూ చేస్తారు. (55-61)
మేము ఏ మనిషిపైనా అతని శక్తికి మించిన భారం వేయము. మాదగ్గర ఒక గ్రంథం ఉంది. అందులో (ప్రతి ఒక్కరి స్థితిగతుల్ని గురించి) వాస్తవిక విషయాలన్నీ ఉన్నాయి. కనుక ఎవరికీ ఎలాంటి అన్యాయం జరిగే ప్రసక్తి లేదు. (62)
కాని ఈ విషయం గురించి వారు ఏమరుపాటులో పడిపోయారు. అంచేత వారి ఆచరణ దీనికి భిన్నంగా ఉంది. మేము వారిలో భోగభాగ్యాల్లో మునిగితేలుతున్నవారిని పట్టుకునేదాకా వారు (దారికి రాకుండా) ఆ పనులే చేస్తుంటారు. చివరికి మాకు పట్టు బడిపోగానే వారు ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం మొదలెడ్తారు. (63-64)
ఇక మీ ఏడ్పులు, పెడబొబ్బలు ఆపేయండి. మీరు ఎంత ఏడ్చి మొత్తుకున్నా మా నుండి మీకు ఎలాంటి సహాయం లభించదు. నా సూక్తులు విన్పిస్తుంటే మీరు ముఖం తిప్పుకొని ద్‌ళ్ళిపోయేవారు. అహంకారంతో వాటిని ఖాతరు చేసేవారు కాదు. కట్టుకథలతో, వ్యర్థ ప్రలాపాలతో కాలం వెళ్ళబుచ్చేవారు. (65-67)
వారు ఈ‘వాణి’ని గురించి (ఎప్పుడైనా) ప్రశాంతంగా ఆలోచించారా? లేక వారి పూర్వీకుల దగ్గరకు రానటువంటి కొత్త విషయం ఏదైనా అతను తీసుకొచ్చాడా? లేక వారు తమ ప్రవక్తను గురించే అసలు ఎరగరా అతడ్ని నిరాకరించడానికి? లేక వారతడ్ని పిచ్చివాడని భావిస్తున్నారా? ఇవేమీ కాదు. అతను సత్యాన్ని తీసుకొచ్చాడు. అది వారిలో అనేక మందికి మింగుడు పడటం లేదు. ఒకవేళ సత్యం వారి మనోవాంఛలకు అనుగుణంగా పనిచేస్తుంటే భూమ్యాకా శాలు, వాటిలో ఉన్న సృష్టిరాసుల వ్యవస్థ అంతా ఛిన్నాభిన్నమయి పోయేది... కాదు, మేము వారి వద్దకు వారి ప్రస్తావనే తీసుకొచ్చాం. కాని వారు తమ ప్రస్తావన పట్లే విముఖులైపోతున్నారు. (68-71)
నీవు వారిని ఏదైనా ప్రతిఫలం అడుగుతున్నావా? నీకు నీప్రభువు ప్రసాదించినదే శ్రేష్ఠమైనది. ఆయనే మంచి ఉపాధిప్రదాత. నీవసలు వారిని సన్మార్గం వైపు పిలుస్తు న్నావుగాని, పరలోకాన్ని విశ్వసించనివారు సన్మార్గం తప్పి నడవగోరుతున్నారు. (72-74)
మేము దయదలచి వారిపై వచ్చిపడిన ఆపదను గనక దూరం చేస్తే, వారు (మాపట్ల కృతజ్ఞులయి ఉండటానికి బదులు) తలబిరుసుతో మరింత దారితప్పి నడుస్తారు. మేము వారిని ఆపదకు గురిచేసినా వారు తమ ప్రభువుకు లొంగలేదు; ఆయన్ని దీనంగా వేడుకోలేదు. చివరికి మేము వారికి కఠిన శిక్ష విధించగానే వారి పరిస్థితి ఎలా మారుతుందో చూడు... వారు ఒక్కసారిగా అన్ని వైపుల నుండి నిరాశా నిస్పృహలకు లోనైపోతారు. (75-77)
మీకు వినే, చూసే శక్తులతోపాటు ఆలోచించేందుకు హృదయమిచ్చినవాడు దేవుడే కదా! కాని మీరు ఆయనకు చాలా తక్కువ కృతజ్ఞత చూపుతున్నారు. ఆయనే మిమ్మల్ని ధరణిలో వ్యాపింపజేశాడు. చివరికి ఆయన దగ్గరికే మీరు పోవలసిఉంది. మీకు జీవన్మరణాలు కలిగిస్తున్నవాడు ఆయనే. రేయింబవళ్ళ చక్రభ్రమణానికి కూడా ఆయనే మూలకారకుడు. ఈ విషయాలను మీరు అర్థంచేసుకోరా? (78-80)
వారు తమ పూర్వీకుల్లాగానే ఇలా అంటున్నారు: “మనం చనిపోయి మట్టిలో మట్టయి ఎముకల గూడుగా మారిపోయాక మళ్ళీ బ్రతికించి లేపడమంటూ జరుగు తుందా? ఇలాంటి వాగ్దానాలు మనం చాలా విన్నాంలే. పూర్వం మన తాతముత్తాతలు కూడా విన్నారు. ఇవన్నీ పూర్వీకుల పుక్కిటిపురాణాలు మాత్రమే.” (81-83)
(సరే) “ఈ భూమి, ఇందులో ఉన్నదంతా ఎవరిదో చెప్పండి, మీకు తెలిస్తే?” అని అడుగు. వారు ఇవన్నీ దేవునివే అని తప్పకుండా అంటారు. “అయితే మీరు స్పృహలోకి ఎందుకు రారు?” అని అడుగు. (సరే) “సప్తాకాశాలకు, మహోన్నత సింహాసనానికి యజమాని ఎవర”ని అడుగు. వారు దేవుడే అని తప్పక అంటారు. “అలాంటప్పుడు మీరు (ఆ దేవునికి) ఎందుకు భయపడర”ని అడుగు. (84-87)
(పోని, ఈ సృష్టివ్యవస్థలో) “ప్రతి వస్తువుపై పాలనాధికారం ఎవరికుందో చెప్పండి మీకు తెలిస్తే” అని వారినడుగు. (వారు తప్పక దేవునికే ఉందని చెబుతారు.) అలాగే “(మీకు) ఆశ్రయమిచ్చేవాడు ఒకడున్నాడు; ఆయనకు వ్యతిరేకంగా మరెవరూ (మీకు) ఆశ్రయమివ్వలేరు. అలాంటి శక్తిస్వరూపుడెవరు”అని అడుగు. దేవుడే అని వారు తప్పక అంటారు. “మరయితే మీరు ఎలా మోసపోతున్నార”ని అడుగు. (88-89)
మేము సత్యాన్ని వారి ముందుంచాం. వారేమో అసత్యవాదులు. దేవుడు ఎవరినీ సంతానంగా చేసుకోలేదు. ఆయనతో పాటు మరేదేవుడూ లేడు. ఇతర దేవుళ్ళుంటే ప్రతి దేవుడూ తన సృష్టి తీసుకొని వేరైపోతాడు. తర్వాత వారంతా ఒకరిపై మరొకరు దాడికి దిగుతారు. దేవుడు వారి అభూతకల్పనలు అంటని పరిశుద్ధుడు; గోచర, అగోచరాలు ఎరిగినవాడు. వీరు ఆపాదిస్తున్న బహుదైవారాధనకు ఆయన ఎంతోఅతీతుడు. (90-92)
ప్రవక్తా! ఇలా వేడుకో: “ప్రభూ! ఏ శిక్ష గురించి వారిని భయపెట్టడం జరుగుతు న్నదో ఆ శిక్షను నేను బ్రతికుండగానే నీవు (వారిపైకి) తీసుకురాదలిస్తే, ప్రభూ! నన్నీ దుర్మార్గుల్లో చేర్చకు.” మేము (తలచుకుంటే) వారిని ఏవిషయమై హెచ్చరిస్తున్నామో ఆ విషయాన్ని నీ కళ్ళముందే తీసుకురాగలం. అంతటి శక్తి మాకుంది. (93-95)
ముహమ్మద్‌ (స)! చెడును అత్యంత శ్రేష్ఠమైన పద్ధతి ద్వారా నిర్మూలించు. నీ గురించి వారు కల్పిస్తున్న విషయాలేమిటో మాకు తెలుసు. (కనుక) ఇలా వేడుకో: “ప్రభూ! నేను దుష్టశక్తుల ప్రేరణ నుంచి నీశరణు కోరుతున్నాను. దుష్టశక్తులు నా దరి దాపులకు రావడమనే బెడద నుంచి కూడా నేను నీశరణు కోరుతున్నాను.” (96-98)
(వారు తమ అకృత్యాలు మానుకోరు.) చివరికి వారిలో ఎవరికైనా చావు మూడి నప్పుడు అతను (పశ్చాత్తాపంతో) “ప్రభూ! నేను వదలి వచ్చిన ప్రపంచానికి నన్ను మరో సారి పంపించు. నేనిప్పుడు (నా ప్రవర్తన మార్చుకొని) సత్కార్యాలు చేస్తాను” అంటాడు. అలా ఎన్నటికీ జరగదు. అతను పనికిమాలిన మాటలు వదరుతున్నాడు.
(చనిపోయిన) వారందరి వెనుక ఇప్పుడొక అడ్డుతెర ఉంది. పునరుత్థాన దినం దాకా వారా స్థితిలోనే ఉంటారు. తర్వాత శంఖం పూరించగానే వారి మధ్య ఎలాంటి మైత్రి-బాంధవ్యం ఉండదు. వారు పరస్పరం (మంచిసెబ్బరలు) విచారించుకోరు#
అప్పుడు ఎవరి (కర్మల) త్రాసుపళ్లాలు బరువుగా ఉంటాయో వారు కృతార్థులౌతారు. మరెవరి (కర్మల) త్రాసుపళ్లాలు తేలికగా ఉంటాయో వారు ఆత్మ వినాశకులవుతారు. వారిక నరకంలో శాశ్వతంగా ఉంటారు. నరకాగ్ని వారి ముఖచర్మాన్ని మాడ్చివేస్తుంది. దాంతో వారి పళ్ళు, దవడలు బయటికి వస్తాయి. (99-104)
“నా సూక్తులు విన్పించబడుతున్నప్పుడు వాటిని మీరు నిరాకరిస్తుండేవారు కదూ?” అప్పుడు వారిలా అంటారు: “ప్రభూ! మా దౌర్భాగ్యమే మా కొంప ముంచింది. మేము నిజంగా మార్గభ్రష్టులయి పోయాము. ప్రభూ! మమ్మల్ని ఇక్కడ్నుంచి తీసెయ్యి. ఆ తరువాత మేము మళ్ళీ తప్పుచేస్తే దుర్మార్గులయి పోయినట్లే.” (105-107)
దానికి దేవుడిలా అంటాడు: “దూరంగా ఉండండి. అందులోనే పడి (మాడుతూ) ఉండండి. నాతో అసలు మాట్లాడకండి. నాభక్తులు కొందరు నన్ను వేడుకుంటూ ‘ప్రభూ! మేము విశ్వసించాము. మమ్మల్ని క్షమించు. మామీద దయచూపు. నీవు దయామయు లలో కెల్లా గొప్ప దయామయుడవు’ అని అంటున్నప్పుడు వారిని మీరు హేళనచేసే వారు. చివరికి ఈ వైఖరి నేను దేవుడనే విషయాన్ని కూడా మిమ్మల్ని మరిపింపజేసింది. అదీగాక మీరు (ఎల్లప్పుడూ) వారిని ఆట పట్టిస్తుండేవారు. వారు సహనం వహించి నందుకు ప్రతిఫలంగా నేనీ రోజు వారికి మోక్షం ప్రసాదిస్తున్నాను.” (108-111)
ఆ తరువాత దేవుడు వారిని “మీరు ప్రపంచంలో ఎంతకాలం ఉన్నారో చెప్పండి” అని అడుగుతాడు. దానికి వారు “ఒక రోజో, ఒక పూటో మేమక్కడ ఉండివుంటాం. లెక్కించే వారిని అడగండి” అని అంటారు. అప్పుడు ఆయన ఇలా అంటాడు: “మీరక్కడ కొంతకాలం మాత్రమే ఉన్నారు. ఆనాడే మీరీ సంగతి గ్రహించి ఉంటే ఎంత బాగుండేది! మేము మిమ్మల్ని ఎలాంటి లక్ష్యం లేకుండా వృధాగా పుట్టించామని భావించారా? మీరు మా దగ్గరికి రావలసి ఉండదని అనుకున్నారా?” (112-115)
దేవుడు మహోన్నతుడు, సర్వాధికారి, విశ్వసామ్రాజ్యాధినేత. ఆయన తప్ప మరే ఆరాధ్యుడు లేడు. ఆయన ప్రతిష్ఠాత్మక సింహాసనానికి అధిపతి. ఎలాంటి ప్రమాణం లేకపోయినా దేవునితో పాటు ఇతర (మిధ్యా)దైవాలను వేడుకునేవాడు (మా నుండి తప్పించుకొని ఎక్కడికీ పారిపోలేడు), అతని లెక్కపత్రం అతని ప్రభువు దగ్గర సిద్ధంగా ఉంది. అలాంటి తిరస్కారులు ఎన్నటికీ మోక్షం పొందలేరు. (116-117)
ముహమ్మద్‌ (స)! ఈవిధంగా నన్ను వేడుకో: “ప్రభూ! నన్ను క్షమించు, నామీద దయజూపు. నీవు దయామయులలో కెల్లా గొప్ప దయామయుడవు.” (118)