కురాన్ భావామృతం/అల్-జిన్న్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

72. జిన్‌ (భూతం)
(అవతరణ: మక్కా; సూక్తులు: 28)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ప్రవక్తా! వారికీ సంగతి తెలియజెయ్యి: జిన్నుల సమూహం ఒకటి (ఖుర్‌ఆన్‌ బోధ) విన్నదని, తరువాత (తన జాతివాళ్ళ దగ్గరికెళ్ళి) ఈవిధంగా అన్నదని నాకు దివ్యావిష్కృతి ద్వారా తెలియజేయబడింది: “మేమొక అద్భుతమైన ఖుర్‌ఆన్‌ (వాణి) విన్నాము. అది సన్మార్గం వైపు మార్గ దర్శనం చేస్తుంది. అందువల్ల మేము దాన్ని విశ్వసించాం. ఇక నుంచి మేము మా ప్రభువుకు ఎవరినీ సాటి కల్పించము.” (1-2)
“మా ప్రభువు మహోన్నతుడు, మహిమాన్వితుడు. ఆయన ఎవరినీ భార్యగా, కుమా రునిగా చేసుకోలేదు- మన మూర్ఖజనం దేవుని విషయంలో సత్యవ్యతిరేకమైన మాటలు చెబుతున్నారు. దేవుడ్ని గురించి మానవులు, జిన్నులు ఎన్నడూ అబద్ధాలాడరని మేము భావించాం- కొందరు మానవులు జిన్నులలో కొందరి రక్షణ కోరుతున్నారు. ఇలా వారు జిన్నుల గర్వాన్ని మరింత అధికం చేశారు- మీరు భావించినట్లే మానవులు కూడా దేవుడు ఎవరినీ ప్రవక్తగా నియమించి పంపడని అనుకున్నారు.” (3-7)
“మేము ఆకాశాన్ని వెతికిచూస్తే అది పటిష్ఠంగా కాపలాదారులతో, ఉల్కలతో నిండివున్నట్లు కన్పించింది. ఇదివరకైతే (ఏదైనా) వినడానికి మనకు ఆకాశంలో కూర్చునే చోటు దొరికేది. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దొంగచాటుగా ఎవరైనా వినడా నికి ప్రయత్నిస్తే అతనికి ఒక అగ్నిజ్వాల తన కోసం మాటువేసి ఉండటం కన్పిస్తున్నది. భూవాసులకు ఏదైనా కీడు తలపెట్టే నిర్ణయం జరిగిందో, లేక వారి ప్రభువు వారికి సన్మార్గం చూపగోరుతున్నాడో మాకర్థం కావడం లేదు.” (8-10)
“మనలో కొందరు సజ్జనులు ఉన్నారు; మరికొందరు దుర్జనులు ఉన్నారు. మనం విభిన్న (మత)వర్గాలుగా చీలిపోయి ఉన్నాం. మనం భూలోకంలో దేవుడ్ని ఎదిరించలే మని, పారిపోయికూడా ఆయన పట్టు నుండి బయటపడలేమని మాకిప్పుడు తెలిసి వచ్చింది- మేము మాత్రం హితబోధ విని విశ్వసించాం. (ఇలా) ఎవరైనా తమ ప్రభువును విశ్వసిస్తే అతనికి ఎలాంటి నష్టంగాని, అన్యాయంగాని జరుగుతుందన్న భయమే ఉండదు- మనలో కొందరు దేవునికి విధేయులై (ముస్లింలై)న వారున్నారు. కొందరు సత్యానికి విముఖులైన వారున్నారు. కనుక ఎవరు విధేయతా మార్గం (ఇస్లాం) అవలం బిస్తారో వారు ముక్తిమార్గం పొందినట్లే. అలాగే ఎవరు సత్యానికి విముఖులవుతారో వారు నరకానికి సమిధలయి పోతారు.” (11-15)
(ప్రవక్తా! వీరికి ఇలా చెప్పు:) ప్రజలు సన్మార్గంలో స్థిరంగా ఉంటే మేము వారికి త్రాగేందుకు పుష్కలంగా నీటిని అనుగ్రహిస్తాం, తద్వారా వారిని పరీక్షిస్తాం. తమ ప్రభువు స్మరణకు విముఖులయ్యే వారిని ఆయన కఠినంగా శిక్షిస్తాడు. (16-17)
ఆరాధనాలయాలు అల్లాహ్‌ కోసమే ప్రత్యేకించబడ్డాయి. కనుక అక్కడ అల్లాహ్‌ను కాదని మరెవరినీ ఆరాధించకూడదు. ఓ దైవదాసుడు ఆయన్ని ప్రార్థించడానికి నిలబడి నప్పుడు వీరతనిపై విరుచుకుపడటానికి సిద్ధమయ్యారు. ప్రవక్తా! వారికిలా చెప్పు: “నేను నాప్రభువుని ప్రార్థిస్తున్నాను. ఆయనకు మరెవరినీ సాటికల్పించడం లేదు. (అంతేగాని నేనేమీ తప్పు చేయడంలేదే! మరెందుకు నామీద విరుచుకుపడుతున్నారు?)” (18-20)
ఇలా చెప్పు: “మీకు కీడుగాని, మేలుగాని చేయడానికి నాచేతిలో ఏమీ లేదు”. ఇంకా చెప్పు: “నన్ను దేవుని పట్టునుండి ఎవరూ కాపాడలేరు. ఆయన సన్నిధిలో తప్ప మరెక్కడా నాకు రక్షణలేదు. దేవుని సూక్తుల్ని, ఆయన సందేశాన్ని (ప్రజలకు) చేరవేయ డమే నాపని. అదితప్ప మరోబాధ్యత లేదు నామీద. కనుక దేవుని విషయాలు, ఆయన ప్రవక్త చెప్పే మాటలు విశ్వసించని వారికోసం నరకం కాచుకొని ఉంది. వారందులో (నానా యాతనలు అనుభవిస్తూ) ఎల్లకాలం పడిఉంటారు”. (21-23)
వారీవిధంగా తమకు వాగ్దానం చేస్తున్న దాన్ని చూస్తారు. అప్పుడు తెలుస్తుంది వారికి ఎవరి మద్దతుదారులు బలహీనులో, ఎవరి సంఖ్యాబలం తక్కువో. (24)
ఇలాచెప్పు: “మీకు వాగ్దానం చేయబడుతున్న విషయం సమీపంలోనే ఉందో లేక నాప్రభువు దానికోసం సుదీర్ఘకాలం నిర్ణయించాడో నాకైతే తెలియదు. ఆయన అతీంద్రి యాలు ఎరిగినవాడు. తన అతీంద్రియజ్ఞానాన్ని తానుఎన్నుకున్న ప్రవక్తకు తప్ప మరెవ రికీ ప్రసాదించడు. (వాటి భద్రతకోసం) ఆయన తన ప్రవక్తకు ముందూ, వెనుకా అంగర క్షకుల్ని (దైవదూతల్ని) నియమిస్తాడు. వారు తమప్రభువు సందేశాలు అందజేశారని అతను తెలుసుకోవడానిక్కూడా ఈఏర్పాటు జరిగింది. దేవుడు వారి పరిసరాలన్నిటినీ పరివేష్ఠించి ఉన్నాడు; ఆయన సమస్త విషయాలు లెక్కపెట్టి ఉంచాడు.” (25-28)