కురాన్ భావామృతం/అజ్-జుమర్

వికీసోర్స్ నుండి
కురాన్ భావామృతం అధ్యాయములు

1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 | 32 | 33 | 34 | 35 | 36 | 37 | 38 | 39 | 40 | 41 | 42 | 43 | 44 | 45 | 46 | 47 | 48 | 49 | 50 | 51 | 52 | 53 | 54 | 55 | 56 | 57 | 58 | 59 | 60 | 61 | 62 | 63 | 64 | 65 | 66 | 67 | 68 | 69 | 70 | 71 | 72 | 73 | 74 | 75 | 76 | 77 | 78 | 79 | 80 | 81 | 82 | 83 | 84 | 85 | 86 | 87 | 88 | 89 | 90 | 91 | 92 | 93 | 94 | 95 | 96 | 97 | 98 | 99 | 100 | 101 | 102 | 103 | 104 | 105 | 106 | 107 | 108 | 109 | 110 | 111 | 112 | 113 | 114



కురాన్ భావామృతం
కురాన్ అధ్యాయములు (సూరాలు)
ముందుమాట
1. అల్-ఫాతిహా
2. అల్-బఖరా
3. ఆల్-ఎ-ఇమ్రాన్
4. అన్-నిసా
5. అల్-మాయిదా
6. అల్-అన్ఆమ్
7. అల్-ఆరాఫ్
8. అల్-అన్ఫాల్
9. అత్-తౌబా
10. యూనుస్
11. హూద్
12. యూసుఫ్
13. అర్-రాద్
14. ఇబ్రాహీం
15. అల్-హిజ్ర్
16. అన్-నహల్
17. బనీ ఇస్రాయీల్
18. అల్-కహఫ్
19. అల్-మర్యం
20. తాహా
21. అల్-అంబియా
22. అల్-హజ్
23. అల్-మోమినీన్
24. అన్-నూర్
25. అల్-ఫుర్ ఖాన్
26. అష్-షుఅరా
27. అన్-నమల్
28. అల్-ఖసస్
29. అల్-అన్కబూత్
30. అర్-రూమ్
31. లుఖ్ మాన్
32. అస్-సజ్దా
33. అల్-అహ్ జబ్
34. సబా
35. ఫాతిర్
36. యాసీన్
37. అల్-సాఫ్ఫత్
38. సాద్
39. అజ్-జుమర్
40. అల్-మోమిన్
41. హా మీమ్
42. అష్-షూరా
43. అజ్-జుఖ్రుఫ్
44. అద్-దుఖాన్
45. అల్-జాసియా
46. అల్-అహ్ ఖఫ్
47. ముహమ్మద్
48. అల్-ఫతహ్
49. అల్-హుజూరాత్
50. ఖాఫ్
51. అజ్-జారియా
52. అత్-తూర్
53. అన్-నజ్మ్
54. అల్-ఖమర్
55. అర్-రహ్మాన్
56. అల్-వాఖియా
57. అల్-హదీద్
58. అల్-ముజాదిలా
59. అల్-హష్ర్
60. అల్-ముమ్ తహినా
61. అస్-సఫ్ఫ్
62. అల్-జుమా
63. అల్-మునాఫిఖూన్
64. అత్-తగాబూన్
65. అత్-తలాఖ్
66. అత్-తహ్రీమ్
67. అల్-ముల్క్
68. అల్-ఖలమ్
69. అల్-హాక్ఖా
70. అల్-మారిజ్
71. నూహ్
72. అల్-జిన్న్
73. అల్-ముజమ్మిల్
74. అల్-ముదస్సిర్
75. అల్-ఖియామా
76. అద్-దహ్ర్
77. అల్-ముర్సలాత్
78. అన్-నబా
79. అన్-నాజియాత్
80. అబస
81. అత్-తక్వీర్
82. అల్-ఇన్ ఫితార్
83. అల్-ముతఫ్ఫిఫీన్
84. అల్-ఇన్ షిఖాఖ్
85. అల్-బురూజ్
86. అత్-తారిఖ్
87. అల్-అలా
88. అల్-ఘాషియా
89. అల్-ఫజ్ర్
90. అల్-బలద్
91. అష్-షమ్స్
92. అల్-లైల్
93. అజ్-జుహా
94. అలమ్ నష్‌రహ్
95. అత్-తీన్
96. అల్-అలఖ్
97. అల్-ఖద్ర్
98. అల్-బయ్యినా
99. అజ్-జల్ జలా
100. అల్-ఆదియాత్
101. అల్-ఖారిఅ
102. అత్-తకాసుర్
103. అల్-అస్ర్
104. అల్-హుమజా
105. అల్-ఫీల్
106. ఖురైష్
107. అల్-మాఊన్
108. అల్-కౌసర్
109. అల్-కాఫిరూన్
110. అన్-నస్ర్
111. అల్-లహబ్
112. అల్-ఇఖ్లాస్
113. అల్-ఫలఖ్
114. అల్-నాస్
ముందు పేజీ

39. జుమర్‌ (బృందాలు)
(అవతరణ: మక్కా; సూక్తులు: 75)
కరుణామయుడు, కృపాసాగరుడయిన దేవుని పేరుతో ప్రారంభం
ఇది సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడైన దేవుని దగ్గర్నుండి అవతరించిన (దివ్య)గ్రంథం. ముహమ్మద్‌ (స)! మేమీ గ్రంథాన్ని సత్యం ప్రాతిపదికపై నీ దగ్గరికి పంపాము. కనుక నీవు ఒక్క దేవుడ్ని మాత్రమే ఆరాదిస్తూ ఉండు. నీ జీవిత విధానాన్ని ఆయన కోసమే ప్రత్యేకించు. గుర్తుంచుకో, సంపూర్ణ ధర్మానుసరణ దేవుని హక్కు.
ఆయన్ను వదలి ఇతరులను సంరక్షకులుగా, సహాయకులుగా చేసుకున్నవారు “ఈ దైవాలు (విగ్రహాలు, దైవదూతలు వగైరా సృష్టితాలు) మమ్మల్ని దేవుని సన్నిధికి చేర్చుతాయని మాత్రమే మేము వీటిని ఆరాధిస్తున్నాం” అంటారు. (ఇలా) వారు విభే దిస్తున్న వ్యవహారాల్ని గురించి (తీర్పుదినాన) దేవుడు తప్పక వారి మధ్య తీర్పుచేస్తాడు. అబద్ధాలకోరు, సత్యతిరస్కారి అయిన ఏ మనిషికీ దేవుడు సన్మార్గం చూపడు. (1-3)
దేవుడు తనకోసం ఎవరినైనా కుమారునిగా చేసుకోదలిస్తే ఆయన తన సృష్టితా లలో తాను కోరినవారిని ఎంచుకుంటాడు. కాని ఆయన ఎంతోపవిత్రుడు, పరిశుద్ధుడు. (అలాంటి మానవబలహీనతలకు అతీతుడు.) ఆయన (యావత్తు సృష్టిరాసులకు స్వామి, సార్వభౌముడయిన) దేవుడు. ఆయన ఒక్కడే. ఆయనే సర్వాధికుడు. (4)
ఆయన భూమ్యాకాశాలను సత్యం ప్రాతిపదికపై సృష్టించాడు. ఆయనే రాత్రిని పగటి మీద, పగటిని రాత్రిమీద చుట్టివేస్తున్నాడు. (అంటే రాత్రి, పగలు ఒకదాని తర్వాత ఒకటి నియమబద్ధంగా వస్తూపోతున్నాయి.) సూర్యచంద్రులు ఒక నిర్ణీతకాలం వరకు నియమబద్ధంగా సంచరించేలా ఆయనే వాటిని అదుపులో ఉంచాడు. గుర్తుంచుకోండి, ఆయన అద్భుత శక్తిసంపన్నుడు, అపార క్షమాశీలి. (5)
ఆయనే మిమ్మల్ని ఏకైక జీవి నుండి పుట్టించాడు. ఆయనే ఆ జీవి నుండి దాని జతను సృష్టించాడు. ఆయనే మీకోసం పశువుల్లో ఎనిమిది (రకాల) పెంటి, పోతులు సృష్టించాడు. మిమ్మల్ని ఆయన మీతల్లుల గర్భాలలో మూడేసి చీకటి పొరలలో ఉంచి, ఒకదాని తరువాత ఒకటిగా రూపకల్పన చేస్తున్నాడు. ఆయనే అల్లాహ్‌. ఆయనే మీ ప్రభువు, పోషకుడు, పాలకుడు, విశ్వసామ్రాజ్యాధినేత. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. మరి మీరు ఎవరి వలలో పడి మోసపోతున్నారు? (6)
(వినండి,) మీరు అవిశ్వాసులైపోతే దేవునికొచ్చే నష్టమేమీ లేదు. ఆయన నిరపేక్షా పరుడు. అయితే ఆయనకు తన దాసులు అవిశ్వాసులైపోవడం ఇష్టం లేదు. మీరు కృతజ్ఞత చూపితే ఆయన దాన్ని మీకోసం ఇష్టపడతాడు. సొంత బరువు మోసేవాడు ఇతరుల బరువు మోయలేడు. చివరికి మీరంతా మీ ప్రభువు సన్నిధికే పోవలసి ఉంది. అప్పుడాయన మీరు (ఐహిక జీవితంలో) ఏం చేస్తుండేవారో మీకు తెలియజేస్తాడు. ఆయనకు (మీ) హృదయాల్లో మెదిలే విషయాలు సైతం తెలుసు. (7)
మానవుడు ఆపద వచ్చినప్పుడు తన ప్రభువుని మొరపెట్టుకుంటాడు. కాని అతని ప్రభువు అతనికి తన అనుగ్రహభాగ్యం ప్రసాదించగానే, అతను లోగడ మొరపెట్టు కున్న ఆపద మరచిపోయి ఇతరుల్ని దేవునికి సాటికల్పిస్తాడు. ఇలా అతను ఇతరుల్ని కూడా దైవమార్గం నుండి తప్పిస్తున్నాడు.“ కొన్నాళ్లు తన అవిశ్వాసవైఖరి ద్వారా ప్రయోజ నం పొందమ”ని చెప్పతనికి. చివరికి అతను తప్పక నరకానికి పోవలసిందే. (8)
దీనికి భిన్నంగా మరొక వ్యక్తి ఉన్నాడు. అతను (దేవునికి, దైవప్రవక్తకు) విధేయుడై రాత్రివేళ (ప్రార్థనచేస్తూ) నిలబడతాడు; సాష్టాంగపడతాడు. పరలోకంలో ఎదురయ్యే పరిణామాలను గురించి భయపడుతుంటాడు. తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తుంటాడు. “ఇలాంటి వ్యక్తి శ్రేష్ఠుడా లేక అతనా? (సత్యం గురించి) తెలిసినవాళ్ళు, తెలియనివాళ్ళు ఒకటేనా?” అని అడుగు వారిని. (మా)హితబోధను బుద్ధిమంతులే స్వీకరిస్తారు. (9)
(ప్రవక్తా! నామాటలు వారితో ఇలా)అను: “విశ్వసించిన నాదాసులారా! మీ ప్రభువుకు భయపడండి. (సత్యస్వీకారంతో పాటు) ఇహలోకంలో సదాచరణ వైఖరి అవలంబించినవారికే మేలు జరుగుతుంది. దేవుని భూమి విశాలంగా ఉంది. (ఒకచోట మీరు ప్రశాంతంగా ధార్మిక జీవితం గడపలేని పరిస్థితులు ఏర్పడితే మరోచోటికి వలస పోవచ్చు.) సహనం వహించేవారికి అపార పుణ్యఫలం లభిస్తుంది.” (10)
ఈ సంగతి చెప్పు: “ధర్మాన్ని దేవునికి మాత్రమే ప్రత్యేకించి ఆయన్ని ఆరాధించా లని నాకాజ్ఞ ఇవ్వబడింది. అదీగాక అందరికంటే ముందు నేను విధేయుణ్ణి (ముస్లిం) అయి ఉండాలని కూడా నాకాజ్ఞయింది.” “ఒకవేళ నేను నా ప్రభువుకు అవిధేయుణ్ణయి పోతే, మహానాడు ఎదురయ్యే శిక్ష గురించి భయపడుతున్నాన”ని చెప్పు. (11-13)
ఇలా చెప్పు: “నేను మటుకు నా ధర్మాన్ని (జీవిత విధానాన్ని) దేవునికి ప్రత్యేకించి ఆయన్ని మాత్రమే ఆరాధిస్తాను. ఆయన్ని వదలి మీరు కోరుకున్నవారిని పూజించుకోండి (నాకొచ్చే నష్టమేమీ లేదు). ప్రళయదినాన తనకు, తన భార్యాపిల్లలకు నష్టం కలిగించు కునేవాడే అసలు దివాళాకోరు. బాగా తెలుసుకోండి, అదే స్పష్టమైన దివాళా.” (14-15)
వారిని (నరకంలో) పైనుండీ, క్రిందినుండీ అగ్ని గొడుగులు (జ్వాలలు) ఆవరించి ఉంటాయి. ఇలాంటి దుష్పర్యవసానం నుండి (కాపాడుకోమని) దేవుడు తన దాసుల్ని హెచ్చరిస్తున్నాడు. కనుక నా దాసులారా! నాఆగ్రహం నుండి తప్పించుకోండి. (16)
మిధ్యాదైవాల్ని ఆరాధించడం మానేసి (నిజ)దేవుని వైపు మరలేవారికి శుభవార్త ఉంది. కనుక (ప్రవక్తా!) విషయాన్ని ప్రశాంతంగా ఆలకించి, అందులోని మంచిని అను సరించేవారికి శుభవార్త విన్పించు. దేవుడు సన్మార్గం చూపినవారు వీరే. వీరే విజ్ఞులు#
ఎవరి విషయంలో (దైవ)శిక్ష గురించి నిర్ణయం జరిగిందో అతడ్నిక ఎవరు కాపాడ గల్గుతారు? అగ్నిలో పడినవాడ్ని నీవు కాపాడగలవా? విశ్వప్రభువుకు భయపడి తదను గుణంగా జీవితం మలచుకునేవారి కోసం (స్వర్గంలో) అంతస్తులవారిగా నిర్మించబడిన ఆకాశహర్మ్యాలు ఉన్నాయి. వాటి క్రింద (చల్లటి) సెలయేరులు ప్రవహిస్తూ ఉంటాయి. ఇది దేవుని వాగ్దానం. దేవుడు తన వాగ్దానాన్ని ఎన్నటికీ భంగపరచడు. (17-20)
దేవుడు ఆకాశం నుండి వర్షం ఎలా కురిపిస్తున్నాడో మీరు గమనించలేదా? ఆయన ఆ వర్షపు నీటిని వాగులు, వంకలు, నదుల రూపంలో నేలలోకి ప్రవహింప జేస్తున్నాడు. ఆ నీటి ద్వారా రకరకాల పంటలు పండిస్తున్నాడు. వాటిలో విభిన్న రకాలు ఉంటాయి. ఆ తర్వాత ఆ పంటపొలాలు పండి ఎండిపోతాయి. అప్పుడవి పసుపుపచ్చ గా మారడం కూడా మీకు కన్పిస్తుంది. చివరికి దేవుడు వాటిని పొట్టు పొట్టుగా చేస్తాడు. ఇందులో బుద్ధిమంతులకు ఎంతో గుణపాఠం ఉంది. (21)
దేవుడు ఒక మనిషి హృదయకవాటాన్ని ఇస్లాం కోసం తెరుస్తాడు. దాంతో అతను తన ప్రభువు నుండి లభించిన కాంతిమార్గంలో నడుస్తాడు. అలాంటి వ్యక్తీ, (మా సూచనల్లో గుణపాఠం నేర్చుకోనివాడు సమానులవుతారా)? దేవుని హితబోధతో మరింత కఠిన హృదయులై పోయినవారికి కీడు మూడింది. వారు పూర్తిగా భ్రష్టులైపోయారు. (22)
దేవుడు శ్రేష్ఠమైన వాణి అవతరింపజేశాడు. ఇదొక గ్రంథం. దాని భాగాలన్నీ ఒకదాని కొకటి అవినాభావసంబంధం కలిగిఉన్నాయి. కొన్ని విషయాలు అనేకసార్లు పునరావృతమయ్యాయి. విశ్వప్రభువుకు భయపడేవారు ఈ వాణి వినగానే వారి రోమాలు నిక్కబొడుచుకుంటాయి; వారి శరీరాలు జలదరిస్తాయి; వారి హృదయాలు మెత్తబడి దేవుని ప్రస్తావన వైపు మొగ్గుతాయి. ఇది దేవుని హితవాణి. దీనిద్వారా దేవుడు తాను తలచిన వారిని దారికి తెస్తాడు. ఆయన దారి తప్పించదలచిన వారికి మరెవరూ దారి చూపలేరు. ప్రళయదినాన ముఖంపై ఘోరమైన యాతనకు గురయ్యేవాడు ఎంత తల్లడిల్లి పోతాడో మీరు ఊహించగలరా? అలాంటి దుర్మార్గులతో (దైవదూతలు) “మీరు చేజేతులా చేసుకున్న కర్మల పర్యవసానం ఇక చవిచూసుకోండి” అంటారు. (23-24)
వీరికి పూర్వం కూడా అనేకమంది ఇలాగే (దైవప్రవక్తలను) తిరస్కరించారు. చివరికి వారిపై వారు ఊహించని వైపునుండి (దైవ)శిక్ష విరుచుకుపడింది. దేవుడు వారికి ఐహిక జీవితంలోనే అవమానం చవిచూపించాడు. పరలోక శిక్ష ఇంతకంటే తీవ్రంగా, ఘోరంగా ఉంటుంది. వీరీ విషయం గ్రహిస్తే ఎంత బాగుండు! (25-26)
ప్రజలు స్పృహలోకి వచ్చేందుకు ఖుర్‌ఆన్‌లో అనేక తార్కాణాలు పేర్కొన్నాం. వారు దుష్పర్యవసానం నుండి తప్పించుకోవడానికే మేము దీన్ని (వారికి తెలిసిన) అరబీ భాషలో అవతరింపజేశాం. ఇందులో ఎలాంటి వంకలు, వ్యత్యాసాలు లేవు. (27-28)
దేవుడు ఒక ఉదాహరణ ఇస్తున్నాడు, (వినండి): ఒక మనిషి ఉన్నాడు. అతనికి వక్ర మనస్కులైన అనేకమంది యజమానులు ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కడూ అతడ్ని తన వైపు లాగుతుంటాడు. దీనికి భిన్నంగా మరొక వ్యక్తి ఉన్నాడు. అతను పూర్తిగా ఒకే యజమానికి బానిసగా ఉన్నాడు. మరి వీరిద్దరి పరిస్థితి ఒకటేనా? (కాదు.) సకలస్తోత్రా లకు దేవుడే అర్హుడు. కాని చాలామంది అజ్ఞానాంధకారంలో పడిఉన్నారు. (29)
(ప్రవక్తా!) నీవూ చావవలసి ఉంది; వారూ చావవలసి ఉంది. చివరికి మీరంతా ప్రళయదినాన మీ ప్రభువు సన్నిధిలో మీమీ వ్యవహారాలు ప్రవేశపెడతారు. (అప్పుడు ఎవరు అబద్ధాలకోరులో తేలుతుంది.) దేవునిపై అసత్యాలు మోపి, సత్యం ముందుకు వచ్చినప్పుడు దాన్ని తిరస్కరించినవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవరుంటాడు? ఇలాంటి అవిశ్వాసులకు నరకంలో చోటు లేదా? (30-32)
సత్యాన్ని తీసుకొచ్చినవాడు (దైవప్రవక్త), అతడ్ని నమ్మినవారే (దైవ)శిక్షకు దూరంగా ఉండేవారు. వారికి వారి ప్రభువు నుండి తాము కోరుకున్న ప్రతి వస్తువూ లభిస్తుంది. ఇదీ సహృదయులకు లభించే సుకృతఫలం. దేవుడు వారి (గత జీవితంలోని) పాపాలను వారి లెక్క నుండి మినహాయించి, ప్రస్తుతం వారు ఆచరిస్తున్న సత్కార్యాలకు తగిన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. అందుకే ఈ ఏర్పాటు జరుగుతుంది. (33-35)
ప్రవక్తా! దైవదాసులకు (వారి పనులు నెరవేర్చడానికి) ఒక్క దేవుడు చాలడా? వీరు దేవుడ్ని వదలి దైవేతరశక్తులు ఏదో చేస్తాయని నిన్ను భయపెడ్తున్నారు. కాని దేవుడు దారి తప్పించదలచిన వాడికి మరెవరూ దారి చూపలేరు. అలాగే ఆయన దారి చూప దలచిన మనిషిని మరెవరూ దారి తప్పించలేరు. దేవుడు సర్వ శక్తిమంతుడు కాదా? ఆయన (తలచుకుంటే వారికి) ప్రతీకారం చేయలేడా? (36-37)
నీవు ఈ భూమ్యాకాశాల్ని ఎవరు సృష్టించారని అడిగితే వారు దేవుడేనని తప్పక అంటారు. వారికిలా చెప్పు: “సరే, దేవుడు నాకేదైనా కష్టం కలిగించదలిస్తే మీరు దేవుడ్ని కాదని ప్రార్థిస్తున్న మిధ్యాదైవాలు నన్నీ ఆపదనుండి కాపాడగలవా? పోనీ దేవుడు నన్ను కరుణించదలిస్తే ఈశక్తులు ఆయన కారుణ్యాన్ని అడ్డుకోగలవా? నాకు దేవుడే చాలు. నమ్ముకునే వారు దేవుడ్నే నమ్ముకుంటారు. ఆయన మీదే ఆధారపడతారు.” (38)
వారికిలా చెప్పు: “నా జాతిప్రజలారా! మీరు చేయాల్సిన పని మీరు చేయండి. నేను చేయాల్సిన పని నేను చేస్తాను. మన ఉభయుల్లో ఎవరి మీద అవమానకరమైన ఆపద వచ్చిపడుతుందో, ఆ తర్వాత శాశ్వతంగా ఉండే (నరక) యాతనలు ఎవరిని చుట్టుముడ్తాయో మీకు త్వరలోనే తెలుస్తుంది.” (39-40)
ప్రవక్తా! మేము యావత్మానవాళికోసం ఈ సత్యపూరిత గ్రంథం నీపై అవతరింప జేశాం. కనుక ఎవరు సన్మార్గం అవలంబిస్తారో అది వారికే ప్రయోజనకారి అవుతుంది. మరెవరు పెడదారి పట్టిపోతారో దానివల్ల వారే నష్టపోతారు. వారి బాధ్యత నీపై లేదు#
మరణ సమయంలో (మానవుల) ఆత్మలు స్వాధీనం చేసుకునేవాడు దేవుడే. ఆయన మరణించనివారి ఆత్మలను నిద్రావస్థలో స్వాధీనం చేసుకుంటాడు. ఆ తరువాత ఆయన ఎవరి విషయంలో మృత్యునిర్ణయం తీసుకుంటాడో వారి ఆత్మలను తీసుకొని, మిగిలినవారి ఆత్మల్ని ఒక నిర్ణీతకాలం కోసం వెనక్కి పంపుతాడు. ప్రశాంత హృదయం తో యోచించేవారి కోసం ఇందులో గొప్ప సూచనలున్నాయి. (41-42)
అలాంటి దేవుడ్ని వదలి వీరు ఇతరుల్ని సిఫారసు కర్తలుగా చేసుకున్నారా! వారిని అడుగు: ‘ఎలాంటి అధికారం లేకపోయినా వారు సిఫారసు చేయగలరా?’ చెప్పు: ‘సకల వ్యవహారాల్లో సిఫారసుచేసే అధికారం దేవునికే ఉంది. భూమ్యాకాశాల రాజ్యాధికారం ఆయన చేతిలోనే ఉంది. ఆయన వద్దకే మీరు తిరిగిపోవలసి ఉంది.” (43-44)
ఏక దేవుడ్ని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పరలోకంపై నమ్మకంలేనివారి ముఖాలు వాడి ముడుచుకుపోతాయి. ఆయన్ని వదలి ఇతరుల్ని గురించి ప్రస్తావిస్తే చాలు, వారి ముఖాలు ఒక్కసారిగా దివిటీల్లా వెలిగిపోతాయి. (45)
కనుక నీవిలా వేడుకో: “దేవా! భూమ్యాకాశాల సృష్టికర్తా! అంతర్‌ బాహ్యాలను, గోచర అగోచర విషయాలను ఎరిగినవాడా! నీవే ప్రజల మధ్య వారు విభేదిస్తున్న విషయాలను గురించి తీర్పు చేసేవాడివి.” (46)
ఒకవేళ దుర్మార్గుల దగ్గర లోకంలోని యావత్తు సిరిసంపదలకు రెట్టింపు సిరి సంపదలుంటే, ప్రళయదినాన పడే పరమనీచమైన శిక్ష నుండి బయటపడేందుకు ఆ సంపదనంతటినీ (పాప)పరిహారం క్రింద ఇవ్వడానికి సిద్ధపడతారు. (అయినా శిక్ష తప్పదు.) అక్కడ దేవుని వైపు నుండి వారిపైకి వారెన్నడూ ఊహించని దారుణం వచ్చి పడుతుంది. వారి కర్మల దుష్ఫలితాలన్నీ వారిముందు ప్రత్యక్షమవుతాయి. (ఈరోజు) వారు అపహాస్యం చేస్తున్నదే (రేపు) వారిపై విరుచుకుపడుతుంది. (47-48)
మానవుడు ఆపద వచ్చినప్పుడు మమ్మల్ని మొరపెట్టుకుంటాడు. అప్పుడు మేమే దైనా భాగ్యం ప్రసాదిస్తే “ఇది నాకున్న జ్ఞానం (యోగ్యతల) వల్ల లభించింద”ని అంటా డతను. కాదు, ఇదొక పరీక్ష. కాని చాలామందికి ఈ వాస్తవం తెలియదు. (49)
ఇలాంటి మాటలే పూర్వం కూడా చాలామంది (మూఢులు) అన్నారు. కాని వారు సంపాదించినది వారికి ఏమాత్రం పనికిరాలేదు. చివరికి వారు తమ కర్మల దుష్ఫలితం అనుభవించారు. అలాగే (ఈనాడు) వీరిలోని దుర్మార్గులు కూడా త్వరలోనే తమ కర్మల దుష్ఫలితం అనుభవిస్తారు. వీరు మానుండి ఏవిధంగానూ తప్పించుకోలేరు. (50-51)
దేవుడు తాను తలచినట్లు కొందరికి పుష్కలంగా, కొందరికి స్వల్పంగా ఉపాధి నిస్తున్నాడని వారికి తెలియదా? విశ్వసించేవారికి ఇందులో అనేక సూచనలున్నాయి#
ప్రవక్తా! (వారికి నా మాటలుగా) ఇలా చెప్పు: “ఆత్మవంచనకు పాల్పడిన నా దాసులారా! దేవుని కారుణ్యం పట్ల నిరాశచెందకండి. దేవుడు తప్పకుండా మీ పాపా లన్నిటినీ క్షమిస్తాడు. ఆయన గొప్ప క్షమాశీలి, అమిత దయామయుడు. (52-53)
కనుక మీపై శిక్ష వచ్చి, మీకు ఎలాంటి సహాయం లభించని పరిస్థితి రాకముందే పశ్చాత్తాపంతో మీ ప్రభువు వైపు మరలండి; ఆయనకు పూర్తిగా విధేయులయిపోండి. అలాగే మీరు ఏమరుపాటులో ఉన్నప్పుడు హఠాత్తుగా మీపై (దైవ)శిక్ష విరుచుకుపడక ముందే మీ ప్రభువు పంపిన శ్రేష్ఠమైన గ్రంథాన్ని అనుసరించండి. (54-55)
(మీరలా చేయకపోతే) ఆ తరువాత మీరు “దేవుని విషయంలో నేనెంత పొరపాటు చేశాను, పైగా నేను అపహాస్యం చేసినవారిలో చేరిపోయానే!” అని విచారించవలసి వస్తుంది. లేదా “అయ్యయ్యో! దేవుడు నాకు సన్మార్గం చూపివుంటే నేను కూడా భయ భక్తులుకలవారిలో చేరేవాణ్ణే!!” అని పశ్చాత్తాపపడవలసి వస్తుంది. లేదా దైవశిక్షను చూసి “మరోఅవకాశం లభిస్తే నేను కూడా సదాచార సంపన్నులలో చేరుతానే!” అని బాధపడ వలసివస్తుంది. (అప్పుడతనికి) “అవకాశం ఎందుకు లభించలేదు, నీదగ్గరికి నాసూక్తులు వచ్చాయి. నీవు వాటిని నిరాకరించావు. గర్విష్ఠి అయి అవిశ్వాసుల్లో చేరిపోయావు” (అని సమాధానం లభిస్తుంది). అలాంటి పరిస్థితులు రాకూడదు సుమా! (56-59)
ఈరోజు దేవుని విషయంలో అబద్ధాలాడేవారి దుస్థితిని రేపు ప్రళయదినాన నీవూ చూస్తావు. ఆరోజు వారి ముఖాలు నల్లబడిపోతాయి. అహంకారులకు నరకంలో చోటు లేదా? భయభక్తుల వైఖరి అవలంబించినవారికి మాత్రం దేవుడు వారి విజయరహస్యాల కారణంగా మోక్షం ప్రసాదిస్తాడు. వారికి ఎలాంటి దుఃఖం, కష్టాలు ఉండవు. (60-61)
(విశ్వంలోని) ప్రతి అణువుకూ దేవుడే సృష్టికర్త. ఆయనే సమస్త సృష్టిని పర్యవేక్షిస్తు న్నాడు. భూమ్యాకాశాల నిక్షేపాలకు చెందిన తాళపుచెవులు ఆయన చేతిలోనే ఉన్నాయి. దేవుని సూక్తులు తిరస్కరించేవారే చివరికి నష్టపోయేవారు. (62-63)
ప్రవక్తా! వారినిలా అడుగు: “అజ్ఞానులారా! అలాంటప్పుడు మీరు దేవుడ్ని వదలి ఇతరుల్ని ఆరాధించమని నాకు చెబుతున్నారా?”- “మీరు దేవునికి ఇతరుల్ని సాటికల్పిస్తే మీరు చేసే (మంచి)పనులు (కూడా) వ్యర్థమవుతాయి, మీరు ఘోరంగా నష్టపోతారు” అని నీదగ్గరకు, నీకు పూర్వం వచ్చిన ప్రవక్తలందరి దగ్గరకు దివ్యావిష్కృతి (వహీ) పంపబడింది” (అని వారికి చెప్పు.) (ప్రవక్తా!) నీవు మాత్రం ఏకైక దేవుడ్నే ఆరాదిస్తూ కృతజ్ఞులయిన దాసులలో చేరిపో. (64-66)
వారసలు దేవునికి విలువ ఇవ్వవలసిన విధంగా విలువ ఇవ్వనేలేదు. పునరుత్థాన దినాన యావత్‌ భూగోళం ఆయన పిడికిలిలో ఉంటుంది. యావత్తు నభోమండలం ఆయన కుడిచేతిలో (చాపలా) చుట్టబడి ఉంటుంది. వీరు చేస్తున్న బహుదైవారాధనకు ఆయన ఎంతో అతీతుడు, పరమ పవిత్రుడు. (67)
ఆరోజు భీకర శంఖారావంతో భూమ్యాకాశాల్లోని జీవరాసులన్నీ చచ్చి పడిపోతాయి. కాకపోతే దేవుడు సజీవంగా ఉంచదలచిన ప్రాణులు మాత్రం కొన్ని సజీవంగా ఉంటాయి. ఆ తరువాత మరోసారి శంఖారావం గావించబడుతుంది. దాంతో సమస్త జీవకోటి ఒక్కసారిగా లేచి చూడనారంభిస్తుంది. ఇంకా (ఆరోజు) ధరణి తన ప్రభువు తేజస్సుతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కర్మల గ్రంథం తీసుకురాబడుతుంది. దైవప్రవక్తలు, సాక్షులు ప్రవేశపెట్టబడతారు. (అప్పుడు) మానవులకు న్యాయంగా సరైన తీర్పు జరుగుతుంది. వారికి అణుమాత్రం కూడా అన్యాయం జరగదు. ప్రతి మనిషికీ అతను చేసుకున్న కర్మలను బట్టి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. మానవులు చేస్తున్న పనులన్నీ దేవునికి బాగా తెలుసు. (68-70)
అవిశ్వాసుల్ని గుంపులు గుంపులుగా నరకం వైపు తోలుకెళ్తారు. అలా వారు నరకం దగ్గరికి చేరుకున్న తర్వాత నరకద్వారాలు తెరవబడతాయి. అప్పుడు ద్వారపాలకులు “మీ దగ్గరికి మీ ప్రజల నుండి దైవప్రవక్తలు రాలేదా? వారు మీకు మీప్రభువు సూక్తులు విన్పించలేదా? ఈనాడు (ఎదురయ్యే పరిణామాల్ని) గురించి (ఆనాడే) వారు మిమ్మల్ని హెచ్చరించలేదా?” అని అడుగుతారు వారిని.
దానికి వారు “వచ్చారు. (హెచ్చరించారు కూడా.) కాని సత్యతిరస్కారులకు నరక శిక్ష (ఎప్పుడో) నిర్ణయమైపోయింది” అని సమాధానమిస్తారు. “అయితే నరకంలోకి పోయిపడండి. ఇక మీరిక్కడే ఎల్లకాలం ఉంటారు. గర్విష్ఠు లకు కేటాయించిన ఈ నరకం పరమ చెడ్డస్థలం” అనంటారు ద్వారపాలకులు. (71-72)
ఇక విశ్వప్రభువుకు భయపడుతూ తదనుగుణంగా జీవితం గడిపినవారిని తండోప తండలుగా స్వర్గం వైపు తీసుకుపోవడం జరుగుతుంది. అలా వారు స్వర్గం దగ్గరకు చేరుకుంటారు. అక్కడ స్వర్గద్వారాలు ముందే తెరవబడి ఉంటాయి.
స్వర్గపాలకులు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ “మీకు శాంతీసౌభాగ్యాలు కలుగు గాక! మీరెంతో మంచివారు. ఇక ఇందులో ప్రవేశించి కలకాలం (హాయిగా) ఉండండి” అని అంటారు. దానికి వారు సమాధానమిస్తూ “సకల ప్రశంసలు దేవునికే శోభిస్తాయి. ఆయన మాకు చేసిన వాగ్దానం నెరవేర్చిచూపాడు. మమ్మల్ని ధరణికి వారసులుగా చేశాడు. ఇప్పుడు మేము కోరుకున్న చోట నివాసం ఏర్పరచుకోగలం” అని అంటారు.
కనుక సదాచార సంపన్నులకు అత్యంత శ్రేష్ఠమైన ప్రతిఫలం లభిస్తుంది. (73-74)
అక్కడ నీవు (మహా అద్భుతం) చూస్తావు. దైవదూతలు దివ్య సింహాసనం చుట్టూ వలయంగా ఏర్పడి తమ ప్రభువు ఔన్నత్యం ప్రశంసిస్తూ, ఆయన పవిత్రతను కొని యాడుతుంటారు. మానవులకు పూర్తిన్యాయం చేకూర్చబడుతుంది. (ఆ సందర్భంలో) “సర్వలోక ప్రభువుకే సకలస్తోత్రాలు!” అనే పలుకులు మార్మోగుతాయి. (75)