ఎదుట నీవే

వికీసోర్స్ నుండి

గీతం[మార్చు]

ఎదుటా నీవే ఎదలోనా నీవే
ఎటు చూస్తే అటు నీవే
మరుగయినా కావే

మరుపే తెలియని నా హృదయం
తెలిసీ వలచుట తొలి నేరం
అందుకే ఈ గాయం
గాయాన్నైనా మాయనీవు
హృదయాన్నైనా వీడిపోవు
కాలం నాకు సాయం రాదు
మరణం నన్ను చేరనీదు
పిచ్చివాణ్ణి కానీదు
అహహ ఉహుహు ఎహెహేహే

కలలకి భయపడిపోయాను
నిదురకి దూరం అయ్యాను
వేదన పడ్డాను
స్వప్నాలన్నీ క్షణికాలేగా
సత్యాలన్నీ నరకాలేగా
స్వప్నం సత్యమైతే వింత
సత్యం స్వప్నమయ్యేదుందా
ప్రేమకింత బలముందా
అహహ ఉహుహు ఎహెహేహే

"https://te.wikisource.org/w/index.php?title=ఎదుట_నీవే&oldid=18865" నుండి వెలికితీశారు