ఆలించు పాలించు

Wikisource నుండి

ఆలించు పాలించు (రాగం: ) (తాళం : )

ఆలించు పాలించు ఆదిమ పురుషా జాలిదీర నీకే శరణుజొచ్చితిమి ॥

గతినీవె మతినీవె కర్తవుభర్తవు నీవె పతివినీవె ఏ పట్టున మాకు ఇతరము లెవ్వరున్నారెంచిచూడ నినుబోల చతురుడా నిన్నునే శరణు జొచ్చితిమి॥

జననీ జనకులు శరణము నీవె వునికి మనికి నీవె వుపమ నీవె మనిసిచ్చె నీవె నన్ను మన్నించుకోటేనె చనవి మనవి శరణుజొచ్చితిమి॥

లోక సాక్షివి నీవె లోకబంధుడు నీవె ఈకడ శ్రీవేంకటేశ యిదివో నీవె నీ కంటె మరిలేరు నిఖిలమంతయు గావ సాకారరూప నీకె శరణు జొచ్చితిమి॥


Aalimchu paalimchu (Raagam: ) (Taalam: )

Aalimchu paalimchu aadima purushaa Jaalideera neeke saranujochchitimi 

Gatineeve matineeve kartavubhartavu neeve Pativineeve e pattuna maaku Itaramu levvarunnaaremchichooda ninubola Chaturudaa ninnune saranu jochchitimi

Jananee janakulu saranamu neeve Vuniki maniki neeve vupama neeve Manisichche neeve nannu mannimchukotene Chanavi manavi saranujochchitimi

Loka saakshivi neeve lokabamdhudu neeve Eekada sreevenkatesa yidivo neeve Nee kamte marileru nikhilamamtayu gaava Saakaararoopa neeke saranu jochchitimi


[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


పేజీ లింకులు