అవధారు రఘుపతి అందరిని చిత్తగించు

వికీసోర్స్ నుండి
అవధారు రఘుపతి అందరిని (రాగం: ) (తాళం : )

అవధారు రఘుపతి అందరిని చిత్తగించు యివలనిండే కొలువిదెనదె సముఖాన

రామరాఘవరామ రామచంద్రప్రభో శ్రీమదయోధ్యాధిపతి సీతాపతి ప్రేమనారదుడు పాడిపెక్కురంభాదులాడేరు మోమెత్తి కపులెల్ల మ్రొక్కేరదివో

యినవంశకుల జాత ఇక్ష్వాకుకులతిలక ఘనదశరథసుత కౌశికప్రియ మునులు దీవించేరు ముందట భరతుడదె వెనక లక్ష్మణుడు సేవించీ వింజామర

కందువకౌసల్యాగర్భ రత్నాకర చెందిన శ్రీవేంకటాద్రి శ్రీనివాస సందడి కుశలవులు చదివేరు వొకవంక చెంది నీరాజసము చెప్పరాదు రామ


Avadhaaru raghupati amdarini (Raagam: ) (Taalam: )

Avadhaaru raghupati amdarini chittagimchu Yivalanimde koluvidenade samukhaana

Raamaraaghavaraama raamachamdraprabho Sreemadayodhyaadhipati seetaapati Premanaaradudu paadipekkurambhaadulaaderu Mometti kapulella mrokkeradivo

Yinavamsakula jaata ikshvaakukulatilaka Ghanadasarathasuta kausikapriya Munulu deevimcheru mumdata bharatudade Venaka lakshmanudu sevimchee vimjaamara

Kamduvakausalyaagarbha ratnaakara Chemdina sreevenkataadri Sreenivaasa Samdadi kusalavulu chadiveru vokavamka Chemdi neeraajasamu chepparaadu raama


బయటి లింకులు[మార్చు]





అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |