అలాగే మంచిది

వికీసోర్స్ నుండి


అలాగే మంచిది (రాగం: ) (తాళం : )

అలాగే మంచిది కానిమ్మన వే యొయమ్మ ||

బాల మువ్వ గోపాలుడు పంతమె సాధించెనమ్మ ||

వినవే వానికి నా చేతి విడెమైనను గారాదట
తన ఎదురు కట్ల నిలచిన కాదట
నను చూచిన పాపమట
నా మాటంటే సైంచడంట
తనకు గాని ఈమేను దాచి ఎవరి కయ్యే నమ్మా ||

విరి బోణి నేనున్న ఇంటి పొరిగిల్లాయెన చేర డట
అరసి నే వచ్చిన దోవ నైన రాడట
మరి నా వలె నున్న ప్రతిమల నైన కను గొనడట
సరసిజాక్షి ఈ పాపపు జన్మ నెవరి కయ్యె నమ్మ ||

వనిత మువ్వ గోపాలుడు తను దా నొచ్చు కున్నాడా
తనతో నేమి పని యున్నది పొమ్మని నాడట
యనసినది కల్ల లంట ఇచ్చిన బాస లేదంట
మనసు లేని వానితో నే మాట్లాడి ఎందు కయ్యే నమ్మ ||


alAgE manchidi (Raagam: ) (Taalam: )

alAgE manchidi kAnimmana vE yoyamma ||

bAla muvva gOpAluDu pantame sAdhinchenamma ||

vinavE vAniki nA chEti viDemainanu gArAdaTa
tana eduru kaTla nilachina kAdaTa
nanu choochina pApamaTa
nA mATanTE sainchaDanTa
tanaku gAni eemEnu dAchi evari kayyE nammA ||

viri bONi nEnunna inTi porigillAyena chEra DaTa
arasi nE vachchina dOva naina rADaTa
mari nA vale nunna pratimala naina kanu gonaDaTa
sarasijAkshi ee pApapu janma nevari kayye namma ||

vanita muvva gOpAluDu tanu dA nochchu kunnADA
tanatO nEmi pani yunnadi pommani nADaTa
yanasinadi kalla lanTa ichchina bAsa lEdanTa
manasu lEni vAnitO nE mATlADi endu kayyE namma ||

This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.