అర్జునవిషాద యోగము
Wikisource నుండి
| భగవద్గీత - తెలుగు అనువాదము (అర్జునవిషాద యోగము) | సంస్కృత శ్లోకములు→ |
[మార్చు] ధర్మక్షేత్రే కురుక్షేత్రే. . .
ధృతరాష్ట్రుడు పలికెను.
ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి?
[మార్చు] దృష్ట్వా తు పాణ్డవానీకం
సంజయుడు పలికెను:
అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సిద్ధమైన పాండవసేనను చూసి, ద్రోణాచార్యునివద్దకు వెళ్ళి ఇట్లనెను.
[మార్చు] పశ్యైతాం పాణ్డుపుత్రాణాం
ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిషుడు ధృష్టద్యుమ్నుని చేత ఏర్పరచ బడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి.
[మార్చు] అత్ర శూరా మహేష్వాసా
ఇక్కడ శూరులూబలమైన ధనువులు కలవాళ్ళూ, యుద్ధంలోభీమార్జునతో దీటు రాగలిగిన వాళ్ళూ సాత్యకి, విరాటుడు మహారధుడు దృపదుడు ఉన్నారు.
[మార్చు] ధృష్టకేతుశ్చేకితానః
దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్టుడైన శైబ్యుడు ఉన్నారు.
[మార్చు] యుధామన్యుశ్చ విక్రాన్త
పరాక్రమశాలి యధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ మహారధులే.
[మార్చు] అస్మాకం తు విశిష్టా యే
బ్రాహ్మణోత్తమా మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం చెబుతాను.
[మార్చు] భవాన్భీష్మశ్చ కర్ణశ్చ
మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు.
[మార్చు] అన్యే చ బహవః శూరా
ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను ధరించి నాకోసం జీవితాలని త్యాగం చేశారు.
[మార్చు] అపర్యాప్తం తదస్మాకం బలం
భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత రక్షింపబడే వారి బలం పరిమితమైనది.
[మార్చు] అయనేషు చ సర్వేషు
అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానాలలో వాళ్ళుంటూ, సదా భీష్ముణ్ణే రక్షించాలి.
[మార్చు] తస్య సంజనయన్హర్షం కురువృద్ధః
అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురు వృద్ధుడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదాడు.
[మార్చు] తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ
ఆ వెంటనే శంఖాలూ, భేరులూ, పణవాలూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ, మద్దెలలు)గోముఖాలు ఓకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది.
[మార్చు] తతః శ్వేతైర్హయైర్యుక్తే
అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు దివ్యశఖాలను ఊదారు.
[మార్చు] పాఞ్చజన్యం హృషీకేశో
పాంచజన్యాన్ని హృషీకేశుడూ, దేవదత్తాన్ని ధనంజయుడూ, పౌంద్రకమనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడు ఊదారు.
[మార్చు] అనన్తవిజయం రాజా
కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష, మణిపుష్పకాలనే వాటినినకుల సహదేవులు ఊదారు.
[మార్చు] కాశ్యశ్చ పరమేష్వాసః
ఓ రాజా గొప్ప ధనువు కలిగినకాశీ రాజు, మహారధుదైన శిఖండీ, దృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ;
[మార్చు] ద్రుపదో ద్రౌపదేయాశ్చ
ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడైన అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను ఊదారు.
[మార్చు] స ఘోషో ధార్తరాష్ట్రాణాం
ఆ ధ్వని భూమ్యాకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది.
[మార్చు] అథ వ్యవస్థితాన్దృష్ట్వా
అప్పుడు నిలబడి ఉన్న దార్తరాష్టౄలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు విల్లు ఎక్కుపెట్టిన పాండవ మధ్యముడు,
[మార్చు] హృషీకేశం తదా వాక్యమిదమాహ
ఋషీకేశునితో ఈ మాట అన్నాడు, అచ్యుతా ఉభయ సేనలమద్య రధాన్ని నిలుపు.
[మార్చు] యావదేతాన్నిరిక్షేऽహం
యుద్ధం చేయగోరి ఎదురు చూస్తూ నిలబది ఉన్న వారిన్లో నేను ఎవరితో యుద్ధం చేయాలో వారిని చూడాలి
[మార్చు] యోత్స్యమానానవేక్షేऽహం
దుర్బుద్ధి కలిగిన దుర్యోదనునికి ప్రియం చేయగోరి యుద్ధం చేయడానికి ఎవరెవరు ఇక్కడ సమావేశమై ఉన్నారో వాళ్ళను నేను చూస్తాను.
[మార్చు] ఏవముక్తో హృషీకేశో
సంజయుడిలా అన్నాడు; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమమైన రధాన్ని నిలబెట్టి,
[మార్చు] భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం
భీష్మ ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ కౌరవులను చూడు అన్నాడు.
[మార్చు] తత్రాపశ్యత్స్థితాన్పార్థః
అప్పుడూ అర్జునుడు తండ్రులను, తాతాతలను, గురువులను, మేనమామలను, కుమారులను, మనుమలను చూచాడు.
[మార్చు] శ్వశురాన్సుహృదశ్చైవ
ఇంకా అర్జునుడు, సజ్జనులను, రెండు సేనల మధ్య నిలబడి ఉన్న యావన్మంది బంధువులను సమీక్షించి,
[మార్చు] కృపయా పరయావిష్టో
అర్జునుడు ఇలాఅన్నాడు; ఉదృతమైన కరుణ ఆవహించగా విషాదంతో ఇలా అన్నాడు. యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న నా బంధువులను చూడగా;
[మార్చు] సీదన్తి మమ గాత్రాణి
నా అవయవాలు శిధిలమై పోతున్నాయి, నోరు ఎండి పోతుంది, నా శరీరం వణుకుతుంది, రోమాలు నిక్క పొడుచుకుంటూ ఉన్నాయి.
[మార్చు] గాణ్డీవం స్రంసతే హస్తా
గాండీవం చేతిలోనుంచి జారిపోతుంది, వళ్ళు మండుతోంది, నిలబడటానికి ఓపికలేకుండా ఉన్నది. మనస్సు భ్రమిస్తోంది.
[మార్చు] నిమిత్తాని చ పశ్యామి
కేశవా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, స్వజనాన్ని చంపడం వలన ఏమి మేలు కలుగుతుందో తెలుసుకో లేకుండా ఉన్నాను.
[మార్చు] న కాఙ్క్షే విజయం కృష్ణ
ఓ కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని సుఖాలు కాని కోరను. గోవిందా రాజ్యం వలన కాని, భోగాల వలన కాని, జీవించడం వలన కాని ప్రయోజనం ఏమిటి.
[మార్చు] యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం
ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు ప్రాణాలను, సంపదలను త్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు.
[మార్చు] ఆచార్యాః పితరః పుత్రా
ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలూ, మేనమామలూ, మామలూ, మనుమలూ, బావమరుదులూ, వియ్యంకులూ మొదలైన వారు.
[మార్చు] ఏతాన్న హన్తుమిచ్ఛామి
మధుసూదనా; నేను చంపబడినప్పటికీ, త్రిలోక అధిపత్యానికైనా వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా?
[మార్చు] నిహత్య ధార్తరాష్ట్రాన్నః
జనార్ధనా! దృతరాష్ట్ర కుమారులను చంపడం వలన మనకి ఏమి సంతోషం కలుగుతుంది?ఆతతాయులను చంపినా మనకి పాపమే వస్తుంది.
[మార్చు] తస్మాన్నార్హా వయం హన్తుం
అందువలన బంధు సమేతులైన దార్తరాష్ట్రులను చంపడం తగదు. మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా సుఖపడ గలము.
[మార్చు] యద్యప్యేతే న పశ్యన్తి
లోభంచేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయం వలన కలిగే దోషాన్ని, మిత్ర ద్రోహం వలన కలిగే పాపాన్ని చూడలేక పోయినప్పటికీ,
[మార్చు] కథం న జ్ఞేయమస్మాభిః
జనార్ధనా! కులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగ కూడదు?
[మార్చు] కులక్షయే ప్రణశ్యన్తి
కులక్షయం వలన సనాతనమైన ధర్మం నశిస్తుంది. ధర్మం నశించినపుడు యావత్కులం అధర్మం వైపు తిరుగుతుంది.
[మార్చు] అధర్మాభిభవాత్కృష్ణ
కృష్ణా! అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది.
[మార్చు] సంకరో నరకాయైవ
సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు.
[మార్చు] దోషైరేతైః కులఘ్నానాం
వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వలన శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింప బడతాయి.
[మార్చు] ఉత్సన్నకులధర్మాణాం
జనార్ధనా కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరక వాసులౌతారని విన్నాము.
[మార్చు] అహో బత మహత్పాపం
అకటా! రాజ్య సుఖం కోసం స్వజనాన్ని వధించడాఇకి సిద్ధమైన మనం ఎంతటి మహాపాపానికి ఒడి గట్టుతున్నాము.
[మార్చు] యది మామప్రతీకారమశస్త్రం
ప్రతీకారం చేయక నిరాయుధడనై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో నన్ను చంపినా, దానివలన ఎక్కువ నాకు మేలే జరుగుతుంది.
[మార్చు] ఏవముక్త్వార్జునః సంఖ్యే
సంజయుడు ఇలాపలికాడు; అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండి ఉన్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనస్సుని వదిలి రధం వెనుక భాగంలో కూర్చున్నాడు.
తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదేऽర్జునవిషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః ||
| భగవద్గీత - తెలుగు అనువాదము | సంస్కృత శ్లోకములు→ |

