అయనాయ వెంగెమేలే అతివా

వికీసోర్స్ నుండి
అయనాయ వెంగెమేలే అతివా (రాగం: ) (తాళం : )

అయనాయ వెంగెమేలే అతివా ! నీ-
ఆయమే తాఁకీ మాఁట లందుకేమి సేతురా // పల్లవి //

కప్పురమిందవే వోకలికీ ! మాకు -
నుప్పులవు నీకప్పురా లొల్లము పోరా
తప్పనాడే వదియేమే తరుణీ ! వోరి
తప్పులెవ్వ రెందున్నవో తలఁచుకో నీవు // అయ //

నిమ్మ పండిందవే వో నెలఁతా ! ఆ -
నిమ్మపండే పాఁపరమును నే నొల్లరా
చిమ్మేవు సట లిదేమే చెలియ మేన
చిమ్మురేఖ లెవ్వరందో చిత్తగించు నీవు // అయ //

కుంకుమపూ విందవే వో కోమలీ ! నీ -
కుంకుమలే పుప్పుడౌను కూడుకొంటేను
యింకనేలే కలసితి నింతీ ! వోరి
యింకపు శ్రీవేంకటేశ యిద్దరిచెమటలు // అయ //


ayanAya veMgemElE ativA (Raagam: ) (Taalam: )

ayanAya veMgemElE ativA ! nI
AyamE tAkI mATa laMdukEmi sEturA // pallavi //

kappuramiMdavE vOkalikI ! mAku
nuppulavu nIkappurA lollamu pOrA
tappanADE vadiyEmE taruNI ! vOri
tappulevva reMdunnavO talachukO nIvu // aya //

nimma paMDiMdavE vO nelatA ! A
nimmapaMDE pAparamunu nE nollarA
chimmEvu saTa lidEmE cheliya mEna
chimmurEkha levvaraMdO chittagiMchu nIvu // aya //

kuMkumapU viMdavE vO kOmalI ! nI
kuMkumalE puppuDaunu kUDukoMTEnu
yiMkanElE kalasiti niMtI ! vOri
yiMkapu SrIvEMkaTESa yiddarichemaTalu // aya //


బయటి లింకులు[మార్చు]





అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |