అనుమానపుబ్రదుకు కది
Wikisource నుండి
ప|| అనుమానపుబ్రదుకు కది రోతా తన- | మనసెనయనికూటమి మరి రోతా ||
చ|| అపకీర్తులబడి ఆడికెలోనై | అపవాదియౌట అది రోత | వుపమ గెలిచెనని వొరు జెరుచుటలు | విపరీతపుగుణ విధమొక రోతా ||
చ|| తనగుట్టెల్లా నెరిగిన వారలముందట | తనయెమ్మెలు చెప్పుకొనుట రోత | వనితలముందట వదరుచు వదరుచు | కనుగవ గావనిగర్వము రోత ||
చ|| భువి హరిగతియని బుద్ధిదలంచని | యవమానపుమన నది రోత | భవసంహరుడై పరగు వేంకటపతి- | నవిరళముగ గొలువని దది రోత ||
pa|| anumAnapubraduku kadi rOtA tana- | manasenayanikUTami mari rOtA ||
ca|| apakIrtulabaDi ADikelOnai | apavAdiyauTa adi rOta | vupama gelicenani voru jerucuTalu | viparItapuguNa vidhamoka rOtA ||
ca|| tanaguTTellA nerigina vAralamuMdaTa | tanayemmelu ceppukonuTa rOta | vanitalamuMdaTa vadarucu vadarucu | kanugava gAvanigarvamu rOta ||
ca|| Buvi harigatiyani buddhidalaMcani | yavamAnapumana nadi rOta | BavasaMharuDai paragu vEMkaTapati- | naviraLamuga goluvani dadi rOta ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
|