అదె వాడె యిద్ె
Wikisource నుండి
ప|| అదె వాడె యిదె వీడె అందు నిందు నేగీని | వెదకి వెదకి తిరువీధులందు దేవుడు ||
చ|| అలసూర్యవీధి నేగీ నాదిత్యునితేరిమిద | కలికికమలానందకరుడుగాన | తలపోసి అదియును దవ్వు చుట్టరికమని | యిల దేరిమీద నేగీ నిందిరావిభుడు ||
చ|| చక్క సోమవీధి నేగీ జందురునితేరిమీద | యెక్కువైనకువలయహితుడుగాన | చుక్కలుమోచినదవ్వుచుట్టరిక మిదియని | యిక్కువతో వీధి నేగీ నెన్నికైనదేవుడు ||
చ|| యింతులమనోవీధి నేగీ మరుతేరిమీద- | నంతటా రతిప్రియు డటుగాన | రంతుల నదియు గానరానిచుట్టరికమని | వింతరీతి నేగీ శ్రీవేంకటాద్రిదేవుడు ||
pa|| ade vADe yide vIDe aMdu niMdu nEgIni | vedaki vedaki tiruvIdhulaMdu dEvuDu ||
ca|| alasUryavIdhi nEgI nAdityunitErimida | kalikikamalAnaMdakaruDugAna | talapOsi adiyunu davvu cuTTarikamani | yila dErimIda nEgI niMdirAviBuDu ||
ca|| cakka sOmavIdhi nEgI jaMdurunitErimIda | yekkuvainakuvalayahituDugAna | cukkalumOcinadavvucuTTarika midiyani | yikkuvatO vIdhi nEgI nennikainadEvuDu ||
ca|| yiMtulamanOvIdhi nEgI marutErimIda- | naMtaTA ratipriyu DaTugAna | raMtula nadiyu gAnarAnicuTTarikamani | viMtarIti nEgI SrIvEMkaTAdridEvuDu ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
|