అదె వచ్చె నిదె

Wikisource నుండి

అదె వచ్చె నిదె (రాగమ్: ) (తాలమ్: )

ప|| అదె వచ్చె నిదె వచ్చె నచ్యుతుసేనాపతి | పదిదిక్కులకు నిట్టె పారరో యసురలు ||

చ|| గరుడధ్వజం బిదె ఘనశంఖరవ మదె | సరుసనే విష్ణుదేవుచక్ర మదె | మురవైరిపంపు లవె ముందరిసేన లవె | పరచి గగ్గుల కాడై పారరో దానవుల ||

చ|| తెల్లవి గొడుగు లవె దేవదుందుభులు నవె | యెల్లదేవతలరథా లింతటా నవె | కెల్లురేగీ నిక్కి హరికీర్తి భుజములవె | పల్లపుపాతాళాన బడరో దనుజులు ||

చ|| వెండిపైడిగుదె లవె వెంజామరము లవె | మెండగుకై వారాలు మించిన వవె | దండి శ్రీవేంకటపై దాడిముటై నదె యిదె | బడుబండై జజ్జరించి పారరోదై తేయులు ||


ade vacce nide (Raagam: ) (Taalam: )

pa|| ade vacce nide vacce nacyutusEnApati | padidikkulaku niTTe pArarO yasuralu ||

ca|| garuDadhvajaM bide GanaSaMKarava made | sarusanE viShNudEvucakra made | muravairipaMpu lave muMdarisEna lave | paraci gaggula kADai pArarO dAnavula ||

ca|| tellavi goDugu lave dEvaduMduBulu nave | yelladEvatalarathA liMtaTA nave | kellurEgI nikki harikIrti Bujamulave | pallapupAtALAna baDarO danujulu ||

ca|| veMDipaiDigude lave veMjAmaramu lave | meMDagukai vArAlu miMcina vave | daMDi SrIvEMkaTapai dADimuTai nade yide | baDubaMDai jajjariMci pArarOdai tEyulu ||


[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


పేజీ లింకులు