అదె చూడరే మోహన రూపం

Wikisource నుండి

అదె చూడరే మోహన (రాగమ్: ) (తాలమ్: )

అదె చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజరూపం

వెలయగ పదారువేల మగువలను అలమిన ఘన మోహనరూపం వలచిన నందవ్రజము గొల్లెతల కులుకు చూపులకు గురియగురూపం||

ఇందిరా వనితనెప్పుడు తనవుర మందు నిలిపిన మోహనరూపం కందువ భూపతి కౌగిట సొంపుల విందులు మరిగిన వేడుకరూపం||

త్రిపుర సతుల భోధించి రమించిన అపురూపపు మోహనరూపం కవురుల శ్రీ వేంకటపతియై ఇల ఉపమించగ రాని వున్నతరూపం||


Ade choodare mohana (Raagam: ) (Taalam: )

Ade choodare mohana roopam Padi kotlu gala bhaavajaroopam

Velayaga padaaruvela maguvalanu Alamina ghana mohanaroopam Valachina nandavrajamu golletala Kuluku choopulaku guriyaguroopam

Indiraa vanitaneppudu tanavura Mandu nilipina mohanaroopam Kanduva bhoopati kaugita sompula Vindulu marigina vedukaroopam

Tripura satula bhodhinchi raminchina Apuroopapu mohanaroopam Kavurula Sree venkatapatiyai ila

Upaminchaga raani vunnataroopam


[మార్చు] బయటి లింకులు



[మార్చు] సారాంశము:

తిరుమల గిరులపై వెలసిన శ్రీ వేంకటపతి రూపం అత్యంత మనోహరమైనది॥ సమస్త విశ్వాన్ని మోహింపచేయునటువంటిది॥ ఆ రూపాన్ని చూస్తేనే ఆనందం కలుగుతుంది॥ ౧౬ వేలమంది మగువలు, నంద వ్రజములోని గొల్లెతలు కొలిచి ఆనందించింది ఈ రూపాన్నే॥ వక్ష్H స్థలంలో లక్ష్మిని నింపుకున్న మోహనరూపుడు శ్రీ వేంకటేశుడు॥ ఆయనతో సరిపోల్చు ఉపమానం ఈ విశ్వంలోనే లేదు॥



అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


పేజీ లింకులు