అదెచూడు తిరువేంకటాద్రి
Wikisource నుండి
ప|| అదెచూడు తిరువేంకటాద్రి నాలుగుయుగము- | లందు వెలుగొందీ ప్రభమీరగాను ||
చ|| తగ నూటయిరువై యెనిమిదితిరుపతుల గల- | స్థానికులును చక్రవర్తిపీఠకమలములును | అగణితంబైన దేశాంత్రులమఠంబులును | నధికమై చెలువొందగాను ||
చ|| మిగులనున్నతములగుమేడలును మాడుగులు | మితిలేనిదివ్యతపస్సులున్న గృహములును | వొగి నొరగు బెరుమాళ్ళ వునికిపట్టయి వెలయు- | దిగువ తిరుపతి గడవగాను ||
చ|| పొదలి యరయోజనముపొడవునను బొలుపొంది | పదినొండుయోజనంబులపరపునను బరగి | చెదర కేవంకచూచిన మహాభూజములు | సింహశార్దూలములును ||
చ|| కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును | గరుడగంధర్వయక్షులును విద్యాధరులు | విదితమై విహరించువిశ్రాంతదేశముల | వేడుకలు దైవారగాను||
చ|| యెక్కువలకెక్కువై యెసగి వెలసినపెద్ద- | యెక్కు డతిశయముగా నెక్కినంతటిమీద | అకజంబైన పల్లవరాయనిమటము | అల్లయేట్ల పేడ గడవన్ ||
చ|| చక్కనేగుచు నవ్వచరి గడచి హరి దలచి | మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచినమీద- | నక్కడక్కడ వేంకటాద్రీశుసంపదలు | అంతంత గానరాగాను ||
చ|| బుగులుకొనుపరిమళంబుల పూవుదోటలును | పొందైన నానావిధంబుల వనంబులును | నిగడి కిక్కిరిసి పండినమహావృక్షముల- | నీడలను నిలిచి నిలిచి ||
చ|| గగనంబుదాకి శృంగార రసభరితమై | కనకమయమైన గోపురములను జెలువొంది | జగతీధరుని దివ్యసంపదలు గలనగరు | సరుగనను గానరాగాను ||
చ|| ప్రాకటంబైన పాపవినాశనములోని | భరితమగుదురితములు పగిలి పారుచునుండ | ఆకాశగంగతోయములు సోకిన భవము- | లంతంత వీడి పారగను ||
చ|| యీకడను గోనేట యతులు బాశుపతుల్ మును- | లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో | యేకమై తిరువేంకటాద్రీశు డాదరిని | యేప్రొద్దు విహరించగాను ||
pa|| adecUDu tiruvEMkaTAdri nAluguyugamu- | laMdu velugoMdI praBamIragAnu ||
ca|| taga nUTayiruvai yenimiditirupatula gala- | sthAnikulunu cakravartipIThakamalamulunu | agaNitaMbaina dESAMtrulamaThaMbulunu | nadhikamai celuvoMdagAnu ||
ca|| migulanunnatamulagumEDalunu mADugulu | mitilEnidivyatapassulunna gRuhamulunu | vogi noragu berumALLa vunikipaTTayi velayu- | diguva tirupati gaDavagAnu ||
ca|| podali yarayOjanamupoDavunanu bolupoMdi | padinoMDuyOjanaMbulaparapunanu baragi | cedara kEvaMkacUcina mahABUjamulu | siMhaSArdUlamulunu ||
ca|| kadisi suravarulu kinnarulu kiMpuruShulunu | garuDagaMdharvayakShulunu vidyAdharulu | viditamai vihariMcuviSrAMtadESamula | vEDukalu daivAragAnu||
ca|| yekkuvalakekkuvai yesagi velasinapedda- | yekku DatiSayamugA nekkinaMtaTimIda | akajaMbaina pallavarAyanimaTamu | allayETla pEDa gaDavan ||
ca|| cakkanEgucu navvacari gaDaci hari dalaci | mrokkucunu mOkALLamuDugu gaDacinamIda- | nakkaDakkaDa vEMkaTAdrISusaMpadalu | aMtaMta gAnarAgAnu ||
ca|| bugulukonuparimaLaMbula pUvudOTalunu | poMdaina nAnAvidhaMbula vanaMbulunu | nigaDi kikkirisi paMDinamahAvRukShamula- | nIDalanu nilici nilici ||
ca|| gaganaMbudAki SRuMgAra rasaBaritamai | kanakamayamaina gOpuramulanu jeluvoMdi | jagatIdharuni divyasaMpadalu galanagaru | sarugananu gAnarAgAnu ||
ca|| prAkaTaMbaina pApavinASanamulOni | Baritamaguduritamulu pagili pArucunuMDa | AkASagaMgatOyamulu sOkina Bavamu- | laMtaMta vIDi pAraganu ||
ca|| yIkaDanu gOnETa yatulu bASupatul munu- | lenna naggalamaivunna vaiShNavulalO | yEkamai tiruvEMkaTAdrISu DAdarini | yEproddu vihariMcagAnu ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
|
|