అతిదుష్టుడ నే

Wikisource నుండి

అతిదుష్టుడ నే నలసుడను (రాగమ్: ) (తాలమ్: )

ప|| అతిదుష్టుడ నే నలసుడను | యితరవివేకం బికనేల ||

చ|| ఎక్కడ నెన్నిట యేమి సేసితినొ | నిక్కపుదప్పులు నేరములు | గక్కన నిన్నిట కలిగిననీవే | దిక్కుగాక మరి దిక్కేది ||

చ|| ఘోరపుబాపము కోట్లసంఖ్యలు | చేరువ నివె నాచేసినివి | నీరసునకు నిటు నీకృప నాకిక | కూరిమి నా యెడ గుణమేది ||

చ|| యెఱిగి చేసినది యెఱుగక చేసిన- | కొఱతలు నాయెడ గోటులివే | వెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావు | మఱవక నాగతి మఱి యేది ||


atiduShTuDa nE (Raagam: ) (Taalam: )

pa|| atiduShTuDa nE nalasuDanu | yitaravivEkaM bikanEla ||

ca|| ekkaDa nenniTa yEmi sEsitino | nikkapudappulu nEramulu | gakkana ninniTa kaliginanIvE | dikkugAka mari dikkEdi ||

ca|| GOrapubApamu kOTlasaMKyalu | cEruva nive nAcEsinivi | nIrasunaku niTu nIkRupa nAkika | kUrimi nA yeDa guNamEdi ||

ca|| yerxigi cEsinadi yerxugaka cEsina- | korxatalu nAyeDa gOTulivE | verxapu dIrci SrIvEMkaTESa kAvu | marxavaka nAgati marxi yEdi ||


[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


పేజీ లింకులు