అతను సంపద కంటెన

Wikisource నుండి

అతను సంపద కంటెన (రాగమ్: ) (తాలమ్: )

ప|| అతను సంపద కంటెన సదా చెలిరూపు | మతి చింత చేత వేమరు నలగె గాక ||

చ|| తగు జందురుని నణచ దగదా చెలిమోము | వగలచే నొకయింత వాడెగాక | పగటు గోవెల మించి పాఱదా సతి పలుకు | జగడమున బతి బాసి సన్నగిలె గాక ||

చ|| కదలు గందపు గాలి గావదా చెలియూర్పు | కదిమేటి మదనాగ్ని గ్రాగె గాక | కొదకు తుమ్మెద గమికి గొఱతా చెలి తురుము | చెదరి మరు బాణముల చేజాఱె గాక ||

చ|| లీల బన్నీటికిని లేతా చెలి చెమట | లోలి బూబానుపున నుడికె గాక | యేల చిగురున కంటె నెరవా చెలి మోవి | గేళి వేంకట విభుడు గీలించెగాక ||


atanu saMpada kaMTena (Raagam: ) (Taalam: )

pa|| atanu saMpada kaMTena sadA celirUpu | mati ciMta cEta vEmaru nalage gAka ||

ca|| tagu jaMduruni naNaca dagadA celimOmu | vagalacE nokayiMta vADegAka | pagaTu gOvela miMci pArxadA sati paluku | jagaDamuna bati bAsi sannagile gAka ||

ca|| kadalu gaMdapu gAli gAvadA celiyUrpu | kadimETi madanAgni grAge gAka | kodaku tummeda gamiki gorxatA celi turumu | cedari maru bANamula cEjArxe gAka ||

ca|| lIla bannITikini lEtA celi cemaTa | lOli bUbAnupuna nuDike gAka | yEla ciguruna kaMTe neravA celi mOvi | gELi vEMkaTa viBuDu gIliMcegAka ||


[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |


పేజీ లింకులు