అతని పాడెదను అది

Wikisource నుండి

అతని పాడెదను అది (రాగమ్: ) (తాలమ్: )

ప|| అతని పాడెదను అది వ్రతము | చతురుని శేషాచల నివాసుని ||

చ|| సనకాదులు ఏ సర్వేశు గొలిచిరి | అనిశము శుకుడెవ్వని దలచె | మును ధ్రువు డేదేవుని సన్నుతించె | ఘన నారదు డేఘనుని పొగడెను ||

చ|| ఎలమి విభీషణు డేదేవుని శరణని | తలచె భీష్ముడే దైవమును | బలు ప్రహ్లాదుని ప్రాణేశు డెవ్వడు | ఇలలో వశిష్ఠు డేమూర్తి దెలిసె ||

చ|| పురిగొని వ్యాసు డేపురుషుని చెప్పెను | తిరముగ అర్జునుని దిక్కెవ్వడు | మరిగిన అలమేలమంగపతి ఎవ్వడు | గరిమల శ్రీవేంకటేశు డీతడు ||


atani pADedanu adi (Raagam: ) (Taalam: )

pa|| atani pADedanu adi vratamu | caturuni SEShAcala nivAsuni ||

ca|| sanakAdulu E sarvESu goliciri | aniSamu SukuDevvani dalace | munu dhruvu DEdEvuni sannutiMce | Gana nAradu DEGanuni pogaDenu ||

ca|| elami viBIShaNu DEdEvuni SaraNani | talace BIShmuDE daivamunu | balu prahlAduni prANESu DevvaDu | ilalO vaSiShThu DEmUrti delise ||

ca|| purigoni vyAsu DEpuruShuni ceppenu | tiramuga arjununi dikkevvaDu | marigina alamElamaMgapati evvaDu | garimala SrIvEMkaTESu DItaDu ||


[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |


పేజీ లింకులు