అతనికెట్ల సతమైతినో
ప|| అతనికెట్ల సతమైతినో కడు- | హితవో పొందులహితవో యెఱగ ||
చ|| హృదయము తలపున నిరవయినగదా | పదిలమౌను లోపలిమాట | వెదకినచిత్తము వెర వెఱుగదు నే- | నెదిరి నెఱగ నే నేమియు నెఱగ ||
చ|| కాలూద మనసుగలిగినకదా నా- | తాలిమి మతిలో దగులౌట | మేలిమిపతితో మెలగుటేదో నే- | నేలో నే నిపుడెక్కడో యెఱగ ||
చ|| నేడని రేపని నే నెఱిగికదా | పోడిమి మతిలో పొలుపౌట | వాడే వేంకటేశ్వరుడు రాగలిగె | ఆడుజన్మ మేనౌటిది యెఱగ ||
pa|| atanikeTla satamaitinO kaDu- | hitavO poMdulahitavO yerxaga ||
ca|| hRudayamu talapuna niravayinagadA | padilamaunu lOpalimATa | vedakinacittamu vera verxugadu nE- | nediri nerxaga nE nEmiyu nerxaga ||
ca|| kAlUda manasugaliginakadA nA- | tAlimi matilO dagulauTa | mElimipatitO melaguTEdO nE- | nElO nE nipuDekkaDO yerxaga ||
ca|| nEDani rEpani nE nerxigikadA | pODimi matilO polupauTa | vADE vEMkaTESvaruDu rAgalige | ADujanma mEnauTidi yerxaga ||
బయటి లింకులు [మార్చు]
| అన్నమయ్య పాటలు | |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
|