అతడు భక్తసులభు డచ్యుతుడు

Wikisource నుండి

అతడు భక్తసులభు (రాగమ్: ) (తాలమ్: )

అతడు భక్తసులభు డచ్యుతుడు రాతిగుండెవాడు గాడు రంతు మాను డికను

జీవుడా వేసరకు చిత్తమా జడియకు దైవము గరుణించ దడవుగాదు తోవచూపె మనకుతొల్లే ఆచార్యుడు కావలసినట్లయ్యీ గలగకు డికను

కాలమా వేగిరించకు కర్మమా నన్ను మీరకు పాలించ దైవానకు నే భార మికను ఆలించి తిరుమంత్రమే ఆతని నన్ను గూరిచె వేలగానిఅందాకా వేసరకు డికను

వెరవకు దేహమా వేసరకు ధ్యానమా యెరిగి శ్రీవేంకటేశు డెడసిపోడు తరి నిహపరము లితనిదాసు లిచ్చిరి గురియైతి నిన్నిటికి గొంకకుడీ ఇకను


Atadu bhaktasulabhu (Raagam: ) (Taalam: )

Atadu bhaktasulabhu dachyutudu Raatigundevaadu gaadu rantu maanu dikanu

Jeevudaa vesaraku chittamaa jadiyaku Daivamu garunincha dadavugaadu Tovachoope manakutolle aachaaryudu Kaavalasinatlayyee galagaku dikanu

Kaalamaa vegirinchaku karmamaa nannu meeraku Paalincha daivaanaku ne bhaara mikanu Aalinchi tirumantrame aatani nannu gooriche Velagaaniandaakaa vesaraku dikanu

Veravaku dehamaa vesaraku dhyaanamaa Yerigi sreevenkatesu dedasipodu Tari nihaparamu litanidaasu lichchiri Guriyaiti ninnitiki gonkakudee ikanu




[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |


పేజీ లింకులు