అణురేణుపరిపూర్ణుడైన

Wikisource నుండి

అణురేణుపరిపూర్ణుడైన (రాగమ్: ) (తాలమ్: )

ప|| అణురేణుపరిపూర్ణుడైన శ్రీవల్లభుని | బ్రణుతించువారువో బ్రాహ్మలు ||

చ|| హరినామములనె సంధ్యాదివిధు లొనరించు- | పరిపూర్ణమతులువో బ్రాహ్మలు | హరిమంత్ర వేదపారాయణులు హరిభక్తి- | పరులైన వారువో బ్రాహ్మలు ||

చ|| ఏవిచూచినను హరి యిన్నిటా గలడనుచు- | భావించువారువో బ్రాహ్మలు | దేవకీనందనుడె దేవుడని మతిదెలియు- | పావనులు వారువో బ్రాహ్మలు ||

చ|| ఆదినారాయణుని ననయంబు దమయాత్మ | బాదుకొలిపనవారు బ్రాహ్మలు | వేదరక్షకుడైన వేంకటగిరీశ్వరుని- | పాదసేవకులువో బ్రాహ్మలు ||


aNurENuparipUrNuDaina (Raagam: ) (Taalam: )

pa|| aNurENuparipUrNuDaina SrIvallaBuni | braNutiMcuvAruvO brAhmalu ||

ca|| harinAmamulane saMdhyAdividhu lonariMcu- | paripUrNamatuluvO brAhmalu | harimaMtra vEdapArAyaNulu hariBakti- | parulaina vAruvO brAhmalu ||

ca|| EvicUcinanu hari yinniTA galaDanucu- | BAviMcuvAruvO brAhmalu | dEvakInaMdanuDe dEvuDani matideliyu- | pAvanulu vAruvO brAhmalu ||

ca|| AdinArAyaNuni nanayaMbu damayAtma | bAdukolipanavAru brAhmalu | vEdarakShakuDaina vEMkaTagirISvaruni- | pAdasEvakuluvO brAhmalu ||


[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


పేజీ లింకులు