అడుగరే యాతనినే

Wikisource నుండి

అడుగరే యాతనినే (రాగమ్: ) (తాలమ్: )

ప|| అడుగరే యాతనినే అంగనలాలా | గుడిగొని తానే వట్టి గొరబాయగాక ||

చ|| యెదురాడేదాననా యెంతటి పనికినైనా | పదరి తానే మారువలికీ గాక | తుదమీఱేదాననా దూరైయంత దిరిగినా | ముదమునదానే మారుమలసీగాక ||

చ|| కక్కసించే దాననా కడలెంత దొక్కినాను | వెక్కసీడై తానై యిటు వెలసీగాక | మొక్కలపుదాననా ముందు వెనకెంచితేను | పక్కనె దానె ముంచి పంతమాడీగాక ||

చ|| తడబడేదాననా తనరతి వేళను | బడిబడి దానే చొక్కి భ్రమసీగాక | అడిగేటి దాననా అందరిలో నన్నుగూడి | అడరి శ్రీవేంకటేశు డాదరించీగాక ||


aDugarE yAtaninE (Raagam: ) (Taalam: )

pa|| aDugarE yAtaninE aMganalAlA | guDigoni tAnE vaTTi gorabAyagAka ||

ca|| yedurADEdAnanA yeMtaTi panikinainA | padari tAnE mAruvalikI gAka | tudamIrxEdAnanA dUraiyaMta diriginA | mudamunadAnE mArumalasIgAka ||

ca|| kakkasiMcE dAnanA kaDaleMta dokkinAnu | vekkasIDai tAnai yiTu velasIgAka | mokkalapudAnanA muMdu venakeMcitEnu | pakkane dAne muMci paMtamADIgAka ||

ca|| taDabaDEdAnanA tanarati vELanu | baDibaDi dAnE cokki BramasIgAka | aDigETi dAnanA aMdarilO nannugUDi | aDari SrIvEMkaTESu DAdariMcIgAka ||


[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |


పేజీ లింకులు