అటు గుడువు మనస నీ
Wikisource నుండి
ప|| అటు గుడువు మనస నీ వన్నిలాగుల బొరలి | ఇటు గలిగె నీకు నైహికవిచారములు ||
చ|| కోరికలకును గలిగె ఘోరపరితాపంబు | కూరిమికి గలిగె ననుకూలదుఃఖములు | తారతమ్యములేని తలపోతలకు గలిగె | భారమైనట్టి లంపటమనెడిమోపు ||
చ|| తనువునకు గలిగె సంతతమైనతిమ్మటలు | మనువునకు గలిగె నామవికారములు | పనిలేని సంసార బంధంబునకు గలిగె | ఘనమైన దురిత సంగతితోడి చెలిమి ||
చ|| దేహికిని గలిగె నింద్రియములను బోధింప | దేహంబునకు గలిగె తెగనిసంశయము |
దేహాత్మకుండయిన తిరువేంకటేశునకు | దేహిదేహాంతరస్థితి జూడగలిగె ||pa|| aTu guDuvu manasa nI vannilAgula borali | iTu galige nIku naihikavicAramulu ||
ca|| kOrikalakunu galige GOraparitApaMbu | kUrimiki galige nanukUladuHKamulu | tAratamyamulEni talapOtalaku galige | BAramainaTTi laMpaTamaneDimOpu ||
ca|| tanuvunaku galige saMtatamainatimmaTalu | manuvunaku galige nAmavikAramulu | panilEni saMsAra baMdhaMbunaku galige | Ganamaina durita saMgatitODi celimi ||
ca|| dEhikini galige niMdriyamulanu bOdhiMpa | dEhaMbunaku galige teganisaMSayamu | dEhAtmakuMDayina tiruvEMkaTESunaku | dEhidEhAMtarasthiti jUDagalige ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
|