అటువంటివాడువో హరిదాసుడు

Wikisource నుండి

అటువంటివాడువో హరిదాసుడు (రాగమ్: ) (తాలమ్: )

ప|| అటువంటివాడువో హరిదాసుడు | ఆటమాటలు విడిచినాతడే సుఖి ||

చ|| తిట్టేటిమాటలును దీవించేమాటలును | అట్టే సరెయని తలచినాతడే సుఖి | పట్టిచంపేవేళను పట్టముగట్టేవేళ | అట్టునిట్టు చలించని యాతడే సుఖి ||

చ|| చేరి పంచదారిడిన జేదు దెచ్చిపెట్టినాను | ఆరగించి తనివొందే యతడే సుఖి | తేరకాండ్ల జూచిన తెగరానిచుట్టముల | నారయ సరిగాజూచే యాతడే సుఖి ||

చ|| పొంది పుణ్యము వచ్చిన పొరి బాపము వచ్చిన- | నందలి ఫలమొల్లని యాతడే సుఖి | విందుగా శ్రీవేంకటాద్రి విభునిదాసుల జేరి | అందరానిపద మందిన నాతడే సుఖి ||


aTuvaMTivADuvO haridAsuDu (Raagam: ) (Taalam: )

pa|| aTuvaMTivADuvO haridAsuDu | ATamATalu viDicinAtaDE suKi ||

ca|| tiTTETimATalunu dIviMcEmATalunu | aTTE sareyani talacinAtaDE suKi | paTTicaMpEvELanu paTTamugaTTEvELa | aTTuniTTu caliMcani yAtaDE suKi ||

ca|| cEri paMcadAriDina jEdu deccipeTTinAnu | AragiMci tanivoMdE yataDE suKi | tErakAMDla jUcina tegarAnicuTTamula | nAraya sarigAjUcE yAtaDE suKi ||

ca|| poMdi puNyamu vaccina pori bApamu vaccina- | naMdali Palamollani yAtaDE suKi | viMdugA SrIvEMkaTAdri viBunidAsula jEri | aMdarAnipada maMdina nAtaDE suKi ||


[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |


పేజీ లింకులు