అటుచూడు సతినేర్పు లవుభళేశ
Wikisource నుండి
ప|| అటుచూడు సతినేర్పు లవుభళేశ | అటుమటములు గావు అవుభళేశ ||
చ|| యెదురు గొండల మీద నెక్కినట్టి లకిమమ్మ | అదివో నీ తొడ యెక్కినౌభళేశ | వుదుటున నంతలోనే వురముపై నెలకొని | అదిమీ జన్నుల నిన్ను నౌభళేశ ||
చ|| ముంగోపముతోడను మొక్కలీడవైన నిన్ను | నంగన గద్దెపై బెట్టె నౌభళేశ | కంగక వేదాద్రి నిన్ను గరుడాద్రికి దీసె | అంగా లంటె నింటిలోన నౌభళేశ ||
చ|| చేరి నీవు నవ నారసింహరూపులైతే జెలి | ఆ రీతుల నిన్ను గూడె నౌభళేశ | గారవాన నీవు శ్రీ వేంకటముపై నుండగాను | అరసి రతి మెప్పించె నౌభళేశ ||
pa|| aTucUDu satinErpu lavuBaLESa | aTumaTamulu gAvu avuBaLESa ||
ca|| yeduru goMDala mIda nekkinaTTi lakimamma | adivO nI toDa yekkinauBaLESa | vuduTuna naMtalOnE vuramupai nelakoni | adimI jannula ninnu nauBaLESa ||
ca|| muMgOpamutODanu mokkalIDavaina ninnu | naMgana gaddepai beTTe nauBaLESa | kaMgaka vEdAdri ninnu garuDAdriki dIse | aMgA laMTe niMTilOna nauBaLESa ||
ca|| cEri nIvu nava nArasiMharUpulaitE jeli | A rItula ninnu gUDe nauBaLESa | gAravAna nIvu SrI vEMkaTamupai nuMDagAnu | arasi rati meppiMce nauBaLESa ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
|
|