అక్కలాల చూడుడందరును

Wikisource నుండి

అక్కలాల చూడుడందరును (రాగం: ) (తాళం : )

ప|| అక్కలాల చూడుడందరును | నిక్కివారవట్టీ నేడు గృష్ణుడు ||

చ|| ఆనవాలవుట్టి అడకులవుట్టి | పానకపుటుట్టి బలిమినే | ఆనుక కోలలనందియంది కొట్టి | తేనెవుట్టి గొట్టి దేవకిసుతుడు ||

చ|| పెరుగువుట్టి మంచిపేరిన నేతివుట్టి | సరివెన్నవుట్టి చక్కెరవుట్టి | వెరవుతో గొట్టి వెసబాలులతో | బొరుగువుట్టి గొట్టీపొంచి రాముడు ||

చ|| మక్కువ నలమేలుమంగగూడి నేడు | చొక్కి శ్రీవేంకటేశుడు వీధుల | నిక్కి వుట్లెల్లా నిండా గొట్టివుట్టి | చక్కిలాలు గొట్టీ జగతీశుడు ||


akkalAla cUDuDaMdarunu (Raagam: ) (Taalam: )

pa|| akkalAla cUDuDaMdarunu | nikkivAravaTTI nEDu gRuShNuDu ||

ca|| AnavAlavuTTi aDakulavuTTi | pAnakapuTuTTi baliminE | Anuka kOlalanaMdiyaMdi koTTi | tEnevuTTi goTTi dEvakisutuDu ||

ca|| peruguvuTTi maMcipErina nEtivuTTi | sarivennavuTTi cakkeravuTTi | veravutO goTTi vesabAlulatO | boruguvuTTi goTTIpoMci rAmuDu ||

ca|| makkuva nalamElumaMgagUDi nEDu | cokki SrIvEMkaTESuDu vIdhula | nikki vuTlellA niMDA goTTivuTTi | cakkilAlu goTTI jagatISuDu ||



[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |


పేజీ లింకులు