అక్కరకొదగనియట్టియర్థము

Wikisource నుండి

అక్కరకొదగనియట్టియర్థము (రాగం: ) (తాళం : )

ప|| అక్కరకొదగనియట్టియర్థము | లెక్క లెన్నియైనా నేమి లేకున్న నేమిరే ||

చ|| దండితో దనకుగానిధరణీశురాజ్యంబు | యెండెనేమి యది పండెనేమిరే | బెండుపడ గేశవుని బేరుకొననినాలికె | వుండెనేమి వుండకుండెనేమిరే ||

చ|| యెదిరి దన్ను గాననియెడపులగుడ్డికన్ను | మొదల దెఱచెనేమి మూసెనేమిరే | వెదకి శ్రీపతిసేవ వేడుక జేయనివాడు | చదివెనేమి చదువు చాలించెనేమిరే ||

చ|| ఆవల నెవ్వరులేని అడవిలోనివెన్నెల | కావిరి గాసెనేమి కాయకున్ననేమిరే | శ్రీవేంకటేశ్వరు జేరనిధర్మములెల్ల | తోవల నుండెనేమి తొలగిననేమిరే ||


akkarakodaganiyaTTiyarthamu (Raagam: ) (Taalam: )

pa|| akkarakodaganiyaTTiyarthamu | lekka lenniyainA nEmi lEkunna nEmirE ||

ca|| daMDitO danakugAnidharaNISurAjyaMbu | yeMDenEmi yadi paMDenEmirE | beMDupaDa gESavuni bErukonaninAlike | vuMDenEmi vuMDakuMDenEmirE ||

ca|| yediri dannu gAnaniyeDapulaguDDikannu | modala derxacenEmi mUsenEmirE | vedaki SrIpatisEva vEDuka jEyanivADu | cadivenEmi caduvu cAliMcenEmirE ||

ca|| Avala nevvarulEni aDavilOnivennela | kAviri gAsenEmi kAyakunnanEmirE | SrIvEMkaTESvaru jEranidharmamulella | tOvala nuMDenEmi tolaginanEmirE ||


[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


పేజీ లింకులు