అందులోనె వున్నావాడు ఆది

Wikisource నుండి

అందులోనె వున్నావాడు (రాగమ్: ) (తాలమ్: )

ప|| అందులోనె వున్నావాడు ఆది మూరితి | అందరాని పదవియైన నందిచ్చు నతడు ||

చ|| ఘనులిండ్ల వాకిళ్ళు కావ బొయ్యే జీవుడా | కని ణీ యాత్మ వాకిలి కావరాదా | యెనసి పరుల రాజ్య మేలబొయ్యే జీవుడా | అనిశము నీ మనో రాజ్యము నేలరాదా ||

చ|| చెలుల రూపము లెల్ల చింతించే జీవుడా | చెలగి నీ రూప మేదో చింతించ రాదా | కెలన సుఖములు భోగించేటి జీవుడా | పొలసి సుజ్ఞానము భోగించరాదా ||

చ|| చేవ సంసారాన బలిసిన యట్టి జీవుడా | భావపు టానందాన బలియ రాదా | కోవరపు సంపదల కోరేటి జీవుడా | శ్రీ వేంకటేశుని సేవగోర రాదా ||


aMdulOne vunnAvADu (Raagam: ) (Taalam: )

pa|| aMdulOne vunnAvADu Adi mUriti | aMdarAni padaviyaina naMdiccu nataDu ||

ca|| GanuliMDla vAkiLLu kAva boyyE jIvuDA | kani NI yAtma vAkili kAvarAdA | yenasi parula rAjya mElaboyyE jIvuDA | aniSamu nI manO rAjyamu nElarAdA ||

ca|| celula rUpamu lella ciMtiMcE jIvuDA | celagi nI rUpa mEdO ciMtiMca rAdA | kelana suKamulu BOgiMcETi jIvuDA | polasi suj~jAnamu BOgiMcarAdA ||

ca|| cEva saMsArAna balisina yaTTi jIvuDA | BAvapu TAnaMdAna baliya rAdA | kOvarapu saMpadala kOrETi jIvuDA | SrI vEMkaTESuni sEvagOra rAdA ||


[మార్చు] బయటి లింకులు





అన్నమయ్య పాటలు ఫైలు:Annamacharya.jpg
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |


పేజీ లింకులు