అందరుమాలినయట్టిఅధములాల
Wikisource నుండి
ప|| అందరుమాలినయట్టిఅధములాల | పొంత సంతకూటమి పొరిచూపు గాదా ||
చ|| కనక మిత్తడితోడ కలయ సరిచూచితే | అనువవునా అది దోష మవుగాక | ఘనుడైనహరితో గడుహీనదేవతల | ననిచి సరివెట్టితే నయ మవునా భువిని ||
చ|| పట్టభద్రుడు గూర్చుండేబలుసింహాసనముపై | వెట్టిబంటు బెట్టేవారు వెఱ్ఱిలేకారా | గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతల | బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా ||
చ|| కొంచక సింహముండేటిగుహ నుండవచ్చునా | పొంచి నక్కలకెల్ల బొక్కలెకాక | అంచెల శ్రీవేంకటేశు డాత్మలోనే వుండగాను | కొంచపుదైవాల పలువంచలనేకాక ||
pa|| aMdarumAlinayaTTiadhamulAla | poMta saMtakUTami poricUpu gAdA ||
ca|| kanaka mittaDitODa kalaya saricUcitE | anuvavunA adi dOSha mavugAka | GanuDainaharitO gaDuhInadEvatala | nanici sariveTTitE naya mavunA Buvini ||
ca|| paTTaBadruDu gUrcuMDEbalusiMhAsanamupai | veTTibaMTu beTTEvAru verxrxilEkArA | gaTTigA SrIharitODa kalagaMpadEvatala | beTTi kolucuTa viMduveTTi pagagAdA ||
ca|| koMcaka siMhamuMDETiguha nuMDavaccunA | poMci nakkalakella bokkalekAka | aMcela SrIvEMkaTESu DAtmalOnE vuMDagAnu | koMcapudaivAla paluvaMcalanEkAka ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
|