అందరివలెనే వున్నాడాతడా
Wikisource నుండి
ప|| అందరివలెనే వున్నాడాతడా వీడు | యిందుముఖుల గూడినా డీతడా నాడు ||
చ|| యిందరూ నేటేట జేసేయింద్రయాగపు ముద్దలు | అందుకొని యారగించినాతడా వీడు | చెంది మునులసతులసత దెప్పించుక మంచి | విందులారగించినాడు వీడానాడు ||
చ|| తొలుత బ్రహ్మదాచిన దూడలకు బాలులకు | అలరి మారుగడించినాతడా వీడు | నిలుచుండేడుదినాలు నెమ్మది వేలగొండెత్తి | యిల నావుల గాచినా డీతడా నాడు ||
చ|| బాలుడై పూతనాదుల బలురక్కసుల జంపి | అలరియాటలాడిన యాతడా వీడు | యీలీల శ్రీవేంకటాద్రి యెక్కినాడు తొలుతే | యేలెను బ్రహ్మాదుల నీతడానాడు ||
pa|| aMdarivalenE vunnADAtaDA vIDu | yiMdumuKula gUDinA DItaDA nADu ||
ca|| yiMdarU nETETa jEsEyiMdrayAgapu muddalu | aMdukoni yAragiMcinAtaDA vIDu | ceMdi munulasatulasata deppiMcuka maMci | viMdulAragiMcinADu vIDAnADu ||
ca|| toluta brahmadAcina dUDalaku bAlulaku | alari mArugaDiMcinAtaDA vIDu | nilucuMDEDudinAlu nemmadi vElagoMDetti | yila nAvula gAcinA DItaDA nADu ||
ca|| bAluDai pUtanAdula balurakkasula jaMpi | alariyATalADina yAtaDA vIDu | yIlIla SrIvEMkaTAdri yekkinADu tolutE | yElenu brahmAdula nItaDAnADu ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
|
|