అంతర్యామి అలసిత

వికీసోర్స్ నుండి
అంతర్యామి అలసిత (రాగం: శివ రంజన) (తాళం : )

అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీశరణిదే చోచ్చితిని

కోరిన కోర్కులు కోయనికట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాప పుణ్యములు నేరుపుల బోనీవు వద్దనక

జనుల సంగముల జక్క రోగములు విను విడువవు నీవు విడిపించక వినయపు దైన్యము విడువని కర్మము చనదది నీవిటు సంత పరచక

మదిలో చింతలు మయిలలు మణుగులు వదలవు నీవని వద్దనక యెదుటనే శ్రీ వేంకటేశ్వర నీవదే అదన గాచితివి అట్టిట్టనక


(Raagam: ) (Taalam: )

Antaryami alasiti solasiti Inthata nee sharanide jocchithini

Korina korkelu koyani katlu Theeravu neevavi thenchaka Bhaarapu paggalu paapa punyamulu Nerupula poneevu neevu vaddanaka

Janula sangamula chakka rogamulu Vinu viduvavu neevu vidipinchaka Vinayapu dainyamu viduvani karmamu Chanadadi neevutu shaantha parachaka

Madilo chinthalu mailalu manugulu Vadalavu neevavi vaddanaka Edutana Sri Venkateswara.. neevadi Adana gaachithivi attittanaka


బయటి లింకులు[మార్చు]





అన్నమయ్య పాటలు అన్నమయ్య
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | |