అంతరంగమెల్ల శ్రీహరికి
Wikisource నుండి
ప|| అంతరంగమెల్ల శ్రీహరికి ఒప్పించుకుంటె | వింతవింత విధముల వీడునా బంధములు ||
చ|| మనుజుడై ఫలమేది మరిజ్ఞాని యౌదాకా | తనువెత్తి ఫలమేది దయగలుగుదాకా | ధనికుడై ఫలమేది ధర్మము సేయుదాకా | పనిమాలి ముదిసితే పాసెనా భవము ||
చ|| చదివియు ఫలమేది శాంతము కలుగుదాకా | పెదవెత్తి ఫలమేది ప్రియమాడు దాకా | మదిగల్గి ఫలమేది మాధవుదలచు దాకా | ఎదుట తాను రాజైతే ఏలెనాపరము ||
చ|| పావనుడై ఫలమేది భక్తి కలిగినదాకా | జీవించి ఫలమేది చింత దీరుదాకా | వేవేల ఫలమేది వేంకటేశు గన్నదాకా | భావించితా దేవుడైతే ప్రత్యక్షమౌనా ||
pa|| aMtaraMgamella SrIhariki oppiMcukuMTe | viMtaviMta vidhamula vIDunA baMdhamulu ||
ca|| manujuDai PalamEdi marij~jAni yaudAkA | tanuvetti PalamEdi dayagalugudAkA | dhanikuDai PalamEdi dharmamu sEyudAkA | panimAli mudisitE pAsenA Bavamu ||
ca|| cadiviyu PalamEdi SAMtamu kalugudAkA | pedavetti PalamEdi priyamADu dAkA | madigalgi PalamEdi mAdhavudalacu dAkA | eduTa tAnu rAjaitE ElenAparamu ||
ca|| pAvanuDai PalamEdi Bakti kaliginadAkA | jIviMci PalamEdi ciMta dIrudAkA | vEvEla PalamEdi vEMkaTESu gannadAkA | BAviMcitA dEvuDaitE pratyakShamaunA ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | ఱ
|
|