అంచిత పుణ్యులకైతే హరి
Wikisource నుండి
ప|| అంచిత పుణ్యులకైతే హరి దైవమవుగాక | పంచమహాపాతకులభ్రమ వాపవశమా ||
చ|| కాననియజ్ఞానులకు కర్మమే దైవము | ఆనినబద్ధులకు దేహమే దైవము | మాననికాముకులకు మగువలే దైవము | పానిపట్టి వారివారిభ్రమ మాన్పవశమా ||
చ|| యేమీ నెఱుగనివారి కింద్రియములు దైవము | దోమటిసంసారి కూరదొర దైవము | తామసులకెల్లాను ధనమే దైవము | పామరుల బట్టినట్టిభ్రమ బాపవశమా ||
చ|| ధన నహంకరులకు తాదానే దైవము | దరిద్రుడైనవానికి దాత దైవము | యిరవై మాకు శ్రీవేంకటేశుడే దైవము | పరులముంచినయట్టి భ్రమ బాపవశమా ||
pa|| aMcita puNyulakaitE hari daivamavugAka | paMcamahApAtakulaBrama vApavaSamA ||
ca|| kAnaniyaj~jAnulaku karmamE daivamu | Aninabaddhulaku dEhamE daivamu | mAnanikAmukulaku maguvalE daivamu | pAnipaTTi vArivAriBrama mAnpavaSamA ||
ca|| yEmI nerxuganivAri kiMdriyamulu daivamu | dOmaTisaMsAri kUradora daivamu | tAmasulakellAnu dhanamE daivamu | pAmarula baTTinaTTiBrama bApavaSamA ||
ca|| dhana nahaMkarulaku tAdAnE daivamu | daridruDainavAniki dAta daivamu | yiravai mAku SrIvEMkaTESuDE daivamu | parulamuMcinayaTTi Brama bApavaSamA ||
[మార్చు] బయటి లింకులు
| అన్నమయ్య పాటలు | ఫైలు:Annamacharya.jpg |
|---|---|
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ
|
|